స్మైల్ గురించి మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు:
చిరునవ్వుకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అమ్మాయి నవ్వుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఎవరినైనా పలకరిచ్చేటప్పుడు చిన్న చిరునవ్వు చిందిస్తే అందం, ఆప్యాయత. అయితే చిరునవ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఎలాంటి కారణం లేకుండా నవ్వడానికి ఇప్పటికీ.. చాలా మంది ఇష్టపడరు. మనం సాధారణంగా నవ్వుకి కారణం ఉంటేనే నవ్వుతాం. అలాగే ఏదైనా గుడ్ న్యూస్ లేదా ఏదైనా సంతోషకరమైన విశేషం ఉంటేనే నవ్వుతాం. కానీ ఊరికే నవ్వడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని.. అందుకే నవ్వడానికి కారణం అవసరం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. చిరునవ్వు మనుషులకు ప్రకృతి ప్రసాదించిన గిఫ్ట్ గా భావిస్తారు. కానీ కుక్కలు కూడా నవ్వుతాయని, అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేవు,,,
- ఆరోగ్యానికి నవ్వు మిమ్మల్ని మంచి వ్యక్తి, ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారుస్తుంది. నవ్వు వల్ల ఎండోర్ఫిన్స్ మెదడులో రిలీజ్ అవుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది.
- కంటాజియస్ నవ్వు అనేది ఒక వ్యాధి లాంటిది. ఎందుకంటే.. ఒకరి నుంచి ఒకరికి ఇది సోకుతుంది. ఒక నవ్వడం చూస్తే మనకూ నవ్వు వచ్చేస్తుంది. ఇదే నవ్వు స్పెషాలిటీ.
- ఎట్రాక్టివ్ లుక్ నవ్వుతో తమ పార్ట్ నర్ ని మహిళలు చాలా ఎట్రాక్ట్ చేస్తారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల అందం రెట్టింపవుతుంది.
- ఫ్రెండ్స్ మీరు నవ్వినప్పుడు ఎదుటివాళ్లు మీపై మంచి ఫీలింగ్ పొందుతారు. ఫ్రెండ్లీ పర్సన్ అని భావిస్తారు. దీనివల్ల రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి.
- లైఫ్ స్పామ్ నవ్వుతూ ఉండేవాళ్లు, ఎప్పుడూ నవ్వడాన్ని ఇష్టపడేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారని.. స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి నవ్వుతూ ఉంటే.. ఎక్కువకాలం బతికేయచ్చు.
- సోషియబుల్ ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పార్టీల్లోనైనా.. నవ్వుతూ ఉండే వ్యక్తి.. చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనా పార్టీలో ఉన్నప్పుడైనా.. మీరు నవ్వితే అందరినీ ఎట్రాక్ట్ చేయచ్చు
- సంతోషం స్మైల్ వల్ల సంతోషం చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. జీవితంపై సంతృప్తిని కలిగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి.
No comments:
Post a Comment