Saturday 20 February 2016

చిన్నారులు, టీనేజర్లు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తెగ వాడేస్తున్నారా?

చిన్నారులు, టీనేజర్లు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తెగ వాడేస్తున్నారా?

చిన్నారులు సెల్‌ఫోన్లు వాడుతున్నారా? అయితే వెన్నెముక సమస్యలు తప్పవని తాజా అధ్యయనంలో తేలింది. సెల్ ఫోన్లను గంటల తరబడి వాడే చిన్నారులు, టీనేజర్లలో వెన్నెముక సమస్యలు ఏర్పడుతున్నాయని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తెలిపింది.

ఈ ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 79 శాతం మంది సెల్ ఫోన్ల వాడకంలో అత్యధిక సమయం గడుపుతువన్నారని తేలింది. ఇంకా చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని గంటల తరబడి వంగి ఉండటంతో ఎముకల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు జీవితకాలం వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. 
 
ఇంకా ఈ సర్వేలో తేలిందేమిటంటే.. సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్లపై గడుపుతున్న వారిలో మెడ, భుజాల నొప్పి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీన్ని నివారించాలంటే.. చాలామటుకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని లీలావతి ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు.
 
అలాగే సెల్ ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారిలోనూ ఇలాంటి సమస్యలు తప్పట్లేదని వైద్యులు చెప్పారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు ఇతరత్రా కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం వెచ్చించే వారికి కూడా వెన్నుపూసలో సమస్యలు, మెడనొప్పి, వెన్నునొప్పి, భుజాల్లో నొప్పులు, కీళ్ళనొప్పులు ఏర్పడుతున్నాయని సర్జన్ ఎస్ వెంగ్‌సర్కార్ వెల్లడించారు.

No comments:

Post a Comment