భోజనం చివర్లో అరటిపండు కానీ, ఆయా రుతువుల్లో లభించే పండును కాని తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ధాన్యాలు, బియ్యము, గోధుమలతో చేసిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలను అధికముగా తీసుకోకూడదు. బియ్యం తేలికగా జీర్ణం కావడంతో.. రెండు కప్పులు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఒక పల్చాటి గోధుమ రొట్టె ఉన్నా ఆరోగ్యకరమే.
మోతాదుకు మించి పప్పుతో చేసిన పదార్థాలను తీసుకోవద్దు. ఒక కప్పు అరకప్పు మాత్రమే ఆహారంలో పప్పు ఉండేలా చూసుకోవాలి. పెసర్లు తీసుకోవడం ఉత్తమం. మినుములు, బొబ్బర్లు, కందులు వంటివి మితంగా తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment