ఇండియన్స్ ఫాటించే మూఢనమ్మకాల వెనకున్న రహస్యాలు..............
చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దవాళ్లు ఎన్నో ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మిస్టరీగా ఉంటాయి. ఎందుకో కారణం తెలియకుండానే ఇప్పటికీ కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అంతేకాదు.. పెద్దవాళ్లు చెప్పిన విషయాలు కావడంతో.. పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఇప్పటికీ కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు ఎన్నో సంత్సరాలుగా పాలో అవుతున్న కొన్ని ఆచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కానీ మనం పెరిగి పెద్దవాళ్లైయ్యాక అవన్నీ కేవలం మూఢనమ్మకాలే అన్న విషయం అర్థమవుతోంది. ఏ రోజు ఏం చేయకూడదు, ఏ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని రకాల నమ్మకాలు పాటిస్తూ ఉంటారు. ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు కొన్ని ఆచారాలు కేవలం నమ్మకం, భయంతో పాటిస్తున్నవే చాలా ఉన్నాయి. అవి పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతోనే ఆచార సంప్రదాయలు ఉన్నాయి. అయితే కొన్నింటి వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉంటే.. మరికొన్నింటి వెనక భయం ఉంది. అయితే చాలామంది ఆ ఆచారాలు ఎందుకు పాటిస్తున్నామో తెలియకుండానే.. ఇతరులకు కూడా సలహా ఇస్తుంటారు. అలాంటి మూఢనమ్మకాల వెనక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం

- మంగళవారం హెయిర్ కట్ ఇప్పటికీ చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. మంగళవారం కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి అనుమతించరు. ఎందుకు అంటే మాత్రం చేసుకోకూడదు అని చెబుతారు. కానీ కారణం చెప్పరు. అయితే దీనికి అసలు కారణం వింటే ఆశ్చర్యపోతారు. గతంలో సోమవారాలు సెలవు ఉండేది. దీంతో అందరూ సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్లు. దీంతో మంగళవారాలు సెలూన్ షాపులు మూసేసేవాళ్లు. దీంతో ఇదో మూఢనమ్మకంగా ఇప్పటికీ మంగళవారం కటింగ్ చేయించుకోకూడదని మూఢనమ్మకం పెట్టుకున్నారు.
- ఇంట్లో గొడుగు ఓపెన్ చేయరాదా ? ఇంట్లో గొడుగు ఓపెన్ చేయకూడదు, మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కానీ మంచిది కాదనేది మూఢనమ్మకం. దీని వెనక అసలు కారణం.. గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే.. చుట్టూ ఉన్న వస్తువులు డ్యామేజ్ అవుతాయని అలా చెప్పేవాళ్లు. ఇది అసలు కారణం. కానీ గొడుగు ఇంట్లో ఓపెన్ చేస్తే ఏ అనర్థం జరుగుతుందో అని చాలా మంది భయపడుతుంటారు.
- నిమ్మకాయ, పచ్చిమిర్చి వాహనాలు లేదా ఇంటి గుమ్మం దగ్గర చాలామంది నిమ్మకాయ, పచ్చిమిర్చి, పండు మిర్చి కలిపి ఒక దండలా వేలాడదీసి ఉంటారు. ఇలా కట్టడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావని, వాహనాలలో ప్రయాణం సాఫీగా జరుగుతుందని నమ్ముతారు. కానీ.. దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇలా దారానికి కట్టి ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఇంట్లోకి క్రిమీకీటకాలు, దుర్వాసన, దోమలు రాకుండా అరికడతాయని ఇలా కట్టేవాళ్లు. కానీ.. దీన్ని మూఢనమ్మకంగా పాటిస్తున్నారు.
- అద్దం పగలడం ఇంట్లో అద్దం పగిలితే.. బ్యాడ్ లక్ అని చాలామంది ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ.. అలాంటిదేమీ లేదు. పూర్వం అద్దం కొనాలంటే.. చాలా ఖర్చుతో కూడిన పని. అందులోనూ.. తక్కువ క్యాలిటీవి దొరికేవి. దీంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అద్దంతో జాగ్రత్త పగలకూడదనే సింపుల్ ట్రిక్ ప్లే చేశారు. దీన్ని ఏదో చెడు జరుగుతుందనే భయం క్రియేట్ అయింది.
- సాయంత్రం గోళ్లు కట్ చేసుకోకూడదా ? సూర్యాస్తమయం తర్వాత గోళ్లు, జుట్టు కట్ చేయించుకోరాదని ఒక నమ్మకం ఇండియాలో బలంగా ఉంది. కానీ సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కట్ చేసుకుంటే.. చీకట్లో చిగుళ్లకు తగులుతుందేమో అన్న భయంతో.. ఈ నమ్మకాన్ని క్రియేట్ చేశారు. దీన్ని మూఢనమ్మకంగా ఫాలో అవుతూ వస్తున్నారు.
- గ్రహణం సమయంలో గర్భిణీలు గ్రహణం సమయంలో గర్భిణీలకు చాలా నిబంధనలు ఉంటాయి. గ్రహణం సమయంలో గర్భిణీలు వెజిటబుల్స్ కట్ చేయరాదు, బయటకు కూడా వెళ్లకూడదని చెబుతుంటారు. అయితే గ్రహణం సమయంలో యూవీ కిరణాలు పొట్టలోని బిడ్డకు హాని కలిగిస్తాయని.. బయటకు వెళ్లకూడదనే నిబంధన పెట్టారు.
- సాయంత్రం ఇల్లు ఊడవకూడదు సాయంత్రం పూట ఇల్లు ఊడవడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు. ఇప్పటికీ చీకటి పడిందంటే.. చీపురు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తారు. కానీ.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా ? అప్పట్లో చీకటి పడిందంటే.. పవర్ లేక వెలుతురు చాలా తక్కువగా ఉండేది. దీంతో తెలియకుండా కిందపడిన ఏదైన నగలు, వస్తువులు చెత్తతో పాటు డస్ట్ బిన్ లోకి వేసేస్తారేమో అన్న భయంతో.. ఈ నిబంధన పెట్టారు. కానీ సాయంత్రం ఇల్లు ఊడిస్తే.. చెడు జరుగుతుందేమో అని ఆ నిబంధనను అలా ఫాలో అవుతూ వస్తున్నారు. చూశారుగా ఇవి మన ఇండియన్స్ తెలిసీ, తెలియక పాటిస్తున్న ఆచారాలు, మూఢనమ్మకాలు. కాబట్టి కారణం తెలుసుకోకుండా.. అనవసర ఆందోళనకు గురికాకుండా.. తెలియని వాళ్లకు వివరించండి.
No comments:
Post a Comment