ఎండలు మళ్లీ షురువయ్యాయి. ఉదయం అయ్యిందంటే చాలు భానుడు నిప్పులు కక్కే అగ్ని గుండంలా మారుతున్నాడు. ఎక్కడ చూసినా చల్లని పండ్ల రసాలు, శీతల పానీయాలు, చెరుకు రసం అమ్మే చిరు వ్యాపారులు ఎక్కువైపోయారు. బయటికెళ్తే ఇవన్నీ ఎలాగో దొరుకుతాయి. కానీ ఇవి కాకుండా ఈ ఎండాకాలంలో మనల్ని మనమే సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. చల్లని మజ్జిగ లేదా పెరుగు, లేదా వాటితో తయారుచేసిన లస్సీ, రైతా ఏదైనా ఫర్వాలేదు. వీటికి వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు ఇవి బాగా పనిచేస్తాయి.
2. కొబ్బరినీటిలో అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలతోపాటు శరీరాన్ని చల్లబరిచే గుణాలు కూడా ఉన్నాయి. శరీరానికి కావల్సిన సహజమైన చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్, ఖనిజ లవణాలను అందించడంతోపాటు దేహంలో ద్రవాలు తగ్గకుండా చూస్తాయి.
3. వేసవి కాలంలో ఎక్కువగా లభించే పుచ్చకాయలు శరీరాన్ని చల్లబరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి కావల్సిన ఖనిజ లవణాలు, పోషకాలను పుచ్చకాయలు అందిస్తాయి.
4. మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే కీరదోసలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటుంది. ఇవి డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి.
5. శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుదీనాలో కూడా ఉన్నాయి. పుదీనాతో చేసిన జ్యూస్ లేదా రైతా దేహానికి ఉత్తేజాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది. దీంతో ఎల్లప్పుడూ తాజాగా ఉండొచ్చు. అంతేకాదు వేసవి బారి నుంచి రక్షించుకోవచ్చు.
6. ఆకుపచ్చని కూరగాయలను కూడా వేసవిలో ఎక్కువగా తినాలి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే వీటిని వేసవికాలంలో అధికంగా ఉడికించకుండా తింటేనే మంచి ఫలితం కనిపిస్తుంది.
7. ఉల్లిపాయల్లోనూ శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. కూరలు, రైతాలు, చట్నీ, సలాడ్స్ రూపంలో ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా ఎరుపు రంగులో ఉండే ఉల్లిపాయలైతే ఇంకా మంచిది. ఎండదెబ్బ నుంచి కాపాడే గుణాలు ఉల్లిపాయల్లో ఉన్నాయి.
8. రూపంలో, రుచిలో దోసకాయలను పోలి ఉండే తర్బూజా పండ్లలో 90 శాతం నీరే ఉంటుంది. వీటిని వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా, ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.
9. వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం కలిపి తయారు చేసిన చల్లని షర్బత్‌ను తాగితే శరీరానికి చాలా మంచిది.
10. ఇక చివరిగా ఐస్‌క్రీంలు. ప్రధానంగా ఎండా కాలంలోనే వీటిని అందరూ ఎక్కువగా తింటారు. వీటి వల్ల శరీరానికి చల్లదనం చేకూరుతుంది. అయితే కొవ్వు, చక్కెరల దృష్ట్యా ఐస్ క్రీంను కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. ఫ్యాట్ తక్కువగా ఉన్న ఐస్ క్రీం అయితే ఇంకా మంచిది.

No comments:
Post a Comment