Sunday 15 May 2016

పామును కరకర నమిలి చంపేసిన జార్ఖండ్ వాసి!

snakeసాధారణంగా పామును చూసినా.. పాము కరిచినా ప్రాణభయంతో వణికిపోతూ.. కేకలు పెడుతుంటారు. కానీ, ఆ జార్ఖండ్ వాసి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. నిద్రపోతున్న సమయంలో తనను పాము కరిచిందనీ ఆగ్రహించి.. ఆ పామునే కరకర నిమిలి పారేశాడు. దీంతో ఆ పాము చనిపోగా.. అతను కూడా పాము కాటుకు గురై 12 గంటల తర్వాత చనిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని లాతేహర్ జిల్లా, బరియటు గ్రామానికి చెందిన రాంతూ ఓరన్ అనే వ్యక్తి నిద్ర పోయేందుకు ఇంటి ఆరుబయట పడుకున్నాడు. అలా కన్నుమూసీ మూయగానే ఓ పాము వచ్చి కాటేసింది. అంతే... అతనికున్న మూఢ నమ్మకం ప్రకారం పామును చంపేస్తే విషం విరుగుడవుతుందని భావించి దాన్ని వెతకడం ప్రారంభించాడు. 
 
అతడికి చుట్టుపక్కల వారు తోడయ్యారు. వారంతా కలిసి పామును గుర్తించి.. ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత రాంతూ ఓరన్ నోటితో కొరికి, నమిలుతూ పామును చంపేశాడు. ఆ తర్వాత యధావిధిగా నిద్రపోయాడు. అయితే, పాము కాటుకు గురైన ఓరన్‌ శరీరం విషం కారణంగా రంగుమారడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం కాపాడలేక పోయారు.

No comments:

Post a Comment