Tuesday 31 May 2016

ఇంటర్నెట్‌లో అవసరం లేకుండానే.............ఉచిత టీవీ ప్రసారాలు

ఉచిత టీవీ ప్రసారాలుఇంటర్నెట్‌లో అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా టెలివిజన్‌ ప్రసారాలను చూసే అవకాశం త్వరలోనే రానుంది. దూరదర్శన్‌ ద్వారా అందుబాటులోకి వస్తున్న ఈ సదుపాయంతో మారుమూల గ్రామాల్లో సైతం వార్తాప్రసారాలకు అవకాశం ఉంటుంది. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్‌ రంగంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న దూరదర్శన్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ ఉచిత ప్రయోగానికి స్వీకారం చుట్టింది. 
డిడి అందిస్తున్న ఈ ఉచిత టీవీ ప్రసారాలను చూడాలంటే మాత్రం వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్స్‌లో ''డీవీబీ-2'' (Digital Video Brosdcasting Terrestrial two)డోంగిల్స్‌ను వేసుకోవాల్సి వుంటుంది. దీని ధర సుమారుగా రూ.3వేల రూపాయలు ఈ ధర ఇంకా అందుబాటులో వస్తే... దూరదర్శన్‌ తలపెట్టిన ఈ ప్రయోగం సక్సెస్‌ అయినట్టేనని నిపుణుల అంచనా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోని రానప్పటికీ... ప్రాథమిక దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, గౌహతి, పాట్నా, రాంచి, కటక్‌, లక్నో, జలంధర్‌, రాయపూర్‌, ఇండోర్‌, ఔరంగాబాద్‌, భూపాల్‌, బెంగుళూర్‌, అహ్మదాబాద్‌ తదితర 16 నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఈ సేవలను త్వరలోనే ఇతర నగరాలకు విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉచిత టెలివిజన్‌ ప్రసారాలను మారుమూల గ్రామల్లోనూ వీక్షించవచ్చు.

No comments:

Post a Comment