Friday, 26 February 2016

80 శాతం దృష్టిలోపం.. ముస్లిం గర్ల్.. అయినా భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేసేసింది..!

80 శాతం దృష్టిలోపం.. ముస్లిం గర్ల్.. అయినా భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేసేసింది..!

మొన్నటికి మొన్న రామాయణం పరీక్షలో ఓ ముస్లిం గర్ల్ 93 శాతం మార్కులు కొట్టేసిన నేపథ్యంలో.. భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠతా చేసి ఏడేళ్ల వయస్సున్న ముస్లిం గర్ల్ రిదా జెహ్రా రికార్డు సృష్టించింది. 80 శాతం దృష్టిలోపం వున్నప్పటికీ.. కానీ విన్నదానిని చక్కగా అర్థం చేసుకుని, జ్ఞాపకం పెట్టుకోగల సామర్థ్యం గల ఆ అమ్మాయికి ప్రతిరోజూ దైవ ప్రార్థన చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ మక్కువతోనే భగవద్గీతను వింటూ ఉండేది. ఇప్పుడు ఆమెకు భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠతా వచ్చు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని లోహియా నగర్‌కు చెందిన రిదా జెహ్రా 80 శాతం దృష్టి లోపం కలిగిన అంధురాలు. ఆమె తల్లిదండ్రులు ఆమెను మీరట్‌లోని అంధుల వసతి గృహ పాఠశాలలో మూడేళ్ల క్రితం చేర్పించారు. దైవ ప్రార్థనపై ఆమెకు మక్కువ కలిగి.. ఖురాన్, భగవద్గీత తేడాలను పక్కనబెట్టేసింది. భగవద్గీత లేదా ఖురాన్ చదవడం ద్వారా దేవుడిని ప్రార్థించడం తనకు చాలా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం జెహ్రా మూడో తరగతి చదువుతోంది. 
 
నగరంలో బాలలకు గీతా పఠనంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెహ్రా చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ శర్మకు 2015లో భావించారు. ఈ క్రమంలోనే పాఠశాలలో శ్లోకాలను నేర్పించామని.. ఇందులో జెహ్రా సులభంగా త్వరలోనే నేర్చుకుంది. బ్రెయిలీ లిపిలో భగవద్గీత తన వద్ద లేకపోవడంతో ఆ శ్లోకాలను తాను ఆమెకు చదివి వినిపించేవాడినని వివరించారు. ఆమె వింటూనే అన్ని శ్లోకాలను కంఠస్థం చేసిందన్నారు.
 
జెహ్రా తండ్రి రయీస్ హైదర్ కూడా తన కుమార్తెను ప్రోత్సహిస్తున్నారు. ఆమెకు దృష్టి లోపం ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి విద్యావంతురాలు కావాలని ఆకాంక్షించారు. అంతేగాకుండా భగవద్గీత, ఖురాన్ ఏది చదివినా తనకు అభ్యంతరం లేదని, ఇతర మతాల గురించి తెలుసుకోవడం వల్ల తెలివితేటలు తెలివి తేటలు పెరుగుతాయని తెలిపారు.

No comments:

Post a Comment