Sunday, 17 June 2018

తెలంగాణ కేజీబీవీల్లో 1050 ఖాళీలు (చివ‌రితేది: 23.06.18)

తెలంగాణ క‌స్తూర్భాగాంధీ బాలికా విద్యాల‌యాలు, అర్బ‌న్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ సీఆర్‌టీ, ఎస్‌వో త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి స‌ర్వ‌శిక్షా అభియాన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల‌కు కేవ‌లం మ‌హిళా అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు.వివ‌రాలు..* మొత్తం ఖాళీల సంఖ్య‌: 10501) పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ‌ర్లు (పీజీసీఆర్‌టీ): 580స‌బ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ‌మేటిక్స్, ఎక‌నామిక్స్, కామ‌ర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీ, న‌ర్సింగ్‌.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌తోపాటు బీఎడ్ ఉత్తీర్ణ‌త‌.2) స్పెష‌ల్ ఆఫీస‌ర్లు (ఎస్‌వో): 49అర్హ‌త‌: పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హ‌త‌ ఉండాలి. 3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ‌ర్ (సీఆర్‌టీ): 359స‌బ్జెక్టులు: మ్యాథ‌మేటిక్స్, ఫిజిక‌ల్ సైన్స్, బ‌యలాజిక‌ల్ సైన్స్, సోష‌ల్, తెలుగు,హిందీ, ఇంగ్లిష్. అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్, బీఎడ్‌తోపాటు టీఎస్ టెట్/ ఏపీ టెట్/ సీటెట్ అర్హ‌త ఉండాలి. 4) ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ (పీఈటీ): 62అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు ఫిజిక‌ల్ ఎడ్యుక‌ష‌న్‌లో స‌ర్టిఫికెట్/ డిప్లొమా లేదా బ్యాచిల‌ర్స్ డిగ్రీతోపాటు క‌నీసం ఒక ఏడాది బీపీఈడీ ఉండాలి. ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ఆధారంగా. రాత ప‌రీక్ష‌లు ఆయా పూర్వ‌పు జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఆబ్జెక్టివ్ విధానంలో జ‌రుగుతాయి.రాత ప‌రీక్షల తేదీలు: ఎస్‌వో-02.07.2018, పీజీసీఆర్‌టీ-03.07.2018, సీఆర్‌టీ, పీఈటీ-04.07.2018.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు 20.06.2018 నుంచి అందుబాటులో ఉంటాయి.చివ‌రితేది: 23.06.2018.

No comments:

Post a Comment