Tuesday 15 March 2016

మానవాళికి మరో ప్రాణాంతక వైరస్ ముప్పు

వాషింగ్టన్: 
sars-virusప్రాణాంతక వ్యాధులు ఎబోలా, జికాల ముప్పు నుంచి ఇంకా పూర్తిగా బయటపడకుండానే.. మానవాళికి మరో వైరస్ ముప్పు పొంచి ఉందనే విషయం అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. చైనాలో హార్స్‌షూ అనే గబ్బిలం తెగలో సార్స్ (సీవియర్ అక్యుట్ రెస్పిటరీ సిండ్రోమ్) లాంటి వైరస్ ఉందని గుర్తించారు. డబ్ల్యూఐవీ1-సీవోవీగా వ్యవహరిస్తున్న ఈ వైరస్‌కు సార్స్-సీవోవీ లక్షణాలున్నట్టు తేల్చారు.

ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన సుధాకర్ ఎస్ అగ్నిహోత్రం పాలుపంచుకొన్నారు. ఫ్లూతోపాటు పొడిదగ్గు, న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో నిమ్ము పేరుకుపోవడం, వ్యాధిగ్రస్తుడు తీవ్రమైన శారీరక ఒత్తిడికి లోనవ్వడం ఈ వైరస్ లక్షణాలని పేర్కొన్నారు. ఈ వైరస్ అత్యంత వేగంగా మానవులకు సోకే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు. వాతావరణంలోని కణాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. ఒకవేళ ఈ వైరస్ విస్తరిస్తే ప్రజారోగ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వ్యాధి విస్తరించినట్లయితే చికిత్స కోసం సార్స్ నివారణ కోసం తయారు చేసిన ఔషధాలను వాడుకోవచ్చని సూచించారు.

No comments:

Post a Comment