ఫోన్ బ్యాటరీ సమస్యకు ‘ప్యాసివ్ వైఫై’తో చెక్..!
ఫోన్‌లో ఇంటర్నెట్ వినియోగించినా.. బ్లూటూత్ ఆన్ చేసినా.. చూస్తుండగానే బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్తగా ‘ప్యాసివ్ వైఫై’ అనే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఉన్న వైఫై కంటే దాదాపు 10 వేల రెట్లు తక్కువ విద్యుత్తు వినియోగంతో ‘ప్యాసివ్ వైఫై’ డేటాను బదిలీ చేయగలదని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
పూర్తిగా విద్యుత్తు అవసరం లేకుండా పనిచేసే వైఫై పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రూపకర్తలు చెబుతున్నారు.ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే స్మార్ట్‌గృహాల నిర్వహణ కోసం వినియోగించే పరికరాలకు మరింత గిరాకీ పెరుగుతుందని అంటున్నారు. ఈ ‘ప్యాసివ్ వైఫై’ని 2016లో అత్యుత్తమ పరిజ్ఞానంగా ప్రఖ్యాత మస్సాసుసెట్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది.
సో.. ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే ఫోన్ బ్యాటరీలపై భారం తగ్గనుందన్నమాట!
No comments:
Post a Comment