Friday 6 May 2016

మే 9న ఆకాశంలో అద్భుతం....

హైదరాబాద్: మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అంతరిక్షంలో జరగబోయే ఓ అద్భుతం మీ కళ్ల ముందు ఆరోజు ఆవిష్కృతం కానుంది. 10 ఏళ్ల తర్వాత సూర్యుణ్ణి బుధ గ్రహం దాటివెళ్లే అరుదైన సన్నివేశం ఆకాశంలో చోటు చేసుకోనుంది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు చెన్నై బిల్లా ప్లానిటోరియంలో నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. అరుదైన సన్నివేశాన్ని మామాలు కళ్లతో చూడకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధగ్రహం సూర్యుడిని ముందు నుంచి దాటివెళ్లే సన్నివేశం మే 9వ తేదీ సాయంత్రం 4.15 నుం చి 6.20 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో బుధగ్రహ వ్యాసం సూర్యుడికన్న చిన్నదిగా ఉండడంతో ఈ అరుదైన సన్నివేశం చిన్న చుక్కవలే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు 7 గంటల పాటు ఈ అరుదైన సన్నివేశం భూమిపై నివసించే వారు వీక్షించొచ్చు. ఈ అరుదైన సంఘటనను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీక్షించవచ్చు. మరోవైపు ఈ అరుదైన సంఘటన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పెన్స్ లాంటి దేశాల ప్రజలకు వీక్షించే అవకాశం లేకుండా పోయింది.
 
మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట అయితే మన దేశంలోని ప్రజలు సూర్యాస్తమయ సమయంలో ఈ సన్నివేశం చూడొచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో సూర్యోదయంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకోవడం వారికి కలిసొచ్చింది. అందుకే వారు ఈ అరుదైన సంఘటనను వీక్షించొచ్

No comments:

Post a Comment