✦ ఎస్‌ఐ (సివిల్) ఫైనల్ 'కీ'
✦ ఎస్‌ఐ (ఐటీ/కమ్యూనికేషన్స్)/ ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) ఫైనల్ 'కీ'
✦ కానిస్టేబుల్ (సివిల్) ఫైనల్ 'కీ'
✦ కానిస్టేబుల్ (ఐటీ/కమ్యూనికేషన్స్) ఫైనల్ 'కీ'
✦ కానిస్టేబుల్ (డ్రైవర్) ఫైనల్ 'కీ'
✦ కానిస్టేబుల్ (మెకానిక్) ఫైనల్ 'కీ'
✪ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రంలో మొత్తం 18,428 పోలీసు పోస్టుల భర్తీకి గతేడాది మేలో పోలీసు నియామక మండలి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటి 17,156 కానిస్టేబుల్ ఉండగా.. 1,272 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్, మే నెలల్లో తుది పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తుది ఫలితాల్లో అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం.. ఖాళీలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో తుది జాబితాలో ఎంపికై అభ్యర్థులకు జూన్ నుంచే పోలీసు శిక్షణ ప్రారంభం కానుంది. జూన్ నెలాఖరునాటికి ఎస్‌ఐలకు, జులై నుంచి కానిస్టేబుల్ శిక్షణ చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
వెబ్‌సైట్