ఒక్క క్లిక్‌లో ఏడడుగులు!
♦ పెళ్లి కార్డుల నుంచి ఫొటోగ్రాఫర్ల వరకు ఆన్‌లైన్లో
♦ 14 నగరాల్లో సేవలందిస్తున్న ‘7 వచన్’
హైదరాబాద్: ఆన్‌లైన్లో వస్తువులు కొనటం తెలుసు. కానీ పెళ్లి మొత్తం ఆన్‌లైన్లోనే అంటే!!? అంటే పెళ్లికి అవసరమైన దుస్తులు, కల్యాణ మండపం, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, హోటల్ వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేస్తే? దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకుంది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న 7 వచన్.కామ్. మరిన్ని వివరాలు సంస్థ సీటీఓ తారక్ రాము మాటల్లోనే..
♦ పెళ్లికి ఇంటిల్లిపాదీ పనిచేసినా ఏదో ఒకటి మరిచిపోతుంటాం. అలాంటివి ఉండకూడదనే ‘7 వచన్.కామ్’ను ఆరంభించాం. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మిన్నత్ లాల్‌పూరియా 2012లో రూ.30 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 7 వచన్.కామ్‌ను ఆరంభించారు.
♦ మా దగ్గర పెళ్లి పత్రికల నుంచి మొదలుపెడితే మేకప్ ఆర్టిస్టులు, మేళతాళాలు, హోటల్స్, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్, డెకరేషన్ వంటి 14 రకాల సేవలను పొందొచ్చు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని 14 నగరాల్లో సేవలందిస్తున్నాం. మా ప్రత్యేకత ఏంటంటే.. మా సైట్ నుంచి బుక్ చేయగానే సంబంధిత సేవలందించే వారి వివరాలు, ధరలు అప్పటికప్పుడే కనిపిస్తాయి. దీంతో మనకు నచ్చిన వారిని ఎంచుకునే వీలుంటుంది.
♦ మా వెబ్‌సైట్‌లో కావాల్సిన ఆర్డర్‌ను ఎంచుకున్నాక 25 శాతం సొమ్ము చెల్లించాలి. ఆ తర్వాత నెల రోజుల ముందు మరో 25 శాతం, కార్యక్రమం రోజు, పూర్తయ్యాక మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోటి రూపాయలు ఆపైన బడ్జెట్ పెళ్లిళ్లకు మాత్రమే సేవలందిస్తున్నాం. ఇకపై మధ్య, సామాన్య తరగతి పెళ్లిళ్లకూ సేవలందించాలని నిర్ణయించాం. అందుకే దేశంలోని అన్ని నగరాల్లోని కల్యాణ మండపాలతో ఒప్పందం చేసుకుంటున్నాం.
♦ ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా టర్నోవర్ నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.3.5 కోట్లు నిధులను సమీకరించాం.
♦ ముంబై, ఖతర్, బెంగళూరుకు చెందిన పలువురు పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారు. మూడో రౌండ్‌లో భాగంగా ఈ ఏప్రిల్‌లో రూ.18 కోట్ల నిధులను సమీకరిస్తున్నాం. వీసీలతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం మా వద్ద 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

No comments:
Post a Comment