రెబ్బెన న్యూస్: టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం::
టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం: రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలో అన్ని టెలికాం కంపెనీల రిటైలర్ల...
Wednesday, 30 March 2016
క్రైస్తవ ప్రచారకులూ రావొద్దు......!
- నల్గొండ జిల్లా పొనుగోడు గ్రామస్తుల నిర్ణయం
కనగల్, మార్చి 29: గ్రామ పెద్దల అనుమతి లేనిదే క్రైస్తవ మత ప్రచారకులు ఊళ్లోకి ప్రవేశించరాదని నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామస్థులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామశివారులో బోర్డును కూడా ఏర్పాటుచేశారు. గ్రామంలో 650 కుటుంబాలుండగా దాదాపు అందరూ హిందువులే. అయితే, కొన్నేళ్లుగా క్రైస్తవ మతప్రచారకులు వస్తూ నిరక్షరాస్యులైన పలువురికి మతబోధతో 20 కుటుంబాలను మతం మార్చేశారు. మరికొన్ని కుటుంబాలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వృద్ధులను, వితంతువులను, అమాయకులను బలవంతంగా మతం మార్చుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనికితోడు ఇటీవల ఓ కుటుంబంలో క్రైస్తవం పుచ్చుకున్న భర్త ఎల్లమ్మ భక్తురాలైన భార్యను కూడా మతం మారాలని వేధించడం మొదలుపెట్టాడు. భర్త తరచూ కొడుతుండడం తో ఆ బాధ తట్టుకోలేని ఆమె వివాదాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లింది. పెద్ద మనుషులు వారిద్దరికి సర్దిచెప్పి ఎవరి ఇష్టానుసారం వారి దేవుడిని కొలుస్తూ సఖ్యతతో ఉండాలని సూచించారు. కానీ భర్త ఆ మహిళను వేధిస్తూనే ఉండడం.. ఆమె పెద్ద మనుషుల వద్దకు రావడం నిత్యకృత్యమైంది. మరో సంఘటనలో.. గ్రామానికి చెందిన ఓ యువతిని వేరే ప్రాంతానికి చెందిన వృద్ధ పాస్టర్‌కు ఇచ్చి ఇష్టం లేని వివాహం చేశారు. ఆమె కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. దీంతో.. ఎన్నో రకాల సమస్యలకు కారణమైన క్రైస్తవ మతప్రచారం చేస్తున్న పాస్టర్లను గ్రామంలోకి రాకుండా నిషేధం విధించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఊరి శివార్లలో వారు ఏర్పాటు చేసిన బోర్డు ఇప్పుడు మండలంవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tuesday, 29 March 2016
Monday, 28 March 2016
G00D Morning**
జాతీయ ఉత్తమ చిత్రం బాహుబలి!
ఉత్తమ తెలుగు చిత్రం కంచె, ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్, ఉత్తమ నటి కంగనారనౌత్, బాజీరావ్ మస్తానీకి అవార్డుల పంట!
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తరుణమిది. 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎందరో మహామహులకు సాధ్యం కాని స్వప్నం బాహుబలి చిత్రంతో నెరవేరింది. రాజమౌళి కలల చిత్రం బాహుబలి 63వ జాతీయ అవార్డుల విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికై తెలుగు వాడు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచి చరిత్రను సృష్టించింది. మన సాంకేతిక నిపుణులు, నటీనటుల ప్రతిభను దిగంతాలకు చాటిచెప్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 600కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి తెలుగు చిత్రపరిశ్రమ వైపు ప్రపంచ సినిమా ఆసక్తిగా చూసేలా చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై బాహుబలి కొత్త చరిత్రకు నాంది పలికింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఖ్యాతిని దక్కించుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ పీకూ చిత్రంలో ఓ విచిత్రమైన వ్యాధిగ్రస్తుడి పాత్రలో అద్వితీయ అభినయంతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైయ్యారు. 73 ఏళ్ల వయసులోనూ తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్నారు. గత ఏడాది క్వీన్ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా నిలిచిన కంగనా రనౌత్ మరోసారి ప్రతిభను చాటింది. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. పీష్వా బాజీరావ్, మస్తానీ జంట అమర ప్రేమగాథతో తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ చిత్రం ఈ పురస్కారాల్లో సత్తాను చాటింది. ఉత్తమ దర్శకుడు, సహాయనటి, సినిమాటోగ్రాఫర్‌తో పాటు ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను సాధించి అత్యధిక జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ జాతీయ అవార్డుకు ఎంపికైయ్యారు. బాజీరావ్ తల్లి రాధాభాయి పాత్రలో నటించిన బాలీవుడ్ నటి తన్వీ ఆజ్మీ ఉత్తమ సహాయనటిగా నిలిచారు.
తమిళ నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించిన విసరాణై చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఓ ఆటోడ్రైవర్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మన్ననల్ని అందుకుంది.ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించిన దర్శకుడు సముద్రఖని ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఎడిటర్ బాధ్యతల్ని నిర్వహించి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన కిషోర్ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గురునానక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆయన భోధనల ఆధారంగా తెరకెక్కిన పంజాబీ చిత్రం నానక్ షా ఫకీర్ చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ మేకప్, ఉత్తమ కాస్ట్య్టూమ్ డిజైన్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. తెలుగులో ఇవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు చిత్రం స్ఫూర్తితో హిందీలో తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ గేయరచయిత విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడితో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలకు గాను పీకూ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ రూపొందించిన కంచె చిత్రం నిలిచింది. రెండవ ప్రపంచ యుద్దం, ప్రేమ అంశాల నేపథ్యంలో కులవ్యవస్థను చర్చిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా చక్కటి విజయాన్ని దక్కించుకుంది. బాల దర్శకత్వంలో రూపొందిన తారాయ్ తప్పట్టాయ్ చిత్రానికిగాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఇళయరాజా అవార్డును కైవసం చేసుకున్నారు. తొలి చిత్ర దర్శకుడిగా ఇందిరాగాంధీ జాతీయ అవార్డుకు మసాన్ చిత్రాన్ని తెరకెక్కించిన హైదరాబాద్‌కు చెందిన నీరజ్ ఘయ్‌వాన్ ఎంపికయ్యారు.
బాహుబలి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఊహల్లోంచి పుట్టిన అద్భుత సృష్టి. ఈ కలను సాకారం చేసుకోవడానికి అలుపెరగని పోరాటం చేశారు. ఎన్నో కష్టాలకోర్చారు. మూడేళ్ల శ్రమతో పాటు వందల కోట్ల వ్యయం, వేల సంఖ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాలు అన్నింటికీ మించి రాజమౌళి దర్శకత్వ ప్రతిభ బాహుబలి చిత్రాన్ని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించేలా చేసి వందేళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. అనితర సాధ్యంకాని ఎన్నో రికార్డులు బాహుబలి పేరిట లిఖించబడ్డాయి. 600 కోట్లకు పై చిలుకు వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా కీర్తిపతాకాల్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ఈ చిత్రం విదేశీ వేదికలపై సత్తా చాటింది. తెలుగు వాడి ప్రతిభాపాటవాల్ని విశ్వవ్యాప్తం చేసింది. బాహుబలిని తెరపై ఆవిష్కరించడానికి రాజమౌళి బృందం పెద్ద సంగ్రామమే చేసింది. విమర్శలు, సాధ్యాసాధ్యాలు, బడ్జెట్ పరిమితులు, గాయాలు..ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ఉత్తమ జాతీయ చిత్రం : బాహుబలి
ఉత్తమ దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పీకూ)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ సహాయ నటుడు: సముద్రఖని (విసరాణై)
ఉత్తమ సహాయ నటి : తన్వీ ఆజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : బాహుబలి
ఉత్తమ గేయ రచయిత : వరుణ్ గ్రోవర్ (దమ్ లగాకే హైసా)
ఉత్తమ నృత్యదర్శకుడు : రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఎడిటింగ్ : టీ ఈ కిషోర్ (విసరాణై)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు : ఇళయరాజా (తారాయ్ తప్పట్టాయ్)
ఇందిరాగాంధీ అవార్డు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : నీరజ్ ఘయ్వాన్ (మసాన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బజరంగీ భాయిజాన్
ఉత్తమ నేపథ్య గాయని: మోనాలీ ఠాకూర్( దమ్ లగాకే హైసా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: మహేష్ కాలే (కత్యార్ కల్జాత్ షుసాలి) (మరాఠీ)
నర్గీస్ దత్ అవార్డు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : నానక్ షా ఫకీర్( పంజాబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎమ్ జయచంద్రన్ (ఎన్ను నింతే మెయిదేన్) ( మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం : దురంతో
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ :ప్రీతి షీల్ సింగ్, క్లోవర్ వూటెన్ (నానక్ షా ఫకీర్)
స్పెషల్ జ్యూరీ : రిషికా సింగ్ (ఇరుది సుత్తురు)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఆనిమెటేడ్ ఫిలిం: ఫిషర్‌మెన్, తుక్‌తుక్
ఉత్తమ స్క్రీన్‌ప్లే: జూహీ చతుర్వేది (పీకూ), హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు: కంచె
తమిళం : విసారణై, హిందీ : దమ్ లగాకే హైసా, కన్నడ : తిథి
మలయాళం పాతేమరి, ఒడియా: పహడా రా లుహ.
పంజాబీ: చౌతీ కూట్, కొంకణీ : ఎనిమీ
బెంగాలీ: సంకాచిల్, హర్యాన్వీ: సత్‌రంగీ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్: నానక్ షా ఫకీర్

Saturday, 26 March 2016
తెలంగాణలో గ్రూప్-2 & కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా...........
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా | |
* ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు కూడా..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 23, 24న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 3న జరగాల్సి ఉంది. ఎస్‌ఐ పరీక్షలో ఇంగ్లిష్ పేపర్‌కు వెయిటేజీ నిబంధనను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు.
* ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు వెల్లడిస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనతోనే గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. |
Thursday, 24 March 2016
ఈ ఏడాది 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్ :
గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోల పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. వాయవ్య పశ్చిమం నుంచి వీచే పొడిగాలుల ప్రభావంతో వాతావరణంలో తేమ లేదని... అందువల్ల మేఘాలు కూడా లేవని స్పష్టం చేసింది.
ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో సూర్యశక్తి నేరుగా భూమిని తాకడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వివరించింది. గత ఏడాది మే నెలలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినాయని వాతావరణశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే ఈ ఏడాది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారీగా ఉన్న ఉష్ణోగ్రతలు... రెండుమూడు రోజుల తర్వాత... కొద్దిగా తగ్గినా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
3డీ అవయవాల ముద్రణ
పోయిన వారం చైనాలో ఒక అద్భుతం జరిగింది. 3డీ ముద్రిత గుండె నమూనా సాయంతో చైనా వైద్యులు 9 నెలల బాబు ప్రాణాలు కాపాడారు. పుట్టుకతోనే తీవ్రమైన గుండె లోపం ఉన్న బాబు ఛాతిని తెరచి గుండె శస్త్ర చికిత్స చేశారు. ఎక్కడ, ఎంత మేరకు కోత పెట్టాలో 3డీ నమూనాతో కచ్చితంగా తెలుసుకోగలిగారు. దీంతో మామూలుగా పట్టే సమయం కంటే చాలా తక్కువ సమయంలోనే శస్త్ర చికిత్స చేయగలిగారు. ఇప్పుడు బాబు సేఫ్!
ఆరువందల సంవత్సరాల క్రితం.. గూటన్ బర్గ్ సృష్టించిన ప్రింటింగ్ ప్రెస్.. క్రమక్రమంగా మానవ జీవితంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. కలర్ ప్రింటర్లు.. డిజిటల్ ప్రింటర్ల తర్వాత.. ఇప్పుడు మరొక రెవల్యూషన్ మొదలైంది. అదే 3డీ ప్రింటింగ్. వాస్తవానికి ఇది ముద్రణే. కానీ దీన్ని తయారీగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వస్తువుని ముద్రణ ద్వారా తయారు చేసి ఇస్తుంది కాబట్టి.
మామూలు ప్రింటర్లలో అయితే క్యాట్రిడ్జ్ ఇంక్ నింపుతారు. కానీ ఈ 3డీ ప్రింటర్లలో మనకు ఏ వస్తువు ఏ మెటీరియల్‌తో కావాలో దాన్ని క్యాట్రిడ్జ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అంతే మీకు కావాల్సిన వస్తువు రెడీ. అల్లావుద్దీన్ అద్భుత దీపం.. కల్పితం కావొచ్చు. కోర్కెలు తీర్చే కామధేనువు కథల్లో ఉండొచ్చేమో. కానీ మీట నొక్కగానే కోరుకున్నది ప్రింట్ చేసిచ్చే ప్రింటర్లు మాత్రం మన కళ్ల ముందు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నానో సిమ్ నుంచి నాసాకు కావాల్సిన చాలా రకాల పరికరాలను, రకరకాల వస్తువులను ఇప్పుడు 3డీ ప్రింటింగ్‌లో ముద్రిస్తున్నారు.
3డీ ప్రింటింగ్.. వస్తువులు తయారు చేయడానికి పనికొస్తుందంటే నమ్మొచ్చు. కానీ మనం మాట్లాడుకుంటున్నది అవయవాలు తయారు చేయడం గురించి కదా. ఈ ప్రింటర్లతో అవయవాల్ని తయారు చేయడం సాధ్యమవుతుందా? అంటే సాధ్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు మీరు ఎక్స్‌రే, ఈసీజీ.. ఫొటో స్కాన్‌లాంటి మెషీన్లు చూసి ఉంటారు. ఈ 3డీ బయో ప్రింటింగ్ కూడా అలాంటిదే. ముద్రణకు ముందు కావాల్సిన అవయవాన్ని 3డీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక చెవిని ముద్రించాలనుకోండి.. ముఖం చుట్టూ కెమెరా తిరుగుతూ 3డీ ఇమేజ్‌లను క్యాప్చర్ చేస్తుంది. దాని నుంచి కావాల్సిన చెవి రూపాన్ని కంప్యూటర్‌లో నమూనా తయారుచేస్తారు. దీని తర్వాత అవయవాన్ని ముద్రించడానికి కావాల్సిన ముఖ్యమైన విధానం.. లివింగ్ ఇంక్. ఒక వ్యక్తికి కావాల్సిన అవయవం నుంచి కణాలను సేకరిస్తారు. వాటితో లివింగ్ ఇంక్ తయారుచేస్తారు. ఈ ఇంక్‌నే క్యాట్రిడ్జ్‌లో వాడతారు. 3డీ డివైజ్‌ని కంప్యూటర్ ద్వారా ప్రింటర్‌కి పంపిస్తే కావాల్సిన ఆర్గాన్ ప్రింట్ అవుతుంది. ఇలా ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన విధానం ఉంటుంది.
3డీ ప్రింటింగ్ నుంచి వచ్చిందే 3డీ బయోప్రింటింగ్. 2010లో ఆర్గానోవో బయోటెక్నాలజీ కంపెనీ రూపొందించిన నోవోజెన్ ఎంఎంఎక్స్ బయోప్రింటర్ రాకతో ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి. ఆ ఏడు ఉత్తమ ఆవిష్కరణల్లో ఈ ప్రింటర్ కూడా ఒక అద్భుతమని టైమ్స్ పత్రిక కితాబిచ్చింది. 3డీ బయో ప్రింటింగ్ ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నది. కానీ తాజాగా చైనాలో ఒక 3డీ ముద్రిత గుండె నమూనా ఒక బాలుడి ప్రాణాలు కాపాడడంతో ఈ బయోప్రింటింగ్ మీద మరిన్ని ఆశలు పెరుగుతున్నాయి.
అవయవ మార్పిడి.. ఈ పదాన్ని ఇక మెల్లగా డిక్షనరీ నుంచి డిలీట్ చేయాల్సిందేనేమో. ఎందుకంటే.. అవసరమైతే అవయవం సృష్టించుకోవడమే కానీ.. అందుకోసం ఆశగా ఎదురు చూడాల్సిన అవసరం భవిష్యత్తులో రాదని పరిశోధనలు చెబుతున్నాయి. సో.. డోంట్ వర్రీ.. కాలేయం పాడయ్యిందన్న కంగారు.. గుండె ఆగిపోతుందేమోనన్న గుబులూ లేని ఆధునిక ప్రపంచంలోకి అడుగులు వేయండి.
ఇతని పేరు రెక్స్. ఇతను మనిషి కాదు.. అలాగనీ రోబో కూడా కాదు. ప్రపంచంలోనే తొలి బయోనిక్ మ్యాన్. రోబోను విప్పి చూస్తే నట్లు.. బోల్టులు.. సర్క్యూట్లు ఉంటాయి కదా. కానీ రెక్స్ అలాంటి మరమనిషి కాదు. ఇతని దేహంలో రక్తనాళాలున్నాయి. లబ్‌డబ్ అని కొట్టుకునే గుండె ఉంది. ఊపరితిత్తులు, మూత్రపిండాలు.. ఇలా అన్ని అవయవాలూ ఉన్నాయి. ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసినవే. పూర్తి స్థాయిలో పనిచేస్తాయంటే నమ్మగలరా? కానీ.. ఇది నిజం. అందుకే రెక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే తొలి బయోనిక్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన షాడో రోబో కంపెనీ రూపొందించిన ఈ రెక్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు వివిధ కృత్రిమ అవయవ భాగాలను అందించారు. రెక్స్ పేరు ఫ్రాంక్‌గా మార్చి వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని అవయవాలను 3డీ బయోప్రింటింగ్ ఆధారంగా ముద్రించవచ్చని నిరూపించారు. నిజమైన అవయవాలకంటే అవి చాలా చురుగ్గా, చక్కగా పనిచేస్తాయని కూడా గమనించారు.
-ఇవి ఇప్పటికి కృత్రిమంగా ముద్రించిన అవయవాలు. కృత్రిమ కాలేయం, గుండెను కూడా 3డీ బయోప్రింటింగ్ ద్వారా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి పూర్తి స్థాయిలో ఇంకా పనిచేసేలా రూపొందించలేదు.
అవయవాలను ముద్రించడం అన్నమాట!
మనిషికి కావాల్సిన అవయవాలు ముద్రించుకోవడం అంత సులభమా? మామూలు ప్రింటర్లలో అయితే.. క్యాట్రిడ్జ్‌లో ఇంక్ పోస్తే ప్రింట్ వచ్చేస్తుంది.
ఈ 3డీ బయో ప్రింటింగ్ గురించి మీకు అర్థం కావాలంటే.. ముందు మనం అసలు 3డీ ప్రింటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.
మీ లంగ్స్ పాడయ్యాయి. దాతలెవరూ లేరు. ఒక వేళ ఉన్నా, వారి అవయవం మీకు సరిపోవట్లేదు.అయినా మీరు భయపడాల్సిన పనిలేదు.మీకు కావాల్సిన అవయవాన్ని డాక్టర్లుతయారు చేసి ఇస్తారు. ఇక మీరు మరణాన్నీ జయించవచ్చు. మృత్యువే మీకు సలామ్ కొట్టి గులామ్ అవుతుందన్నమాట.ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు.3డీ బయో ప్రింటింగ్ ఇది సాధ్యమేనని భరోసానిస్తున్నది.
-నగేష్ బీరెడ్డి
అసలు మీకు ప్రింటింగ్ పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా తెలుసా? కనీసం ఎవరు కనిపెట్టారో ఐడియా ఉందా?
ఆరువందల సంవత్సరాల క్రితం.. గూటన్ బర్గ్ సృష్టించిన ప్రింటింగ్ ప్రెస్.. క్రమక్రమంగా మానవ జీవితంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. కలర్ ప్రింటర్లు.. డిజిటల్ ప్రింటర్ల తర్వాత.. ఇప్పుడు మరొక రెవల్యూషన్ మొదలైంది. అదే 3డీ ప్రింటింగ్. వాస్తవానికి ఇది ముద్రణే. కానీ దీన్ని తయారీగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వస్తువుని ముద్రణ ద్వారా తయారు చేసి ఇస్తుంది కాబట్టి.
ఎలా ముద్రిస్తారు?
మామూలు ప్రింటర్లలో అయితే క్యాట్రిడ్జ్ ఇంక్ నింపుతారు. కానీ ఈ 3డీ ప్రింటర్లలో మనకు ఏ వస్తువు ఏ మెటీరియల్‌తో కావాలో దాన్ని క్యాట్రిడ్జ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అంతే మీకు కావాల్సిన వస్తువు రెడీ. అల్లావుద్దీన్ అద్భుత దీపం.. కల్పితం కావొచ్చు. కోర్కెలు తీర్చే కామధేనువు కథల్లో ఉండొచ్చేమో. కానీ మీట నొక్కగానే కోరుకున్నది ప్రింట్ చేసిచ్చే ప్రింటర్లు మాత్రం మన కళ్ల ముందు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నానో సిమ్ నుంచి నాసాకు కావాల్సిన చాలా రకాల పరికరాలను, రకరకాల వస్తువులను ఇప్పుడు 3డీ ప్రింటింగ్‌లో ముద్రిస్తున్నారు.
వస్తువులు ఓకే.. అవయవాలు ఎలా?
3డీ ప్రింటింగ్.. వస్తువులు తయారు చేయడానికి పనికొస్తుందంటే నమ్మొచ్చు. కానీ మనం మాట్లాడుకుంటున్నది అవయవాలు తయారు చేయడం గురించి కదా. ఈ ప్రింటర్లతో అవయవాల్ని తయారు చేయడం సాధ్యమవుతుందా? అంటే సాధ్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు మీరు ఎక్స్‌రే, ఈసీజీ.. ఫొటో స్కాన్‌లాంటి మెషీన్లు చూసి ఉంటారు. ఈ 3డీ బయో ప్రింటింగ్ కూడా అలాంటిదే. ముద్రణకు ముందు కావాల్సిన అవయవాన్ని 3డీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక చెవిని ముద్రించాలనుకోండి.. ముఖం చుట్టూ కెమెరా తిరుగుతూ 3డీ ఇమేజ్‌లను క్యాప్చర్ చేస్తుంది. దాని నుంచి కావాల్సిన చెవి రూపాన్ని కంప్యూటర్‌లో నమూనా తయారుచేస్తారు. దీని తర్వాత అవయవాన్ని ముద్రించడానికి కావాల్సిన ముఖ్యమైన విధానం.. లివింగ్ ఇంక్. ఒక వ్యక్తికి కావాల్సిన అవయవం నుంచి కణాలను సేకరిస్తారు. వాటితో లివింగ్ ఇంక్ తయారుచేస్తారు. ఈ ఇంక్‌నే క్యాట్రిడ్జ్‌లో వాడతారు. 3డీ డివైజ్‌ని కంప్యూటర్ ద్వారా ప్రింటర్‌కి పంపిస్తే కావాల్సిన ఆర్గాన్ ప్రింట్ అవుతుంది. ఇలా ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన విధానం ఉంటుంది.
3డీ ప్రింటింగ్ నుంచి వచ్చిందే 3డీ బయోప్రింటింగ్. 2010లో ఆర్గానోవో బయోటెక్నాలజీ కంపెనీ రూపొందించిన నోవోజెన్ ఎంఎంఎక్స్ బయోప్రింటర్ రాకతో ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి. ఆ ఏడు ఉత్తమ ఆవిష్కరణల్లో ఈ ప్రింటర్ కూడా ఒక అద్భుతమని టైమ్స్ పత్రిక కితాబిచ్చింది. 3డీ బయో ప్రింటింగ్ ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నది. కానీ తాజాగా చైనాలో ఒక 3డీ ముద్రిత గుండె నమూనా ఒక బాలుడి ప్రాణాలు కాపాడడంతో ఈ బయోప్రింటింగ్ మీద మరిన్ని ఆశలు పెరుగుతున్నాయి.
అవయవ మార్పిడి.. ఈ పదాన్ని ఇక మెల్లగా డిక్షనరీ నుంచి డిలీట్ చేయాల్సిందేనేమో. ఎందుకంటే.. అవసరమైతే అవయవం సృష్టించుకోవడమే కానీ.. అందుకోసం ఆశగా ఎదురు చూడాల్సిన అవసరం భవిష్యత్తులో రాదని పరిశోధనలు చెబుతున్నాయి. సో.. డోంట్ వర్రీ.. కాలేయం పాడయ్యిందన్న కంగారు.. గుండె ఆగిపోతుందేమోనన్న గుబులూ లేని ఆధునిక ప్రపంచంలోకి అడుగులు వేయండి.
మొదటి కృత్రిమ మనిషి
ఇతని పేరు రెక్స్. ఇతను మనిషి కాదు.. అలాగనీ రోబో కూడా కాదు. ప్రపంచంలోనే తొలి బయోనిక్ మ్యాన్. రోబోను విప్పి చూస్తే నట్లు.. బోల్టులు.. సర్క్యూట్లు ఉంటాయి కదా. కానీ రెక్స్ అలాంటి మరమనిషి కాదు. ఇతని దేహంలో రక్తనాళాలున్నాయి. లబ్‌డబ్ అని కొట్టుకునే గుండె ఉంది. ఊపరితిత్తులు, మూత్రపిండాలు.. ఇలా అన్ని అవయవాలూ ఉన్నాయి. ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసినవే. పూర్తి స్థాయిలో పనిచేస్తాయంటే నమ్మగలరా? కానీ.. ఇది నిజం. అందుకే రెక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే తొలి బయోనిక్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన షాడో రోబో కంపెనీ రూపొందించిన ఈ రెక్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు వివిధ కృత్రిమ అవయవ భాగాలను అందించారు. రెక్స్ పేరు ఫ్రాంక్‌గా మార్చి వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ భాగాలు ముద్రించొచ్చు..
శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్ని అవయవాలను 3డీ బయోప్రింటింగ్ ఆధారంగా ముద్రించవచ్చని నిరూపించారు. నిజమైన అవయవాలకంటే అవి చాలా చురుగ్గా, చక్కగా పనిచేస్తాయని కూడా గమనించారు.
రక్తనాళాలు :
రక్తనాళాల నుంచి సేకరించిన జీవకణాలను ఉపయోగించి సిలికాన్ టెంప్లేట్స్‌ను క్రియేట్ చేసి రక్తకేశనాళికలను వృద్ధి చేసి కృత్రిమ రక్తనాళాలను ఇప్పటికే తయారు చేశారు.చెవి, ముక్కు, ఎముకలు కూడా.. :
అత్యాధునిక 3డీ బయోప్రింటర్ల ఆధారంగా శాస్త్రవేత్తలు కృత్రిమంగా చెవి, ముక్కును తయారు చేశారు. వాటిని మనిషికి అమర్చినప్పుడు చక్కగా పనిచేయడం మొదలుపెట్టాయి కూడా. విరిగిన ఎముకలను రిప్లేస్ చేసేందుకు కృత్రిమ ఎముకలను ప్రింట్ చేసి మనిషి నడవగలిగేలా కూడా ఎముకల్ని 3డీ బయోప్రింటర్ ముద్రించింది.-ఇవి ఇప్పటికి కృత్రిమంగా ముద్రించిన అవయవాలు. కృత్రిమ కాలేయం, గుండెను కూడా 3డీ బయోప్రింటింగ్ ద్వారా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి పూర్తి స్థాయిలో ఇంకా పనిచేసేలా రూపొందించలేదు.
3డీ బయోప్రింటింగ్ అంటే?
అవయవాలను ముద్రించడం అన్నమాట!
అంత సింపులా?
మనిషికి కావాల్సిన అవయవాలు ముద్రించుకోవడం అంత సులభమా? మామూలు ప్రింటర్లలో అయితే.. క్యాట్రిడ్జ్‌లో ఇంక్ పోస్తే ప్రింట్ వచ్చేస్తుంది.
మరి ఈ ప్రింటర్‌లో ఏ ఇంకు వాడతారు?
ఈ 3డీ బయో ప్రింటింగ్ గురించి మీకు అర్థం కావాలంటే.. ముందు మనం అసలు 3డీ ప్రింటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.
జస్ట్ ఇమాజిన్..!
మీ లంగ్స్ పాడయ్యాయి. దాతలెవరూ లేరు. ఒక వేళ ఉన్నా, వారి అవయవం మీకు సరిపోవట్లేదు.అయినా మీరు భయపడాల్సిన పనిలేదు.మీకు కావాల్సిన అవయవాన్ని డాక్టర్లుతయారు చేసి ఇస్తారు. ఇక మీరు మరణాన్నీ జయించవచ్చు. మృత్యువే మీకు సలామ్ కొట్టి గులామ్ అవుతుందన్నమాట.ఆశ్చర్యంగా ఉందా? నమ్మలేకపోతున్నారా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు.3డీ బయో ప్రింటింగ్ ఇది సాధ్యమేనని భరోసానిస్తున్నది.
-నగేష్ బీరెడ్డి
కాఫీతో పాటు............ కప్పునూ తినొచ్చు!
కాఫీ.. టీ లేకుండా ఉండగలమా? ఇంట్లో అయితే ఎంచక్కా గ్లాస్ కప్‌లోనో.. పింగానీ కప్పులోనో పోసుకొని తాగేస్తుంటాం. బయటకెళితే ఏ ప్లాస్టిక్ కప్పో.. పేపర్ కప్పో దిక్కవుతుంది. అలా అని లంచ్‌బాక్స్‌తో పాటు తీసుకెళ్లలేం. ఏం చేయాలి? అందమైన కాఫీని.. అంతకంటే అందమైన కప్పులో పోసుకొని తాగలేమా? అంటే తాగొచ్చు. కేవలం తాగడం మాత్రమే కాదు. కాఫీ అయిపోయాక ఆ కప్పును అట్టే గుటకాయస్వాహా అని తినేయొచ్చు! వింతగా విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఈ కాఫీకప్పులు అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద హోటళ్లలో.. రెస్టారెంట్లలో ఇవి సందడి చేస్తున్నాయి. పర్యావరణం పరిరక్షించడంతో పాటు కస్టమర్‌కు కొత్త అనుభూతి కలిగిండమే లక్ష్యంగా ఇలాంటి కప్పులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ఈటబుల్ కప్ మేకర్స్ చెప్తున్నారు. పైగా పిల్లలకు ఇవి భలే నచ్చడం.. వీటిలో కాఫీ, టీ తాగితే సృజనాత్మక ఆలోచనలు వస్తాయంటున్నారు. సో.. మీరెందుకు దిగులు పడతారు. ఇష్టం లేకున్నా ప్లాస్టిక్ గ్లాస్‌లో కాఫీ తాగడం ఆపేసి.. ఆ కాఫీతో పాటు తినేసే అవకాశమున్న కప్‌లను తెచ్చేసుకోండి!

హెల్మెట్లు కొంటున్నారా..! అయితే జరభద్రం.
హైదరాబాద్ :ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడడానికి ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు కొంటున్నారా..! అయితే జరభద్రం. మీరు కొనే హెల్మెట్లు మీ ప్రాణాల్ని కాపాడుతాయో..చిన్న ప్రమాదానికే ప్రాణాల్ని బలిగొంటాయో తెలుసుకొండి. సరైన ప్రమాణాలు పాటించకుండా తయారైన హెల్మెట్లు వాడితే ప్రయోజనాలకన్నా..ప్రమాదాలే ఎక్కువ అంటున్నారు సాంకేతిక నిపుణులు. హెల్మెట్ కొనేముందు సరైన అవగాహనతోనే పరీక్షించి కొనుగోలు చేయాలని చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేసినప్పటికీ, డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రోడ్డు భద్రతను పటిష్టం చేసింది. ఇందులోభాగంగానే హెల్మెట్‌ను తప్పనిసరి చేసింది. అయితే వ్యాపారులు, తయారీదారులు హెల్మెట్‌లో నాణ్యతకు తూట్లు పొడుస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తయారీలో నిబంధనలు పాటించకపోవడం, అమ్మకాల్లో నాణ్యత ప్రమాణాలు గాలికొదలడం వాహనదారులకు శాపంగా మారింది.
ఐఎస్‌ఐ మార్క్ పేరిట..
హెల్మెట్ల అమ్మకాల్లో ఐఎస్‌ఐ మార్క్ పేరిట నకిలీ దందా చేస్తున్నారు. బజార్లో దొరికే చాలా హెల్మెట్లపై ప్రమాణాలను సూచిస్తూ వేసే ఐఎస్‌ఐ లేబుల్ నకిలీదని విమర్శలున్నాయి. దీనిని కొనుగోలుదారులు కూడా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు రోడ్డు సేఫ్టీ అమలుకు నడుంబిగించడంతో వాహన చోదకులు హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తక్కువ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ప్రమాణాలు లేని హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. రోడ్లకిరువైపులా వెలిసిన ఫుట్‌పాత్ దుకాణాల్లో మొత్తం నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.
వీటిని నియంత్రించడానికి కానీ, వీటి నాణ్యతను పరిశీలించడానికి కానీ ఎటువంటి యంత్రాంగం లేకపోవడంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతా ప్రమాణాలు చూడాల్సిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) దీనిని పట్టించుకోదు. తయారీ కంపెనీల్లో తనిఖీలు చేస్తామని, ఫుట్‌పాత్ వ్యాపారులను తనిఖీ చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ఇక రవాణాశాఖ, పోలీసులు తమ వద్ద ప్రమాణాలను కొలిచే వ్యవస్థ లేదని తప్పించుకుంటున్నాయి.
ప్రమాణాలు ఇవే
మంచి ప్రమాణాలు ఉన్న హెల్మెట్ ఐఎస్‌ఐ మార్క్ ,గట్టి డిప్ప(షెల్) ఉంటుంది. షెల్ కింద ఉండే ప్యాడింగ్ (మొత్తని భాగం) సౌకర్యంగా ఉంటుంది. పాలిథిలీన్ ఫోమ్‌తో ప్యాడింగ్ చేస్తారు. గీతలు పడని, స్పష్టంగా కనబడే అద్దం బిగిస్తారు. నిజమైన ఐఎస్‌ఐ స్టాండర్డ్స్ కలిగి ఉన్నట్లయితే హెల్మెట్‌పై ఉన్న లేబుల్ తొలగించలేరు. నకిలీదైతే స్టిక్కర్ తొలిగించేలా.. తుడిస్తే కనబడకుండా పోతుంది. నిజమైన హెల్మెట్ అయితే ఐఎస్‌ఐ మార్క్‌తోపాటు తయారీదారు కోడ్ వేస్తారు. మీరు కొన్నది నకిలీదో అసలుదో ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే బీఐఎస్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రమాణాలతో కూడిన హెల్మెట్ గడ్డం వద్ద 20 మీ.మీటర్ల మందంతో తయారవుతుంది. అద్దం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అది నిలువునా, అడ్డంగా చూసినా ఒకే రకంగా కనబడుతుంది. దీని తయారీ సందర్భంగా 250 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. అల్ట్రావాయిలెట్ కిరణాలు పడ్డా ఎటువంటి ప్రభావం ఉండదు. ఇక సౌండ్స్ విషయానికి వస్తే 10 డెసిబుల్స్ నుంచి ఎక్కువ మోతాదు సౌండ్‌ను వినపడేలా రూపొందిస్తారు. హెల్మెట్‌పై కంపెనీ పేరు, ట్రేడ్ మార్కు, సైజు, తయారు చేయబడిన సంవత్సరం ఉంటుంది. వీటన్నింటిని చూసి కొనుగోలు చేయాలి.

861
‘శిరోజాల’........... ప్రేమ
ఫ్లోరిడాకి చెందిన ఆషాకి జుట్టంటే ఎంత ఇష్టమంటే.. ఏకంగా 55 అడుగుల పొడవు జుట్టును పెంచేసుకుంది. ఆషా పూర్తి పేరు ఆషా మాండెలా. ప్రపంచంలోనే అతిపెద్ద జుట్టు ఉన్న మహిళగా ఆషా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు తనని అంతా ‘రాస్తా రాపుంజెల్’ అని పిలుస్తుంటారు. ఆమెకి తన జుట్టంటే ఎంత ప్రాణమంటే తన జుట్టుని సంరక్షించుకోవడానికి ఓ హెయిర్ స్టైలిస్ట్‌నే పెళ్లాడింది.
పెళ్లి వెనుక ఓ కథ
ఆషా కెన్యాకి చెందిన ఇమ్మాన్యుల్ అనే హెయిర్ స్టైలిస్ట్‌తో ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకుంది. ఇంకేముంది ఆషా 55 అడుగుల పొడవు శిరోజాలు నచ్చి వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నాడు.

అంత జుట్టుతో ఆషా రోజూవారి పనులు ఎలా చేస్తుందనేగా మీ సందేహం..? ఆషా తలస్నానం చేయడానికి ఒక రోజు జుట్టు ఆరబెట్టుకోవడానికి ఒక రోజు సమయం పడుతుంది. ఈ పనిలో తన భర్తే ఆషాకు ఎంతో సాయం చేస్తుంటాడు. ఎంతైనా హెయిర్ స్టైలిస్ట్ కదా మరి. నిజం చెప్పాలంటే ఇమ్మాన్యుల్ చేసే పని తన భార్య జుట్టుని సంరక్షించడమే..!
ఇంత జుట్టును పెంచుకుంటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినా ఆషా పట్టించుకోలేదు. ఈ మధ్యనే ఈ దంపతులకి ఓ పాప జన్మించింది. పాపకి తమలా జుట్టు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఈ శిరోజాల ప్రేమికులన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నిషేదించిన వింత విషయాలు
మన చుట్టూ నిషేధించిన అనేక విషయాలు ఉన్నాయి.నేడు ఈ వ్యాసంలో ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన వింత విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నిషేధించిన విషయాలు కొన్ని ఇతర కారణాల వలన చట్టబద్దముగా కనపడతాయి. కానీ నిషేధించిన కొన్ని విషయాల గురించి మీకు ఏమి అన్పిస్తుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన అనేక ఆసక్తికరమైన మరియు వింత విషయాల గురించి తెలుసుకోండి. మీరు చట్టంలో చిక్కుకున్నప్పుడు తదుపరి సమయంలో జరిమానా చేసుకునే ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి. వివిధ నగరాల్లో విధించిన నియమాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే సమయంలో ఆయా ప్రదేశాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందువలన నిషేధం విధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
1. ముద్దు నిషేధం అవును మీరు చదివింది నిజమే. ఇటలీలో ఎబోలా అనే పట్టణంలో ముద్దు నిషేధం అనేది ఒక అసహజమైన నియమంగా ఉంది. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది
2. మురికిగా ఉన్న కారును డ్రైవ్ చేయకూడదు అవును మీరు చదివింది నిజమే. చెలైయబిన్స్క్ అనే రష్యన్ నగరంలో మీరు మురికి కారుతో డ్రైవింగ్ చేస్తే జరిమానా విధిస్తారు.
3. చట్ట విరుద్ధ వ్యక్తి కోసం మెల్బోర్న్ లో ఒక స్ట్రాప్ లెస్ గౌను ధరించిన మహిళ కనపడితే జరిమానా విధిస్తారు. ఇది క్రేజీ నియమాలలో ఒకటిగా ఉంది. సరే మీరు,మేము ఊహశక్తిని వదిలేద్దాం.
4. రాష్ట్ర ఫునెరల్ మరణించిన రాజకీయవేత్త పార్లమెంట్ ఇళ్ళును రాజ భవనముగా లెక్కిస్తారు. అలాగే భవనాలను రాష్ట్ర ఫునెరల్ గా వ్యవహరిస్తారు.
5. ఈ సమయాల్లో వాక్యూమింగ్ ఖర్చు చేయవచ్చు ఈ నియమం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నిజంగా ఉంది. ప్రజలు వారం రోజులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు వాక్యూమింగ్ చేస్తారు. అదే వారాంతంలో అయితే రాత్రి 10 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు చేయవచ్చు
6. చిరునవ్వు లేకపోతే జరిమానా కట్టాలి మిలన్ వీధుల్లో మీరు చిరునవ్వుతో లేకపోతే జరిమానా కట్టాలి. ఎందుకంటే చుట్టూ సంతోషకరమైన ముఖాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా నియమం పెట్టారు.
7. చూయింగ్ గమ్ సింగపూర్ చూయింగ్ గమ్ ను దిగుమతి చేసుకోవటం 2004 నుండి పూర్తిగా నిషేధించారు.మీ దగ్గర చూయింగ్ గమ్ దొరికితే అదనపు బక్స్ చెల్లించటానికి సిద్దంగా ఉండాలి.

Wednesday, 23 March 2016
పసుపు దంతాలు......శుభ్రం చేసుకోవడం
నలుగురిలో ఎంత అందంగా కనిపించినా… పసుపు దంతాలు వుంటే మాత్రం మనస్ఫూర్తిగా నవ్వలేం. ఏవిధంగా అయితే అందానికి ప్రాధాన్యత ఇస్తారో.. అదేవిధంగా దంతాలను తెల్లగా మార్చడంలో ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి! పసుపు దంతాలు వుంటే సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలుకుదరదు. కాబట్టి.. అటువంటి దంతాలను నివారించుకోవాలంటే ప్రతిరోజూ పళ్లను శుభ్రం చేసుకోవాలి.
కొంతమంది రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల తెల్లగా కనిపిస్తాయి.. కానీ మరికొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు.. చూడ్డానికి ఓ మోస్తరు తెల్లగానే వున్నా.. పగుళ్ల దగ్గరలో పసుపుపచ్చ రంగు క్లియర్‌గా కనిపిస్తుంది. అటువంటి రంగును కూడా పూర్తిగా నిర్మూలించాలంటే ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ద్వారా దూరం చేయొచ్చు. అందులో ముఖ్యంగా తులసి బాగా పనిచేస్తుంది. ఈ తులసిని వివిధరకాల రెమెడీస్‌లో కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటేమంచి ఫలితం పొందుతారు. మరి తులసీ మిశ్రమంతో ఆ రెమెడీస్ ఏమిటి..? ఎలా తయారుచేస్తారో..? తెలుసుకుందాం…
* బాసిల్ టూత్ పౌడర్ : తాజాగా ఉండి తులసి ఆకులను తీసుకొని, నీడలో బాగా ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత, ఆ ఆకులను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి ప్రతిరోజూ బ్రష్ చేస్తే.. పసుపు దంతాలను నిర్మూలించుకోవచ్చు
* బానియన్(మర్రిచెట్టు) ట్రీ (ఫిక్కస్ రిలిజియోస) : ఈ చెట్టులోని వేరులో ఒక నేచురల్ ఆస్ట్రింజెంట్ వుంటుంది. ఆ వేరును తీసుకుని ప్రతిరోజూ బ్రష్ లా చేసుకుంటే.. అది దంతాలను ముత్యాల్లా మెరిపిస్తుంది. ఇది చెట్టు పైభాగంలో వ్రేలాడుతూ పెరుగుతుంది.
* వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) : వేపపుల్లలో ఆస్ట్రిజెంట్స్‌తో పాటు యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా వుంటాయి. ఈ పుల్లలతో బ్రష్ చేసుకుంటే దంతాలను శుభ్రపరచడంతో పాటు చెడు శ్వాసను, దంతక్షయాన్ని నివారిస్తుంది.
* బేకింగ్ సోడా రెమెడీ : బేకింగ్ సోడాలో సానపెట్టే స్వభావం కలిగి ఉంటుంది. ఇది మీ దంతాల ఎనామిల్ ను తగ్గించేయవచ్చు. అయితే, బేకింగ్ సోడాలోని ఈ సానపెట్టే గుణం దంతాల మీద పడ్డ మొండి మరకలను తొలగించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో పాటు నిమ్మరసం ఉపయోగించినట్లైతే, దంతాల్లోన్ని క్యాల్షియంను బ్లాక్ చేసి దంతాలను తెల్లగా మార్చుతుంది. అయితే జాగ్రత్తగా వాడాలి.
* విటమిన్ సి ఎక్కువగా వుండే పళ్లు, కూరగాయలు: స్ట్రాబెర్రీస్, టమోటో, ఆమ్లా, ఆరెంజ్, నిమ్మకాయ వంటివాటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. స్ట్రాబెర్రీని రెండు ముక్కలుగా కట్ చేసి, అందులో సగం తీసుకొని, దాని మీద బేకింగ్ సోడాను చిలకరించి, దాంతో దంతాల మీద బాగా రుద్దాలి. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్ యాసిడ్, అందులోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు, స్వచ్చమైన దంతాలను అందిస్తాయి.
* ఆరెంజ్ తొక్క : రాత్రి నిద్రపోవడానికి ముందు ఆరెంజ్ తొక్కను తీసుకుని.. దంతాలను బాగా రుద్దుకోవాలి. అనంతరం నీటితో పుక్కిలించుకుని నిద్రపోవాలి.
మూడ్ బాగోలేనప్పుడు ఏం చేయాలి?
మూడ్ బాగోలేనప్పుడు మరేదో మార్పును మనసు కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడు నుంచి బయటకు రావాలంటే వెంటనే మనసుకు మార్పు కావాలి. తద్వారా కొత్త ఉత్సాహం కలుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* శారీరక వ్యాయామం మొదలు పెట్టవచ్చు.
* ఆహారంలో పిండి పదార్థాలు తీసుకోవడం తగ్గించండి
* పిల్లలతో, శ్రీవారితో కలిసి అలా బయటకు షికారుగా వెళ్ళి బయటే భోజనం ముగించి రండి.
* మీరు ఇష్టపడే ఆహార పదార్థాలను చేయమని దగ్గర వారిని అడిగి చేయించుకుని ఆనందంగా తినండి
* నచ్చిన సంగీతం వినడం లేదా ఇష్టమైన పుస్తకాన్ని చదవడం మొదలెట్టండి.
* మీకు బాగా ఇష్టమైన చోటుకు లేదా ఎక్కడికైనా సరాదాగా పిక్‌నిక్‌కు వెళ్ళండి.
* మీ శ్రీవారు మీకు రాసిన ఉత్తరాలు తీసుకుని చదవండి
* పాత ఆల్బమ్స్‌లో వున్న ఫోటోలను చూస్తూ గత స్మృతులలోకి వెళ్ళండి.
* మీరు బాగా ఇష్టపడే స్నేహితులతో మనస్సు విప్పి బాధని-సంతోషాన్ని పంచుకోండి.
Tuesday, 22 March 2016
March 22 World Water Day**
World Water Day is an annual event celebrated on March 22. The day focuses attention on the importance of freshwater and advocates for the sustainable management of freshwater resources.
This day was first formally proposed in Agenda 21 of the 1992 United Nations Conference on Environment and Development in Rio de Janeiro. In 1993, the first World Water Day was designated by the United Nations General Assembly and since, each year focuses on a different issue.
The UN and its member nations devote this day to implementing UN recommendations and promoting concrete activities within their countries regarding the world's water resources. Additionally, a number of nongovernmental organizations promoting clean water and sustainable aquatic habitats have used World Water Day as a time to focus attention on the critical issues of our era. Events such as theatrical and musical celebrations, educational events, and campaigns to raise money for access to clean and affordable water are held worldwide on World Water Day, or on convenient dates close to March 22.
The occasion of World Water Day is also used to highlight required improvements for access to WASH (water, sanitation, hygiene) facilities in developing countries.
World Water Day is an international observance and an opportunity to learn more about water related issues, be inspired to tell others and take action to make a difference. Each year, UN-Water — the entity that coordinates the UN’s work on water and sanitation — sets a theme for World Water Day corresponding to a current or future challenge. The engagement campaign is coordinated by one or several of the UN-Water Members with a related mandate.
Subscribe to:
Posts (Atom)