Saturday 12 March 2016

అదిలాబాద్‌లో..............ఆపిల్‌

అదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలంలో ఆపిల్‌ పంటకు కావల్సిన వాతవరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని సీసీఎంబి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సెంటర్ ఫర్ సెల్యూలర్ మా లిక్యూలర్ బయోలాజికల్ కు చెందిన సీనియర్ శాస్త్రవేతలు డా.ఏ.వీరభద్రరావ్, డా.రమేశ్ అగర్వాల్ ఇక్కడి వాతవరణంపై రెండేళ్లుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కెరమెరి మండలం ధనోర గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ చేనులో సాగు చేస్తున్న బత్తాయి(మోసంబీ), కమల(సంత్ర)తోటలతోపాటు ఇటీవల నాటిన మామిడి, ఆపిల్ మొక్కలను వారు పరిశీలించారు.


చలికాలంలో సుమారుగా 15 రోజులు ఇక్కడ ఉష్ణోగ్రత కనిష్టంగా మూడు నుంచి ఏడు డిగ్రీల వరకు నమోదవుతుందనీ, అది ఆపిల్ సాగుకు అనుకూలమనీ పేర్కొన్నారు. ఆపిల్ సాగుకు స్థానిక రైతులు ముందుకు రావాలని సూచించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామనీ, ఎప్పటికప్పుడు మెళకువలు అందిస్తామనీ చెప్పారు. ఆపిల్ సాగుపై వేసవిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఆంధ్రాప్రాంతంలోని అరకు, చింతపల్లి, లంబసింగిడి ప్రాంతంలో ఆపిల్ సాగు ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. అక్కడున్న వాతవరణ పరిస్థితులు కెరమెరి మండలంలోనూ ఉ న్నాయన్నారు.
జిల్లా ఉద్యావన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఏ సతార్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ధనోర గ్రామానికి చెం దిన 10 మంది రైతులకు ఉచితంగా 25 నుండి 50 ఆపిల్ మొక్కలు అందిస్తామన్నారు. వారం రోజుల్లోగా చేన్లలో గుంతలు తవ్వుకొని, మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పాలీహౌస్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు సాగు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఆపిల్ సాగుకు ఆసక్తి ఉన్న రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద మొక్కలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు.
ఈ విధానం ద్వారా ఎకరం భూమికి 8 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వ్యవసాయ సాగుపై ప్రభు త్వం అందిస్తున్న రాయతీలను సద్వినియోగం చే సుకొని, రైతులు అభివృద్ధి చెందాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ సిబ్బంది సూర్యకుమార్, రమేశ్, రైతులు ఉన్నారు.

No comments:

Post a Comment