37,500 మంది ఉద్యోగులు..........
కొత్త జిల్లాలకు 37,500 మంది ఉద్యోగులు
- డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా పదోన్నతులు
- జిల్లాల్లో 41 శాఖల ఏర్పాటుకు యోచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం
కొత్తగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలకు 37,500 ఉద్యోగులు అవసరమవుతారని
అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లు, శాఖాధిపతులను వీరికి అదనం.
రాష్ట్రంలో ఐఎఎస్‌ల కొరత ఉన్నందున డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా
పదోన్నతి కల్పించనున్నారు. డీఆర్‌ఓలుగా పని చేస్తున్న వారికి సీనియార్టీ
ప్రాతిపదికన ప్రమోటీ ఐఎఎస్‌లుగా పదోన్నతి కల్పించనున్నట్టు తెలుస్తోంది. 8
మండలాలకు ఒక ఆర్డీఓను నియమించాల్సి ఉన్నందున కొందరు సీనియర్ తహసీల్దార్లకు
ఆర్డీఓలుగా ప్రమోషన్ కల్పించనున్నారు. 15 జిల్లాలకు ఒకేసారి ఇంతమంది
సిబ్బందిని సమకూర్చడం సాధ్యం కాకుంటే ఇప్పుడున్న పది జిల్లాల్లో పని
చేస్తున్న సిబ్బందిలో కొంతమందిని కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకా శాన్ని
కూడా అధికారుల పరిశీలిస్తున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రె
సిడెన్షియల్ ఆర్డర్ లేనందున పాత జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బందిని
కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉందా? లేదా? అన్న మీ మాంశలో అధికారులు
ఉన్నారు.
జిల్లాకు 2500 మంది ఉద్యోగులు
పాలన
సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాలో 2500 మంది సిబ్బంది, శాఖాధిపతులతో పాటు ఇతర
అధికారులను నియమిం చనున్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 41 శాఖలున్నాయి. ఆయా
శాఖలకు ఒక శాఖాధిపతి ఉన్నారు. అదే తరహాలో జిల్లా కేంద్రంలో కూడా 41 శాఖలను
ఏర్పా టు చేసి అక్కడే శాఖాధిపతులను నియమిస్తే పను లు సులువుగా సాగుతాయని
ప్రభుత్వం భావిస్తోంది. అయితే అంతమంది శాఖాధిపతును నియామకాలు చేపట్టేందుకు
ఆయా శాఖల్లో పని చేస్తున్న కింది స్థాయి అధికారులకు ప్రమోషన్ కల్పించాలని
ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల సుమారు వెయ్యి మందికి
ఉద్యోగులకు పదోన్నతి లభించను న్నట్టు తెలిసింది. అదేతరహాల్లో డిప్యూటీ
కలెక్టర్లు, డీఆర్ఓలు, ఎమ్మార్వోలు కూడా పదోన్నతి పొందనున్నారు.
ఉద్యోగులకు ఆప్షన్స్
కొత్త
జిల్లాల్లో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఇప్పుడున్న పది జిల్లాల్లో
పని చేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలి సింది.
ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో పని చేస్తున్న ఉద్యోగికి కొత్తగా
ఏర్పాటు చేయబోయే వనపర్తికి వెళ్తారా? లేకా ఇతర జిల్లాల్లో పని చేస్తారా?
అన్న విషయం పై ఆ ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. సదరు ఉద్యోగి
వనపర్తి జిల్లాలో పని చేస్తా నంటే వనపర్తికి బదిలీ చేస్తారు. ఇలా పది
జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇదే పద్దతిన కొత్త జిల్లాలకు
కేటాయింపులు జరపనున్నట్టు తెలిసింది.
ఉద్యోగుల్లో ఆందోళన
ప్రెసిడెన్షియల్
ఆర్డర్ లేకుండానే రాష్ట్ర సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నది.
ప్రభుత్వం కల్పించే ఆప్షన్ సౌకర్యంతో కొత్త జిల్లాలకు వెళ్లితే సర్వీస్
రూల్స్, సీనియార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనలో ఉద్యోగులు
ఉన్నారు. అయితే ప్రభుత్వమే బదిలీ చేస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు
రాకపోవచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా కేంద్రంలో అవసరమైన హెచ్ఓడీలు.. ఉద్యోగులు
-
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇద్దరు
డిప్యూటీ కలెక్టర్లతో పాటు 100 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించాల్సి
ఉంది
- జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, ఓఎస్డీతో పాటు 50 మంది
- ఆర్ఐఓలు 5
- ఆర్డీఓలు 10
- విద్యా శాఖ కార్యాలయంలో డీఈఓతో పాటు 30 మంది ఉద్యోగులు
- అర్ధ గణాంక శాస్త్రంలో 16
- జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 20
- ఆర్జేడీ కార్యాలయంలో 3 జాయింట్ డైరెక్టర్లతో పాటు 45 మంది ఉద్యోగులు
- వ్యవసాయ కార్యాలయంలో ఒక జాయింట్ డైరెక్టర్‌తో పాటు 15 మంది ఉద్యోగులు
- జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 15
- ఏసీబీ కార్యాలయంలో 40
- వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎమ్హె చ్ఓతో పాటు 20 మంది ఉద్యోగులు
- ఎక్సైజ్ కార్యాలయంలో 25
- టీబీ కంట్రోల్ కార్యాలయంలో 40
- కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో డీసీటీఓతో పాటు 15 మంది ఉద్యోగులు
- జిల్లా యూత్‌వెల్ఫేర్ కార్యాలయంలో 5
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యాలయాల్లో 200
- మైనార్టీ శాఖ కార్యాలయంలో 30
- సంక్షేమ శాఖల కార్పొరేషన్లలో 100
- మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు 45 మంది ఉద్యోగులు
- జిల్లా విద్యా శాఖలో డీఈఓతో పాటు 40 మంది ఉద్యోగులు
- ఇవేగాకా ఆయా శాఖలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లను నియమించాల్సిఉన్నది.
ఈ లెక్కన చూస్తే జిల్లా మొత్తంలో 2500 మంది ఉద్యోగులు అవసరమవుతారని ప్రభుత్వం అంచనాలు వేస్తున్నది.
No comments:
Post a Comment