Saturday 9 June 2018

ఇండియన్ "ఆర్మీ" లో "10+2" తో ఉద్యోగాలు

Image result for indian armyదేశ సేవ చేయాలనుకునే యువకులకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానం పలుకుతోంది..10 +2 అర్హతతో ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ కింద 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సు-40 నోటిఫికేషన్ విడుదలైంది..అంతేకాదు ఈ కోర్సుకి 20 ఏళ్ల లోపు విద్యార్ధులే ఆర్హులు..

వివరాలు : 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం-40 కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగం ఇస్తారు. మొత్తం ఖాళీలు సంఖ్య: 90
వయసు : 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జూలై 01, 1999 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్ల్లు.

ఎంపిక విధానం : అకడమిక్ మార్కుల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్ ఎంవోడీ (ఆర్మీ) అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది. తర్వాత అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తారు. అలాట్ చేసిన సెలక్షన్ సెంటర్‌లో ఎస్‌ఎస్‌బీ తేదీలను ఎంపిక చేసుకోవాలి.
ఎస్‌ఎస్‌బీ అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా కేంద్రాల్లో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు అభ్యర్థులను పరీక్షిస్తారు.
రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. స్టేజ్-1 లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఐదు రోజులుంటాయి. అనంతరం స్టేజ్-2లో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.


శిక్షణ:
శిక్షణకాలంలో మొదటి ఏడాది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌ను గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహిస్తారు.



టెక్నికల్ ట్రైనింగ్ : ఫేజ్-1లో (ప్రి కమిషన్ ట్రైనింగ్) మూడేళ్ల పాటు పుణె లేదా ఎంసీటీఈ మెహ లేదా ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఫేజ్-2లో (పోస్ట్ కమిషన్ ట్రైనింగ్) ఏడాది పాటు ఉంటుంది.
ఫైనల్ ఎగ్జామ్స్ పూరైన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీని ప్రధానం చేస్తారు.


పేస్కేల్ , పదోన్నతలు : శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు. అనంతరం కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ (టీఎస్), బ్రిగేడర్, మేజర్ జనరల్ నుంచి సీవోఏఎస్ వరకు పదోన్నతి పొందవచ్చు.
మొదట లెవల్ 10 హోదాలో రూ.56,100 - 1,77,500 ఇస్తారు. వీటికి అదనంగా ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ పద్ధతిలో.
దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 14, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in

No comments:

Post a Comment