Thursday, 12 July 2018

16,781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో జులై 13 నుంచి 16 వరకు దరఖాస్తుల ప్రక్రియ సాగనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్‌కుమార్ డీఈఓలను ఆదేశించారు. డీఈఓలు 18న కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ఆమోదంతో వాటిని ఎంఈఓలకు పంపిస్తారు. వారు 19న విద్యాకమిటీలకు అందజేస్తారు. విద్యాకమిటీలు వారితో ఒప్పందం కుదుర్చుకుంటారు. జులై 20 నుంచి వారు విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. రెగ్యులర్ టీచర్ పోస్టులను భర్తీచేసే వరకు వీరిని కొనసాగించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల గౌరవవేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో 16,781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 20లోగా విద్యావాలంటీర్లను నియమించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ,17న ఎంఈవో వెరిఫికషన్‌ చేసి.. లిస్ట్‌ను డీఈవోకు పంపాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ నెల 20 నుంచి విద్యావాలంటీర్లు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించించిన నేపథ్యంలో 13.07.2018 నంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment