రాబోయే లీపు రోజులివి
2020 శనివారం
2024 గురువారం
2028 మంగళవారం
2032 ఆదివారం
2020 శనివారం
2024 గురువారం
2028 మంగళవారం
2032 ఆదివారం
మన కాలమానిని (కేలండర్)లో సంవత్సరానికి ఉండే రోజులు 365. అదే లీపు సంవత్సరం విషయానికొస్తే 366 రోజులుంటాయి. అంటే ఒక రోజు ఎక్కువ అన్న మాట. అందరూ కాకున్నా కొందరైనా ఎందుకిలా అనే మీ మాంసలో పడక మానరు. సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకన్ల సమయం పడుతుంది. మన కేలండర్‌లో ఉండేవి 365 రోజులే అయినప్పుడు మిగతా సమయం ఏమైనట్లు? ఈ సందేహానికి సమాధానమే లీపు సంవత్సరం. 5 గంటల 48 నిమిషాల 46 సెకన్ల సమయం నాలుగేళ్లు గడిచే సరికి ఒక రోజుకు సమానమవుతుంది. ఈ రోజును నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో కలపాలనే ఆలోచన చేశారు. దీని ఫలితమే ఫిబ్రవరి 29ను ‘లీపు దినం’గా పాటిస్తారు. రోమన జనరల్ జూలియస్ కైసర్ దీనికి రూప కల్పన చేశారు.
No comments:
Post a Comment