Friday, 13 July 2018

హెచ్‌ఏఎల్‌లో 61 ఖాళీలు

Jobsకోర్వా (యూపీ)లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఏవియానిక్స్ డివిజన్ 2018-19కి గాను 61 టెక్నీషియన్ (డిప్లొమా-టెక్నికల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
బ్రాంచుల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-35, మెకానికల్ ఇంజనీరింగ్-14, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-2, సివిల్ ఇంజనీరింగ్-1, ఐటీ-4, కంప్యూటర్ సైన్స్-5. శిక్షణ కాలం: ఏడాది. అర్హత: సంబంధిత బ్రాంచుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. ఇంజనీరింగ్ డిప్లొమాను మూడేళ్లలో పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. వయసు: 2018, జూలై 27 నాటికి 26 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఎంపిక: ఇంజనీరింగ్ డిప్లొమా మార్కులు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:
ఈ-మెయిల్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 27, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://hal-india.co.in

No comments:

Post a Comment