Friday, 26 February 2016

స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా జీవితం నాశనం: కారణాలు ఇవే !

స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా జీవితం నాశనం: కారణాలు ఇవే !

టైటిల్ ఢిపరెంట్ గా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా.అవును మీ జీవితమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్ స్మార్ట్‌గా ముందుకు నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌తో మీ జీవితం ఎంత ప్రమాదంలో చిక్కుకుందో మీకు తెలియదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అది పరిమితంగా చాలా జాగ్రత్తగా వాడాలి. లేకుంటే మీ జీవితం కోల్పోయే ప్రమాదం ఉంది. మరి మీ జీవితానికి స్మార్ట్ పోన్ తో ఎదురయ్యే ఓ 10 ప్రమాదాలను మీకు ఇస్తున్నాం అవునో కాదో మీరే తేల్చుకోండి.

రోడ్లు దాటేవేళ రోడ్డు దాటేటప్పుడు మీరు మీ ఫోన్ తో ఎప్.ఎమ్ లేకుంటే మ్యూజిక్ వింటూ దాటుతారు. అయితే అదీ చాలా ప్రమాదం. మీరు ఏదో లోకంలో ఉండి రోడ్డు దాటితే ఇక అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్ర్తతగా ఉండాలి.

సెల్ఫీ సెల్పీ కూడా చాలా ప్రమాదకరమే. సెల్ఫీలు దిగుతూ ఇప్పటికే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సెల్ఫీలు తీసుకునేవేళ చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆన్‌లైన్ రిలేషన్ షిప్ ఇది కూడా మీ కొంప కొల్లేరు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.దీని భారీన ఇప్పటికే లక్షల మంది పడిపోయారు కూడా.
ఒత్తిడి టెక్నాలజీ ఎంత ఎక్కువగా వాడితే అంత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.దీనికి బెస్ట్ వాట్సప్. అందులో మేసేజ్ లు చెకింగ్ చేయలేక ఒత్తిడి వస్తుందనడంలో సందేహం లేదు.
మనీ గోవిందా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతున్నట్లే లెక్క..అవునా కాదా మీరే తేల్చుకోండి.
నిద్రలేమి ఫోన్ మీ పక్కనే పెట్టి పడుకోవడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు మీ దరిచేరే అవకాశం ఉంది.
లౌడ్ స్పీకర్ మీరు లౌడ్ స్పీకర్ పెద్దగా పెట్టుకోవడం వల్ల మీకు చెవి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే దీని మీద చాలామంది కంప్లయిట్ చేస్తున్నారు.
పొట్ట పెరగడం 24 గంటలు ఫోన్ ముందు కూర్చుని ఎంజాయ్ చేయడం వల్ల బద్దకం పెరిగి బాగా లావయ్యే ప్రమాదం ఉంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యులు మీ దరి చేరే అవకాశం ఉంది.

బ్రెయిన్ దెబ్బ ప్రతి చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడటం వల్ల మీరు మెమొరీ ని కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకోలేరు. ఏ చిన్న విషయానికైనా ఫోన్ వైపే చూస్తుంటారు. అయితే గూగుల్ మీరు మీ నాలెడ్జ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటే చాలా మంచిది.



>>>>>>>>>>>>>>>>>> *********** <<<<<<<<<<<<<<<<<<<<


No comments:

Post a Comment