Monday 29 February 2016

బడ్జెట్: ధరలు తగ్గనున్నవి, పెరగనున్నవీ.., పన్ను చెల్లించే వారికి ప్రయోజనాలివే

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. జైట్లీ ఓ పక్క బడ్జెట్ ప్రవేశ పెడుతుండగానే మరోపక్క స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. స్వల్ప మార్లుపతో ప్రారంభమైన మార్కెట్లు, తర్వాత భారీగా నష్టాల్లోకి వెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్ల అంచనాలకు దూరంగా వెళ్లడమే కారణం. మరోవైపు, తాజా బడ్జెట్ ద్వారా పలు వస్తువులు ఖరీదు కానున్నాయి. ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. బ్రాండెడ్ దుస్తులపై పన్ను భారం పెరగనుంది. లగ్జరీ కార్లధరలు పెరుగుతాయి. సిగరేట్ ధరలు రెక్కలు తాకనున్నాయి. బంగారు ఆభరణాల పైన అదనంగా 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండనుంది.

Union Budget 2016 17: IT slabs remain unchangedహోటల్స్ , రెస్టారెంట్లు ఒకింత ఖరీదు కానున్నాయి. కెమెరాల ధరలు పెరుగుతాయి. కంప్యూటర్ల ధరలు పెరగనున్నాయి. ఏసీలు, టీవీలు, ప్లాస్మా టీవీలు పెరగనున్నాయి. పర్యాటక రంగం ఖరీదు కానుంది. కార్పోరేట్ వైద్యం ఖరీదు కానుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పెరగనున్నాయి. మద్యం ధరలు పెరగనున్నాయి. మాల్స్, మొబైల్స్ ఖరీదు కానున్నాయి. విదేశీ వస్తువులు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానికి పరికరాలు, రబ్బర్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. డయాలసిస్ పరికరాలపై పన్ను తగ్గింపు ఉంటుంది 60 గజాల చదరపు గజాల ఇళ్లు, ప్లాట్ల పైన పన్ను మినహాయింపు ఎంతోమందికి ఊరట. సింగిల్స్ బీమా ప్రీమియం కూడా ప్రయోజనకరంగా ఉండనుంది. వెండి ధరలు తగ్గనున్నాయి. మోటార్లు, స్మార్ట్ వాచీలు, చెప్పులు, గృహ రుణాలు, ఎరువుల ధరలు తగ్గనున్నాయి.
Union Budget 2016 17: IT slabs remain unchangedపన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలివీ.. ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులపై కరుణ చూపించారు. ఈ మేరకు పలు రాయితీలు ప్రకటించారు. ఆదాయపు పన్ను సెక్షన్ 87 ఏ కింద వార్షిక పన్ను రూ.5 వేల లోపు చెల్లిస్తున్న వారికి రూ.3 వేల రాయితీని ప్రకటించారు. దీంతో ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం పొందుతున్న వారు గరిష్ఠంగా రూ.2 వేల పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
Union Budget 2016 17: IT slabs remain unchangedఈ నిర్ణయం సుమారు 2 కోట్ల మంది వేతన జీవులకు ప్రయోజనం కలగనుంది. దీంతో పాటు ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్సులపై పన్ను రాయితీని రూ.24 కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది సొంతిల్లు లేని వేలాది మందిని పన్ను భారం నుంచి దూరం చేయనుంది. రూ.35 లక్షల వరకూ గృహ రుణాలు తీసుకునే వారికి అదనంగా రూ.50 వేల వడ్డీ రాయితీ దగ్గర చేస్తున్నట్టు తెలిపారు. అయితే, వీరి ఇంటి విలువ రూ.50 లక్షలను మించరాదు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మిగతా ప్రయోజనాలేవీ కల్పించలేదు. కనీస పన్ను పరిధిని రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు సవరిస్తారని అందరూ భావించినా, ఆ దిశగా నిర్ణయం వెలువడలేదు.

No comments:

Post a Comment