Thursday 19 July 2018

మనూ-హైదరాబాద్‌లో 85 పోస్టులు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) ప్రధాన క్యాంపస్, శాటిలైట్ క్యాంపస్‌లు, ఆఫీసుల్లో 85 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు:

నాన్ టీచింగ్ పోస్టులు: 53
విభాగాల వారీ ఖాళీలు:
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్-1, సిస్టమ్ అనలిస్ట్-1, సెక్షన్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-1, ఇన్‌స్ట్రక్టర్-పాలిటెక్నిక్స్-10, ఇన్‌స్ట్రక్టర్-ఐటీఐ/వీటీసీ-4, జూనియర్ ఇంజనీర్ (సివిల్)-1, మేనేజర్-వర్సిటీ గెస్ట్ హౌజ్-1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-2, మెయింటెనెన్స్ అసిస్టెంట్-1, ఎలక్ట్రీషియన్-2, లేబొరేటరీ అసిస్టెంట్-2, లైబ్రరీ అసిస్టెంట్-2, లోయర్ డివిజన్ క్లర్క్-14, వర్క్‌షాప్ అటెండెంట్-2, లైబ్రరీ అటెండెంట్-2, లేబొరేటరీ అటెండెంట్-4.
అర్హత: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్, 10+2 (ఇంటర్), సంబంధిత సబ్జెక్టులు, బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును బట్టి 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.250.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 20, 2018.
టీచింగ్ పోస్టులు: 32
విభాగాల వారీ ఖాళీలు:
ప్రొఫెసర్-8, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసిస్టెంట్ ప్రొఫెసర్-11, ఫిజికల్ డెరైక్టర్-1, ఫిజికల్ డిప్యూటీ డెరైక్టర్-1.
అర్హత: సంబంధిత సబ్జెక్టులు, బ్రాంచుల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ, ఎంఈడీ/ఎంఏ (ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత. ప్రొఫెసర్ పోస్టులకు పదేళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎనిమిదేళ్లు బోధనానుభవం ఉండాలి. ఉర్దూ భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 20, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.manuu.ac.in

No comments:

Post a Comment