Thursday 19 July 2018

ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు

Jobsఇండియన్ ఆర్మీలో 52వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, 23వ ఎస్‌ఎస్‌సీ (టెక్) ఉమెన్, డిఫెన్స్ పర్సనల్‌కు చెందిన విడోస్ టెక్/నాన్‌టెక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆర్మ్స్/సర్వీసెస్‌లో పురుష, మహిళ, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కోసం 2019, ఏప్రిల్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు ప్రారంభమవుతుంది. దీనిద్వారా కింది పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
 
విభాగాల వారీ ఖాళీలు..
టెక్నికల్:
సివిల్ ఇంజనీరింగ్ -52 (పురుషులు-48, మహిళలు-4); మెకానికల్ ఇంజనీరింగ్-19 (పురుషులు-16, మహిళలు-3); ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-24 (పురుషులు-22, మహిళలు-2); ఏరోనాటికల్/ఏవియేషన్/బాలిస్టిక్స్/ఏవియానిక్స్ ఇంజనీరింగ్-12 (పురుషులు-12, మహిళలు-0); సీఎస్‌ఈ/కంప్యూటర్ టెక్నాలజీ/ఐటీ/ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ -34 (పురుషులు-31, మహిళలు-3); ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్ -30 (పురుషులు-28, మహిళలు-2); ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ఫైబర్ ఆప్టిక్స్/మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-11 (పురుషులు మాత్రమే); ప్రొడక్షన్ ఇంజనీరింగ్-3 (పురుషులు మాత్రమే); ఆర్కిటెక్చర్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ-4 (పురుషులు మాత్రమే).
నాన్ టెక్నికల్: ఎస్‌ఎస్‌సీ (మహిళ, నాన్‌టెక్) నాన్ యూపీఎస్సీ-1, ఎస్‌ఎస్‌సీ (మహిళ) టెక్-1.
అర్హత: టెక్నికల్ పోస్టులకు బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచ్‌లో ఉత్తీర్ణత. నాన్ టెక్నికల్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలాలో ఏదైనా ఒక సెంటర్‌లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వయసు: 2019, ఏప్రిల్ 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. (విడోస్ 35 ఏళ్ల వరకు అర్హులు).
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు 49 వారాల పాటు శిక్షణ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 9, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

No comments:

Post a Comment