Saturday 5 March 2016

దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు

దంతాలు తెల్లగా మెరిపించడానికి కొన్ని సులభమైన మరియు ఫాస్టర్ పద్దతుల ద్వారా దంతాల మీద మరకలు లేదా దంతాల డిస్క్ కలర్ ను తొలగించుకోవడానికి కోసం డెంటిస్ట్ ను కలుస్తుంటాము. దంతా మీద ఉండే మరకలను త్వరగా తొలగించడానికి డెంటిస్ట్స్ కొన్ని స్పెషలైజ్డ్ వైటనింగ్ స్ట్రిప్స్ మరియు ఫ్లూయిడ్స్ వాడుతుంటారు . అయితే ఇవి ఖర్చుతో కూడుకొన్నవి, కాబట్టి, ఇంట్లోనే చౌకన, ఎఫెక్టి టీత్ వైటనింగ్ హోం రెమెడీస్ మరియు పద్దతులను ప్రయత్నించడం తెల్లని దంతాలను పొందవచ్చు . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . మరియు ఇవి చాలా త్వరగా ఫలితాలను అందిస్తాయి. మరి ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం....

  • బేకింగ్ సోడా మరియు నిమ్మరసం: ఈ రెండి పదార్థాలు ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులే . దంతామీద, మరియు లోపల నుండి మరకలను వదిలించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచుర్ ను బేకింగ్ సోడా న్యూట్రలైజ్ చేసి దంతాలను శుభ్రపరుస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ లా కలిపి బ్రెష్ తో దంతాల మీద రుద్ది 5నిముషాల తర్వాత నోటిని శుభ్రపరుచుకుంటే తళతళలాడే దంతాలు మీ సొంతమవుతాయి.
  • కొబ్బరి నూనె: చాలా వరకూ కొబ్బరి నూనెలో స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి . కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ దంతాల మీద పాచికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. మరియు నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది . కొద్దిగా కొబ్బరి నూనెను చేతి వేళ్లతో దంతాల మీద అప్లై చేసి రుద్దాలి . మింగకుండా, కొద్దిసేపటి తర్వాత బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి.
  • క్రంచీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్ తినాలి: దంతాలను శుభ్రపరచడంలో మరియు దంతాలు స్ట్రాంగ్ గా మార్చడంలో క్రంచీ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఉదాహరణకు ఆపిల్స్, సెలరీ, క్యారెట్స్ ను అప్పుడప్పుడు తింటుండాలి . వీటిలో ఉండే అబ్రెస్సీవి స్ట్రక్చర్ దంతాలను రుద్దడం మరియు దంతాల మీద ఏర్పడ్డ ఎల్లో స్టెయిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది . మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నోట్లో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది.
  • బేకింగ్ సోడా స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ..బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు మెత్తగా చేసిన స్ట్రాబెర్రీ మిక్స్ చేసి, చేతి వేళ్ళతో దంతాల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి . రెగ్యులర్ టూత్ పేస్ట్ తో రుద్ది కడగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు బేకింగ్ సోడా: స్టాంగ్ మౌత్ వాష్ ను తయారుచేసుకోవాలి. బేకింగ్ సోడా మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కప్పులో తీసుకొని నోట్లో పోసుకుని పుక్కలించి , శుభ్రం చేసుకోవాలి . దీన్ని రెగ్యులర్ గా చేయకూడదు.
  • టూత్ పేస్ట్ మిక్స్: రెగ్యులర్ గా మీరు ఉపయోగించే టూత్ పేస్ట్ కి కొద్దిగా సోడా, టేబుల్ సాల్ట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి జోడించాలి . ఈ మివ్రామన్ని ఉపయోగించి బ్రష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారానికొసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.
  • ఆపిల్ సైడర్ వెనిగర్: జుట్టు ఆరోగ్యానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచిది , కానీ ఎల్లో దంతాలను తెల్లగా మార్చడంలో కూడా గ్రేట్ గా పనిచేస్తుంది. బ్రష్ చేయడానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తో గార్గిలింగ్ చేయడం మంచిది.
  • మౌత్ వాష్: రెగ్యులర్ మౌత్ వాస్ కూడా ఉపయోగపడుతుంది . బ్లూ లేదా రెడ్ కలర్ మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ఆల్కహాల్ ఫీ మౌత్ వాష్ లను వాడాలి.
  • తులసి వాడటం: ఇంట్లో తయారుచేసుకొనే పదార్థాలు కూడా దంతాలను తెల్లగా మార్చుతాయి . ఎండబెట్టి తులసి ఆకులను పౌడర్ చేసి, దాంతో దంతాలకు రెగ్యులర్ బ్రెష్ చేసుకోవచ్చు .
  • సిట్రస్ పండ్లు తిన్నతర్వాత మౌత్ వాష్: ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పైనాపిల్, జామ వంటి సిట్రస్ పండ్లలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది . అలాగని వీటిని తినకుండా మానేయడం కాదు. వీటినిలో న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు వీటిని తిన్న ప్రతి సారి మౌత్ వాష్ చేసుకోవడం తప్పనిసరి
  • డార్క్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి: కొన్ని ఆహారాలు డార్క్ పిగ్మేంటేషన్ కలిగి ఉండటం వల్ల దంతాల మీద మరకలు పడటానికి కారణం అవుతుంది , కాబట్టి వీటిని తినడం మానేయడం మంచిది . ఉదాహరణకు బ్లూబెర్రీస్, సోయా సాస్, మరియు మరినెరా సాస్ వంటివి తినకపోవడం మంచిది.
  • కాఫీ, టీ , బెవరేజెస్ కు దూరంగా: చాలా మందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఎక్కువ. కాబట్టి వీటితో పాటు కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ను కూడా తాగడం మానేయడం మంచిది. ఇవి దంతాల మీద ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తాయి 
  • .
  • స్మోకింగ్ మానేయాలి: స్మోకింగ్ మానేయడం వల్ల దంతాలు తెల్లగా మారడం మాత్రమే కాదు , ఇది ఊపిరితిత్తులు మరియు హార్ట్ కు చాలా మంచిది .

1 comment: