ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) పర్సనల్ డిపార్ట్‌మెంటైన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య: 163, పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అనేది ఎయిర్‌ఫోర్స్, నేవల్‌లో అభివృద్ధి & రూపకల్పనకు సంబంధించినది.
మొత్తం ఖాళీల సంఖ్య: 163, పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అనేది ఎయిర్‌ఫోర్స్, నేవల్‌లో అభివృద్ధి & రూపకల్పనకు సంబంధించినది.
విభాగాలవారీగా
పార్ట్ 1 డిసిప్లేన్ పోస్టులు: గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేసేవి
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 40 పోస్టులు (జనరల్-17, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-4, పీహెచ్‌సీ-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
మెకానికల్ ఇంజినీరింగ్- 35 పోస్టులు (జనరల్-19, ఓబీసీ- 8, ఎస్సీ-5, ఎస్టీ- 2, పీహెచ్‌సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్- 26 పోస్టులు (జనరల్- 13, ఓబీసీ- 7, ఎస్సీ- 4, ఎస్టీ- 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
మ్యాథమెటిక్స్-7 పోస్టులు (జనరల్- 3, ఓబీసీ- 2, ఎస్సీ- 1, ఎస్టీ- 1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో మాస్టర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్)లో
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 10 పోస్టులు (జనరల్-6, ఓబీసీ-3, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
ఫిజిక్స్-6 పోస్టులు (జనరల్-2, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో మాస్టర్ డిగ్రీ (ఫిజిక్స్)లో ఉత్తీర్ణత.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్-5 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
కెమికల్ ఇంజినీరింగ్-9 పోస్టులు (జనరల్- 3, ఓబీసీ- 2, ఎస్సీ- 2, ఎస్టీ- 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
కెమిస్ట్రీ-5 పోస్టులు (జనరల్- 3, ఓబీసీ- 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత.
టెక్స్‌టైల్స్ ఇంజినీరింగ్- 2 పోస్టులు (జనరల్- 1, ఎస్సీ- 1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో టెక్స్‌టైల్స్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
సివిల్ ఇంజినీరింగ్-8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ మెటలర్జికల్ ఇంజినీరింగ్-1 పోస్టు (జనరల్)
పార్ట్ 2 డిసిప్లేన్ పోస్టులు : అకడమిక్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేవి
అగ్రికల్చర్ సైన్స్-1 పోస్టు (జనరల్), యానిమల్ సైన్స్-1 పోస్టు (ఓబీసీ), కాగ్నిటివ్ సైన్స్-1 పోస్టు (జనరల్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్, యానిమల్ సైన్స్, కాగ్నిటివ్ సైన్స్‌లో ఉత్తీర్ణత
బయోమెడికల్ ఇంజినీరింగ్-1 పోస్టు (ఎస్సీ), ఫైర్ టెక్నాలజీ, సేఫ్టీ ఇంజినీరింగ్-5 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ, సేఫ్టీ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.
వయస్సు: 2016 ఏప్రిల్ 10 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యుర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
గమనిక: జర్మన్, ప్రెంచ్, రష్యన్, జపనీస్/చైనీస్ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
పే స్కేల్: రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 5400 (సుమారుగా నెలకు 60,000/- వరకు ఢిల్లీ లాంటి ప్రదేశంలో ఉంటుంది)
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు). ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా.
గేట్ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం మార్కులను కేటాయించారు
గేట్ 2015/2016 స్కోర్ చూపిన ప్రతిభ ఆధారంగా ఇంజినీరింగ్ అభ్యర్థులను, అకడమిక్ మార్కుల ఆధారంగా నాన్ ఇంజినీరింగ్ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత తుది అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక కావడానికి 70 శాతం మార్కులు జనరల్ అభ్యర్థులు, 60 శాతం మార్కులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు తప్పనిసరిగా సాధించాలి.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశాలు: హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ/ఇతర ప్రదేశాలలో 2016 మే నెలలో రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్/ డీఆర్‌డీవో ప్రకటిస్తుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. అర్హత గల అభ్యర్థులందరు HTTP://RAC.GOV.IN అను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపాలి.
అర్హతలకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2016 మార్చి 20
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2016 ఏప్రిల్ 10 ( సాయంత్రం 5 గం॥ వరకు)
వెబ్‌సైట్: WWW.ADA.GOV.IN/WWW.DRDO.GOV.IN
No comments:
Post a Comment