నిమ్మరసం - ఉప్పుతో వడదెబ్బ మటుమాయం**
నిమ్మరసం - ఉప్పుతో వడదెబ్బ మటుమాయం**
- వడదెబ్బకు గురైన వారు నిమ్మ రసంలో ఉప్పు కలుపుకుని తాగితే త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే, ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
- నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యరీత్యా లెమన్ టీ ఎంతో మంచిది. భోజనానికి ముందు, తర్వాత నిమ్మచక్కతో చేతులు శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
- ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం. శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.
No comments:
Post a Comment