తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల షెడ్యూలును
పోలీసు నియామకాల బోర్డు ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం
ఎస్ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26న, ఏఎస్‌ఐ పోస్టులకు సెప్టెంబరు 2న, కానిస్టేబుల్
పోస్టులకు సెప్టెంబరు 30న రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తొలుత ప్రాథమిక
పరీక్ష నిర్వహించి, ఇందులో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు
జరుపుతారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే తుదిపరీక్ష నిర్వహించి ఎంపిక
చేస్తారు.
మొత్తం 18,428 పోలీసు పోస్టుల భర్తీకి మే 31న నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా పోలీసు శాఖలోని 17,156 కానిస్టేబుల్, 1272 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 పరీక్ష కేంద్రాల్లో, ఇతర పోస్టులకు మాత్రం కేవలం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దరఖాస్తు సమయాల్లో ఇచ్చిన వ్యక్తిగత వివరాల్లో మార్పులకు జులై 14 వరకు అవకాశం కల్పించారు.
షెడ్యూలు ఇలా..

పోస్టులు | పరీక్ష తేదీ | సమయం | పరీక్ష కేంద్రం |
ఎస్‌ఐ, తత్సమాన పోస్టులు | 26.08.2018 | ఉ.10.00 గం. - మ.1.00 గం. | హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర 10 పట్టణాలు |
ఎస్‌ఐ (ఐటీ & కమ్యూనికేషన్) | 02.09.2018 | ఉ.10.00 గం. - మ.1.00 గం. | హైదరాబాద్ పరిసర ప్రాంతాలు |
ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) | 02.09.2018 | మ.2.30 గం. - సా. 5.30 గం. | హైదరాబాద్ పరిసర ప్రాంతాలు |
కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు | 30.09.2018 | ఉ.10.00 గం. - మ.1.00 గం. | హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర 40 పట్టణాలు. . |
No comments:
Post a Comment