అమెరికాకు చెందిన సుసాన్ మెక్‌లారో అనే ఫ్లోరిస్ట్ చిన్నపాటి మొక్కలతో కూడిన ఈ ఆభరణాలను తయారు చేసింది. చిన్నచిన్న మొక్కలుగా ఉన్నప్పుడే చేతి రింగులకు.. చెవి దుద్దులకు.. ఆభరణాలకు వీటిని అమర్చుతారట. చూడడానికి ఆకుపచ్చని రాళ్లు పొదిగినట్లుగా ఉండే ఈ ఆభరణాలు పలువురిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు నుంచి నాలుగు వారాలు పెరిగిన తర్వాత.. ఈ మొక్కలను పూల కుండీల్లో ఎంచక్కా పెంచుకోవచ్చంటున్నారు. వీటివల్ల ఆభరణాలు అందంగా కనిపించడమే కాదు.. ఇంటినీ ఉద్యానవనంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు.
No comments:
Post a Comment