Sunday, 1 July 2018

తెలంగాణ గురుకులాల్లో 1972 పీజీటీ ఖాళీలు (చివ‌రి తేది: 08.08.18)

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) దరఖాస్తులు కోరుతోంది

వివరాలు.....* పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)మొత్తం ఖాళీలు: 1972 

సొసైటీలవారీ ఖాళీలు: బీసీ-472, ఎస్టీ-49, సాధారణ గురుకుల సొసైటీ-16, ఎస్సీ-155, మైనార్టీ-1280. 

ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. 

అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు వస్తే చాలు 

 వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఎంపికరాత పరీక్ష ద్వారా.  

పరీక్షా విధానం: ఓఎంఆర్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. బాల్ పాయింట్ పెన్నుతో సమాధానాలు గుర్తించాలి. మొత్తం మూడు పేపర్లలో పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపరులో ప్రశ్నకు ఒక మార్కు వంతున 100 ప్రశ్నలు అడుగుతారు. మూడు పేపర్లకు కలిపి మొత్తం 300 మార్కులు. ఒక్కో పేపరుకు 2 గంటల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మొదటి పేపర్ అన్ని సబ్జెక్టులవారికి ఒక్కటే ఉంటుంది. రెండో పేపరులో సంబంధిత సబ్జెక్టు పెడగాజీ (బోధనాభ్యసన శాస్త్రం) నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడో పేపరులో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు (కంటెంట్) నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 09.07.2018ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 08.08.2018
 
 

No comments:

Post a Comment