రాష్ట్రంలోని
వివిధ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్
అడ్మిషన్ల నిర్వహణ కోసం తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటన
విడుదల చేసింది.
వివరాలు...* టీఎస్ పాలిసెట్-2018 స్పాట్ అడ్మిషన్లుఅర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక వరుసగా ఈ మూడు విధాలుగా ఉంటుంది. 1) టీఎస్ పాలిసెట్-2018లో అర్హత సాధించినవారు, 2) ఒక ప్రయత్నంలో టీఎస్ పాలిసెట్-2018 అర్హత సాధించనివారు, 3) పదో తరగతి ప్యాసయి పాలిసెట్ పరీక్ష రాయనివారు. దరఖాస్తు విధానం: దరఖాస్తులను సీట్లు ఖాళీగా ఉన్న ఆయా కాలేజీలకు పంపాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఫీజుతో సంబంధిత పాలిటెక్నిక్స్ ప్రిన్సిపల్‌లను సంప్రదించాలి. ముఖ్యమైన తేదీలు:ఖాళీల వివరాలను సంబంధిత కాలేజీలు వెల్లడించే తేది: 20.06.2018 దరఖాస్తులు స్వీకరణ ప్రారంభ తేది: 21.06.2018 చివరితేది: 22.06.2018 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించు తేది: 23.06.2018 |
Wednesday, 20 June 2018
టీఎస్ పాలిసెట్-2018 - స్పాట్ అడ్మిషన్లు (22.06.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment