ముంబయిలోని
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బరోడా కార్పొరేట్ సెంటర్ బరోడా మణిపాల్
స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్
అండ్ ఫైనాన్స్ (పీజీసీబీఎఫ్) కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సు (9 నెలలు)ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల్ని బ్యాంక్‌లో
ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/ స్కేల్-1గా
నియమిస్తుంది. వివరాలు...* పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీసీబీఎఫ్) మొత్తం ఖాళీల సంఖ్య: 600అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.వయఃపరిమితి:
20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 03.07.1990 నుంచి 02.07.1998
మధ్య జన్మించి ఉండాలి. పై రెండు తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు.ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ పరీక్ష తేది: 28.07.2018. ఆన్‌లైన్ ఎగ్జామ్‌కు కాల్ లెటర్లను 18.07.2018 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప,
కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం,
వరంగల్.దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేది: 12.06.2018చివరితేది: 02.07.2018
|
No comments:
Post a Comment