Monday, 7 March 2016

6,57,595 పదవ తరగతి పరీక్షకు హాల్ టిక్కెట్లు ....

6,57,595 విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు... ఏర్పాట్లు చేయండి... మంత్రి గంటా...

ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో, అన్ని జిల్లాల డిఈవోలతో సమీక్ష  జ‌రిగింది, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులకు ఎలాంటి కొరత రాకూడ‌దని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వారికి సరిపడా  బల్లలు, ఇతర సదుపాయాలు కల్పించాల‌ని, వసతులు లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇలాగే అన్ని పరీక్షా కేంద్రాల్లో 100 శాతం సౌకర్యాలు కల్పించాలని  మంత్రి గంటా శ్రీనివాసరావు వారికి ఆదేశించారు. ఈ సంవత్సరం 6,57,595 పదవ తరగతి పరీక్షకు హాల్ టిక్కెట్లు  జారీ చేశారు. ఇందులో 6,21,517 రెగ్యులర్ విద్యార్ధులు మరియు 36,078  ప్రైవేటు   విద్యార్ధులు ఉన్నార‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,078 పాఠశాలలు ఉన్నాయ‌ని మంత్రి సూచించారు. 3,028 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తార‌ని తెలిపారు.విద్యార్థులకు  పరీక్షా కేంద్రాల‌కు వెళ్ళ‌డానికి ప్రత్యేక  ఏపీఎస్ఆర్టీసీ బస్సుల  ద్వారా ఉచిత ప్రయాణ వలసలను ఏర్పాటు చేయాల‌ని  మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.

No comments:

Post a Comment