Tuesday 10 July 2018

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 707 ఖాళీలు

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 707 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవిభాగాల వారీ ఖాళీలు: ఎక్స్ ఐటీఐ అభ్యర్థులకు- 271 (కార్పెంటర్-18, ఎలక్ట్రీషియన్-50, ఫిట్టర్-130, మెషినిస్ట్-16, వెల్డర్-57) ఖాళీలున్నాయి.
కొత్త అభ్యర్థులకు: 426 (కార్పెంటర్-36, ఎలక్ట్రీషియన్-66, ఫిట్టర్-100, మెషినిస్ట్-32, పెయింటర్-30, వెల్డర్-162) ఖాళీలున్నాయి.
  • ఎంఎల్‌టీ రేడియాలజీ-4, ఎంఎల్‌టీ పాథాలజీ-4, పాసా-2 ఖాళీలున్నాయి.
వయసు: 2018, అక్టోబర్ 1 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. ఎంఎల్‌టీ అప్రెంటీస్‌కు ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణత.
శిక్షణ: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ ట్రేడులకు రెండేళ్లు, వెల్డర్ ట్రేడులకు 15 నెలలు, ఎంఎల్‌టీ ట్రేడులకు ఆరు నెలలు.
ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 8, 2018.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.icf.indianrailways.gov.in

No comments:

Post a Comment