Monday, 29 February 2016

యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
TELUGU JOBSపోస్టుల వివరాలు:
  • ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ (ఇంజనీరింగ్): 3
  • అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్: 42
  • అసిస్టెంట్ డెరైక్టర్ (సిఫర్): 1
  • ఎక్స్‌ట్రా అసిస్టెంట్ డెరైక్టర్స్: 9
  • డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సెల్ (హిందీ బ్రాంచ్): 1
  • అసిస్టెంట్ డెరైక్టర్, గ్రేడ్ 1 (కాస్టింగ్): 1
  • సైంటిస్ట్స్-బి (సివిల్ ఇంజనీరింగ్): 16
  • మెడికల్/ రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద): 15
  • సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (గ్రేడ్ 1, 2): 19
  • స్టోర్స్ ఆఫీసర్స్: 12
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016’ ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ‘ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)’ ఖాళీలను భర్తీ చేస్తారు.
అర్హతఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/తత్సమానం లేదా వైర్‌లెస్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్/ రేడియో ఇంజనీరింగ్ విభాగంలో ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 25
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in

బడ్జెట్: ధరలు తగ్గనున్నవి, పెరగనున్నవీ.., పన్ను చెల్లించే వారికి ప్రయోజనాలివే

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. జైట్లీ ఓ పక్క బడ్జెట్ ప్రవేశ పెడుతుండగానే మరోపక్క స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. స్వల్ప మార్లుపతో ప్రారంభమైన మార్కెట్లు, తర్వాత భారీగా నష్టాల్లోకి వెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్ల అంచనాలకు దూరంగా వెళ్లడమే కారణం. మరోవైపు, తాజా బడ్జెట్ ద్వారా పలు వస్తువులు ఖరీదు కానున్నాయి. ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. బ్రాండెడ్ దుస్తులపై పన్ను భారం పెరగనుంది. లగ్జరీ కార్లధరలు పెరుగుతాయి. సిగరేట్ ధరలు రెక్కలు తాకనున్నాయి. బంగారు ఆభరణాల పైన అదనంగా 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండనుంది.

Union Budget 2016 17: IT slabs remain unchangedహోటల్స్ , రెస్టారెంట్లు ఒకింత ఖరీదు కానున్నాయి. కెమెరాల ధరలు పెరుగుతాయి. కంప్యూటర్ల ధరలు పెరగనున్నాయి. ఏసీలు, టీవీలు, ప్లాస్మా టీవీలు పెరగనున్నాయి. పర్యాటక రంగం ఖరీదు కానుంది. కార్పోరేట్ వైద్యం ఖరీదు కానుంది.ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పెరగనున్నాయి. మద్యం ధరలు పెరగనున్నాయి. మాల్స్, మొబైల్స్ ఖరీదు కానున్నాయి. విదేశీ వస్తువులు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానికి పరికరాలు, రబ్బర్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. డయాలసిస్ పరికరాలపై పన్ను తగ్గింపు ఉంటుంది 60 గజాల చదరపు గజాల ఇళ్లు, ప్లాట్ల పైన పన్ను మినహాయింపు ఎంతోమందికి ఊరట. సింగిల్స్ బీమా ప్రీమియం కూడా ప్రయోజనకరంగా ఉండనుంది. వెండి ధరలు తగ్గనున్నాయి. మోటార్లు, స్మార్ట్ వాచీలు, చెప్పులు, గృహ రుణాలు, ఎరువుల ధరలు తగ్గనున్నాయి.
Union Budget 2016 17: IT slabs remain unchangedపన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలివీ.. ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులపై కరుణ చూపించారు. ఈ మేరకు పలు రాయితీలు ప్రకటించారు. ఆదాయపు పన్ను సెక్షన్ 87 ఏ కింద వార్షిక పన్ను రూ.5 వేల లోపు చెల్లిస్తున్న వారికి రూ.3 వేల రాయితీని ప్రకటించారు. దీంతో ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం పొందుతున్న వారు గరిష్ఠంగా రూ.2 వేల పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
Union Budget 2016 17: IT slabs remain unchangedఈ నిర్ణయం సుమారు 2 కోట్ల మంది వేతన జీవులకు ప్రయోజనం కలగనుంది. దీంతో పాటు ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్సులపై పన్ను రాయితీని రూ.24 కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇది సొంతిల్లు లేని వేలాది మందిని పన్ను భారం నుంచి దూరం చేయనుంది. రూ.35 లక్షల వరకూ గృహ రుణాలు తీసుకునే వారికి అదనంగా రూ.50 వేల వడ్డీ రాయితీ దగ్గర చేస్తున్నట్టు తెలిపారు. అయితే, వీరి ఇంటి విలువ రూ.50 లక్షలను మించరాదు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మిగతా ప్రయోజనాలేవీ కల్పించలేదు. కనీస పన్ను పరిధిని రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు సవరిస్తారని అందరూ భావించినా, ఆ దిశగా నిర్ణయం వెలువడలేదు.

Sunday, 28 February 2016

‘లీపు’ సంవత్సరం భలే రోజండీ


రాబోయే లీపు రోజులివి 
2020 శనివారం 
2024 గురువారం 
2028 మంగళవారం 
2032 ఆదివారం 

మన కాలమానిని (కేలండర్‌)లో సంవత్సరానికి ఉండే రోజులు 365. అదే లీపు సంవత్సరం విషయానికొస్తే 366 రోజులుంటాయి. అంటే ఒక రోజు ఎక్కువ అన్న మాట. అందరూ కాకున్నా కొందరైనా ఎందుకిలా అనే మీ మాంసలో పడక మానరు. సూర్యుడి చుట్టూ భూమి ఒకసారి తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకన్ల సమయం పడుతుంది. మన కేలండర్‌లో ఉండేవి 365 రోజులే అయినప్పుడు మిగతా సమయం ఏమైనట్లు? ఈ సందేహానికి సమాధానమే లీపు సంవత్సరం. 5 గంటల 48 నిమిషాల 46 సెకన్ల సమయం నాలుగేళ్లు గడిచే సరికి ఒక రోజుకు సమానమవుతుంది. ఈ రోజును నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో కలపాలనే ఆలోచన చేశారు. దీని ఫలితమే ఫిబ్రవరి 29ను ‘లీపు దినం’గా పాటిస్తారు. రోమన జనరల్‌ జూలియస్‌ కైసర్‌ దీనికి రూప కల్పన చేశారు.

Saturday, 27 February 2016

CRPF - 182 SI, ASI & Constable Posts (Last date: 23.03.2016)

Central Reserve Police Force has issued notification for the recruitment of Sub Inspector, Assistant Sub Inspector, Head Constable, Constable vacancies.
Post Details:
1. Sub Inspector (Staff Nurse): 22 Posts
2. Sub Inspector (Radiographer): 06 Posts
3. Assistant Sub Inspector (Pharmacist): 54 Posts
4. Assistant Sub Inspector (Laboratory Technician): 05 Posts
5. Assistant Sub Inspector (Dental Technician): 04 Posts
6. Head Constable (Jr X-Ray Assistant): 04 Posts
7. Head Constable (Laboratory Assistant): 02 Posts
8. Head Constable (Air Conditioning Plant Technician): 01 Post
9. Head Constable (Steward): 05 Posts
10. Constable (Ward Boy/ Girl): 27 Posts
11. Constable (Masalchi): 02 Posts
12. Constable (Cook): 22 Posts
13. Constable (S/K): 20 Posts
14. Constable (W/M): 8 Posts
Total No. Posts: : 182
Qualification: Intermediate or 10+2/ General Nursing and Midwifery/ Diploma/ Degree in Pharmacy/ Matriculation.
How to Apply: Candidates may apply online through website.
Last date for application: 23.03.2016. 

Notification
Online Application 

TS EAMCET – 2016 (Last date: 28.03.2016)

Engineering, Agriculture and Medical Common Entrance Test – 2016 (TS EAMCET – 2016) will be conducted by Jawaharlal Nehru Technological University Hyderabad (JNTUH) for entry into the first year of the following Under Graduate Professional courses offered for the academic year 2016-2017 in the University & Private unaided and affiliated Professional colleges in the State of Telangana.
1. B.E., B.Tech./ B.Tech. (Bio-Tech.)/ B.Tech. (Diary Technology)/ B.Tech. (Ag. Engineering)/ B.Pharmacy/ B.Tech. (Food Science and Technology (FST))/ B.Sc. (Commercial Agri. & Business Mgt. (CA & BM)).
2. B.Sc. (Ag.)/ B.Sc. (Hort.)/ B.V.Sc. & A.H./ B.F.Sc. 
3. MBBS/ BDS 
4. BAMS/ BHMS/ BNYS
5. Pharm-D
Date of commencement of submission of Online Application: 28.02.2016.
Last Date for submission of Online application: Without Late Fee: 28.03.2016.
With a Late Fee of Rs. 500: 03.04.2016.
With a Late Fee of Rs. 1,000: 13.04.2016.
With a Late Fee of Rs. 5,000: 22.04.2016.
With a Late Fee of Rs. 10,000: 29.04.2016.

Date of Test: 02.05.2016.


Notification
Website

నేటి నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఎంసెట్‌కు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచిwww.tseamcet.in వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తుందని, తుది గడువు వరకు ఆగకుండా విద్యార్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌వీ రమణారావు సూచించారు.

Friday, 26 February 2016

80 శాతం దృష్టిలోపం.. ముస్లిం గర్ల్.. అయినా భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేసేసింది..!

80 శాతం దృష్టిలోపం.. ముస్లిం గర్ల్.. అయినా భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థం చేసేసింది..!

మొన్నటికి మొన్న రామాయణం పరీక్షలో ఓ ముస్లిం గర్ల్ 93 శాతం మార్కులు కొట్టేసిన నేపథ్యంలో.. భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠతా చేసి ఏడేళ్ల వయస్సున్న ముస్లిం గర్ల్ రిదా జెహ్రా రికార్డు సృష్టించింది. 80 శాతం దృష్టిలోపం వున్నప్పటికీ.. కానీ విన్నదానిని చక్కగా అర్థం చేసుకుని, జ్ఞాపకం పెట్టుకోగల సామర్థ్యం గల ఆ అమ్మాయికి ప్రతిరోజూ దైవ ప్రార్థన చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ మక్కువతోనే భగవద్గీతను వింటూ ఉండేది. ఇప్పుడు ఆమెకు భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠతా వచ్చు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని లోహియా నగర్‌కు చెందిన రిదా జెహ్రా 80 శాతం దృష్టి లోపం కలిగిన అంధురాలు. ఆమె తల్లిదండ్రులు ఆమెను మీరట్‌లోని అంధుల వసతి గృహ పాఠశాలలో మూడేళ్ల క్రితం చేర్పించారు. దైవ ప్రార్థనపై ఆమెకు మక్కువ కలిగి.. ఖురాన్, భగవద్గీత తేడాలను పక్కనబెట్టేసింది. భగవద్గీత లేదా ఖురాన్ చదవడం ద్వారా దేవుడిని ప్రార్థించడం తనకు చాలా ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం జెహ్రా మూడో తరగతి చదువుతోంది. 
 
నగరంలో బాలలకు గీతా పఠనంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెహ్రా చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ శర్మకు 2015లో భావించారు. ఈ క్రమంలోనే పాఠశాలలో శ్లోకాలను నేర్పించామని.. ఇందులో జెహ్రా సులభంగా త్వరలోనే నేర్చుకుంది. బ్రెయిలీ లిపిలో భగవద్గీత తన వద్ద లేకపోవడంతో ఆ శ్లోకాలను తాను ఆమెకు చదివి వినిపించేవాడినని వివరించారు. ఆమె వింటూనే అన్ని శ్లోకాలను కంఠస్థం చేసిందన్నారు.
 
జెహ్రా తండ్రి రయీస్ హైదర్ కూడా తన కుమార్తెను ప్రోత్సహిస్తున్నారు. ఆమెకు దృష్టి లోపం ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి విద్యావంతురాలు కావాలని ఆకాంక్షించారు. అంతేగాకుండా భగవద్గీత, ఖురాన్ ఏది చదివినా తనకు అభ్యంతరం లేదని, ఇతర మతాల గురించి తెలుసుకోవడం వల్ల తెలివితేటలు తెలివి తేటలు పెరుగుతాయని తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా జీవితం నాశనం: కారణాలు ఇవే !

స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా జీవితం నాశనం: కారణాలు ఇవే !

టైటిల్ ఢిపరెంట్ గా ఉంది అని ఆశ్చర్యపోతున్నారా.అవును మీ జీవితమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్ స్మార్ట్‌గా ముందుకు నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌తో మీ జీవితం ఎంత ప్రమాదంలో చిక్కుకుందో మీకు తెలియదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అది పరిమితంగా చాలా జాగ్రత్తగా వాడాలి. లేకుంటే మీ జీవితం కోల్పోయే ప్రమాదం ఉంది. మరి మీ జీవితానికి స్మార్ట్ పోన్ తో ఎదురయ్యే ఓ 10 ప్రమాదాలను మీకు ఇస్తున్నాం అవునో కాదో మీరే తేల్చుకోండి.

రోడ్లు దాటేవేళ రోడ్డు దాటేటప్పుడు మీరు మీ ఫోన్ తో ఎప్.ఎమ్ లేకుంటే మ్యూజిక్ వింటూ దాటుతారు. అయితే అదీ చాలా ప్రమాదం. మీరు ఏదో లోకంలో ఉండి రోడ్డు దాటితే ఇక అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్ర్తతగా ఉండాలి.

సెల్ఫీ సెల్పీ కూడా చాలా ప్రమాదకరమే. సెల్ఫీలు దిగుతూ ఇప్పటికే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సెల్ఫీలు తీసుకునేవేళ చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆన్‌లైన్ రిలేషన్ షిప్ ఇది కూడా మీ కొంప కొల్లేరు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.దీని భారీన ఇప్పటికే లక్షల మంది పడిపోయారు కూడా.
ఒత్తిడి టెక్నాలజీ ఎంత ఎక్కువగా వాడితే అంత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.దీనికి బెస్ట్ వాట్సప్. అందులో మేసేజ్ లు చెకింగ్ చేయలేక ఒత్తిడి వస్తుందనడంలో సందేహం లేదు.
మనీ గోవిందా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతున్నట్లే లెక్క..అవునా కాదా మీరే తేల్చుకోండి.
నిద్రలేమి ఫోన్ మీ పక్కనే పెట్టి పడుకోవడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి. నిద్ర లేమితో అనారోగ్య సమస్యలు మీ దరిచేరే అవకాశం ఉంది.
లౌడ్ స్పీకర్ మీరు లౌడ్ స్పీకర్ పెద్దగా పెట్టుకోవడం వల్ల మీకు చెవి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే దీని మీద చాలామంది కంప్లయిట్ చేస్తున్నారు.
పొట్ట పెరగడం 24 గంటలు ఫోన్ ముందు కూర్చుని ఎంజాయ్ చేయడం వల్ల బద్దకం పెరిగి బాగా లావయ్యే ప్రమాదం ఉంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యులు మీ దరి చేరే అవకాశం ఉంది.

బ్రెయిన్ దెబ్బ ప్రతి చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడటం వల్ల మీరు మెమొరీ ని కోల్పోయే ప్రమాదం ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకోలేరు. ఏ చిన్న విషయానికైనా ఫోన్ వైపే చూస్తుంటారు. అయితే గూగుల్ మీరు మీ నాలెడ్జ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకుంటే చాలా మంచిది.



>>>>>>>>>>>>>>>>>> *********** <<<<<<<<<<<<<<<<<<<<


ఫ్రీడమ్ 251: తయారీ వెనుక అసలు రహస్యం ఇదే


ఫ్రీడమ్ 251: తయారీ వెనుక అసలు రహస్యం ఇదే.......

Ringing Bells now accepting cash on delivery for Freedom 251

న్యూఢిల్లీ: ప్రపంచ మొబైల్ రంగాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతూ కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించిన రింగింగ్‌బెల్స్‌ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తన మనసులోని మాటను వివరించారు. తమ కంపెనీ ఎటువంటి దురుద్దేశాలతోనూ ఈ పని చేయలేదని, భారత్‌లో సాధారణ ఫోన్‌ను వాడుతున్న 1.4 కోట్ల మందిని స్మార్ట్‌ఫోన్‌కు దగ్గర చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు ఆన్‌లైన్ మార్కెట్‌ను కల్పించి, దీని ద్వారా ధరను 35 శాతం వరకూ తగ్గించవచ్చని వెల్లడించిన ఆయన, 12 మంది పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నామని, ఏ సమయంలోనైనా రూ. 500 కోట్ల వరకూ సమీకరించి భారీ ఎత్తున మొబైల్స్ తయారీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో రెండు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ప్రారంభించి, జూన్ లోగా 25 లక్షల ఫోన్లను డెలివరీ ఇచ్చి చూపాలన్నదే తమ ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. 8 నెలల క్రితం సంస్థను ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని ఊహించలేదని అన్నారు.ప్రభుత్వం తమ ప్రయత్నాలను ఎన్నడూ అడ్డుకోలేదని, వారు అడిగిన సమాచారాన్ని అంతా ఇచ్చామని, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పామని అన్నారు. సంస్థ ఎండీ మోహిత్ గోయల్‌తో కలసి వెళ్లి ఇప్పటికే కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తమ ఆలోచనలను, వ్యాపార విధానాన్ని పంచుకున్నామని అన్నారు. ఇందుకు ఆయన కూడా సంతోషంగా అంగీకరించారని రింగింగ్‌బెల్స్‌ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వివరించారు. నిజానికి రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో సంస్థ అందించే ఈ స్మార్ట్ ఫోన్‌లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ మొబైల్ ఫోన్ షిప్పింగ్‌కు కూడా నాలుగు నెలల సమయం తీసుకుంటున్నారు. అయితే ఫోన్ బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, స్మార్ట్ ఫోన్ విడుదల కార్యక్రమంలో ఫ్రీడమ్ 251కు ఏడాది పాటు వారంటీ ఉంటుందని అన్నారు.



Tuesday, 23 February 2016

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టులు:
టెక్నికల్ ఆఫీసర్-ఎ(టెక్నికల్): 4
టెక్నికల్ అసిస్టెంట్ (టెక్నికల్): 4
దరఖాస్తు:
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ కు చివరితేది: మార్చి 15
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్www.ninindia.org

ఇంజనీర్స్ ఇండియా

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ‘ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు..:
టేడ్ అప్రెంటీస్ విభాగాలు: సివిల్-16, మెకానికల్-14.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

టెక్నీషియన్ అప్రెంటీస్ విభాగాలు: సివిల్-15, మెకానికల్-7, ఎలక్ట్రికల్-3, కెమికల్-3, ఆర్కిటెక్చర్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-5, సేఫ్టీ-10.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత లేదా అనుబంధ విభాగంలో డిప్లొమా ఉండాలి. 2013/ 2014/ 2015 సంవత్సరంలో ఉత్తీర్ణులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 14
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.engineersindia.com  

Monday, 22 February 2016

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్‌‌డ.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ‘స్టయిపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్)’ ఖాళీల భర్తీకి మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
TELUGU JOBSమొత్తం పోస్టులు: 332అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రానిక్/ మెకానిక్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్/ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్/ మెకానిక్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రీషియన్ విభాగంలో ఐటీఐ లేదా ఒకేషనల్ ఇంటర్‌లో ఈఈటీ/ ఈటీ ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 25 - మార్చి 15.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.tslprb.in

కాఫీ బోర్డ్

కాఫీ బోర్డ్

ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డెరైక్టర్ (ఎక్స్‌టెన్షన్) కాఫీ బోర్డ్, విశాఖపట్నం.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TELUGU JOBSపోస్టులు:
ఎస్‌ఎల్‌వో (మినుములూరు): 6
జేఎల్‌వో(చింతపల్లి ఈస్ట్, వెస్ట్; అరకు వ్యాలీ): 9
అర్హత: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ బయలాజికల్ సెన్సైస్ విభాగంలో బీఎస్సీ చదివి ఉండాలి.
వయసు: ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: మార్చి 18
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్www.indiacoffee.org

PAVAN: మీ రాశి ప్రకారం మీ యొక్క అదృష్టం

PAVAN: మీ రాశి ప్రకారం మీ యొక్క అదృష్టం: ** మీ రాశి ప్రకారం మీ యొక్క అదృష్టం ** మనందరికీ ఖచ్చితంగా లక్కీ చార్మ్ ఉంటుంది. అంటే.. మనం నమ్మే అదృష్టం ఉంటుంది. కొంతమంది దేవుడి ఫోటో...

Saturday, 20 February 2016

Marriage special**

ఒక్క క్లిక్‌లో ఏడడుగులు!


ఒక్క క్లిక్‌లో ఏడడుగులు!
♦ పెళ్లి కార్డుల నుంచి ఫొటోగ్రాఫర్ల వరకు ఆన్‌లైన్లో
♦ 14 నగరాల్లో సేవలందిస్తున్న ‘7 వచన్’


హైదరాబాద్: ఆన్‌లైన్లో వస్తువులు కొనటం తెలుసు. కానీ పెళ్లి మొత్తం ఆన్‌లైన్లోనే అంటే!!? అంటే పెళ్లికి అవసరమైన దుస్తులు, కల్యాణ మండపం, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, హోటల్ వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేస్తే? దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకుంది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న 7 వచన్.కామ్. మరిన్ని వివరాలు సంస్థ సీటీఓ తారక్ రాము మాటల్లోనే..

 ♦ పెళ్లికి ఇంటిల్లిపాదీ పనిచేసినా ఏదో ఒకటి మరిచిపోతుంటాం. అలాంటివి ఉండకూడదనే ‘7 వచన్.కామ్’ను ఆరంభించాం. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మిన్నత్ లాల్‌పూరియా 2012లో రూ.30 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 7 వచన్.కామ్‌ను ఆరంభించారు.

♦ మా దగ్గర పెళ్లి పత్రికల నుంచి మొదలుపెడితే మేకప్ ఆర్టిస్టులు, మేళతాళాలు, హోటల్స్, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్, డెకరేషన్ వంటి 14 రకాల సేవలను పొందొచ్చు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని 14 నగరాల్లో సేవలందిస్తున్నాం. మా ప్రత్యేకత ఏంటంటే.. మా సైట్ నుంచి బుక్ చేయగానే సంబంధిత సేవలందించే వారి వివరాలు, ధరలు అప్పటికప్పుడే కనిపిస్తాయి. దీంతో మనకు నచ్చిన వారిని ఎంచుకునే వీలుంటుంది.

♦ మా వెబ్‌సైట్‌లో కావాల్సిన ఆర్డర్‌ను ఎంచుకున్నాక 25 శాతం సొమ్ము చెల్లించాలి. ఆ తర్వాత నెల రోజుల ముందు మరో 25 శాతం, కార్యక్రమం రోజు, పూర్తయ్యాక మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోటి రూపాయలు ఆపైన బడ్జెట్ పెళ్లిళ్లకు మాత్రమే సేవలందిస్తున్నాం. ఇకపై మధ్య, సామాన్య తరగతి పెళ్లిళ్లకూ సేవలందించాలని నిర్ణయించాం. అందుకే దేశంలోని అన్ని నగరాల్లోని కల్యాణ మండపాలతో ఒప్పందం చేసుకుంటున్నాం.

♦ ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా టర్నోవర్ నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.3.5 కోట్లు నిధులను సమీకరించాం.

♦ ముంబై, ఖతర్, బెంగళూరుకు చెందిన పలువురు పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారు. మూడో రౌండ్‌లో భాగంగా ఈ ఏప్రిల్‌లో రూ.18 కోట్ల నిధులను సమీకరిస్తున్నాం. వీసీలతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం మా వద్ద 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
 

నిమ్మరసం - ఉప్పుతో వడదెబ్బ మటుమాయం**

నిమ్మరసం - ఉప్పుతో వడదెబ్బ మటుమాయం**

  • వడదెబ్బకు గురైన వారు నిమ్మ రసంలో ఉప్పు కలుపుకుని తాగితే త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే, ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. 
  • నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  • వేడివల్ల కలిగే జలుబుకు, నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది. ఆరోగ్యరీత్యా లెమన్ టీ ఎంతో మంచిది. భోజనానికి ముందు, తర్వాత నిమ్మచక్కతో చేతులు శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
  • ప్రయాణాలలో వాంతులతో బాధపడేవారు నిమ్మకాయ వాసన చూడడం, నిమ్మ చెక్కను చప్పరించినా చక్కని ఉపశమనం. శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు

బిర్లామందిర్‌

బిర్లామందిర్‌ 


హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్న ప్రముఖకట్టడాల్లో బిర్లామందిర్‌ ఒకటి. పాలరాతి నగిషీలతో సుందరమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న బిర్లామందిర్‌ నిర్మించి నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. చారిత్రక నగరం హైదరాబాద్‌ సిగలో తురిమిన అందమైన ఆధ్యాత్మిక కళాఖండం.. బిర్లామందిర్‌. పురాణాలు, ఐతిహాసాలు, వైదిక రుషులు, భక్తి ఉద్యమ గురువుల ప్రబోధాలను ఒకేచోట ఆవిష్కరించిన విలక్షణ ఆలయమిది. బిర్లాగ్రూప్‌ సంస్థల ప్రముఖుడు బ్రిజ్‌మోహన్‌ బిర్లా జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు గంగాప్రసాద్‌ బిర్లా 1976లో ఈ ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఆధ్యాత్మికవేత్త, వేదపండితుడైన పెదజీయర్‌స్వామి నేతృత్వంలో ఆనాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి అంకురార్పణ చేశారు. 7 ఏళ్లలో ప్రధాన ఆలయం నిర్మాణం పూర్తైంది. దక్షిణాది వైష్ణవ సంప్రదాయమైన శ్రీరంగం పద్ధతిలో 40 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి నగరంలోని ప్రధాన కట్టడాల్లో ఒకటిగా నిలిచి, సందర్శకులు ప్రశంసలందుకుంటోంది. ఆలయం నిర్మించి 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాన ఆలయం ప్రాంగణంలో స్వామివారి విగ్రహానికి తిరుమాడ వూరేగింపు నిర్వహించారు.హైందవ సంస్కృతి, స్వతహాగా భన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వాటి ప్రతిరూపాలైన దశావతారాలు, మహాభారతం, రామాయణం, భాగవత గాథలతోపాటు, భక్తి ఉద్యమాలు నడిపించిన ఆధ్మాత్మిక గురువుల సుందరశిల్పాలు బిర్లామందిర్‌ గోడలపై కనిపిస్తాయి. వైదిక రుషులు, శైవ, వైష్ణవ మతాల పుణ్య పురుషులైన ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యుల శిల్పాలతోపాటు భౌద్దం, జైనం, క్రైస్తవం, ఇస్లాం, సిక్కు మతాల జీవన సారాంశాలు ఈ ఆలయ గోడలపై పొందుపర్చారు. దశాబ్దాలుగా ఈ జీవితసత్యాలు భక్తులు, సందర్శకులకు నైతిక విలువలను ప్రభోదిస్తున్నాయి. భిన్నమతాల ప్రజలతో పాటు భక్తులు, యాత్రికులు ప్రతిరోజూ వేల సంఖ్యలో బిర్లామందిర్‌ను సందర్శిస్తుంటారు. హైదరాబాద్‌కు వచ్చే వివిధ రాష్ట్రాల, దేశాల యాత్రికులు తప్పకుండా సందర్శించే యాత్రాస్థలాల్లో బిర్లామందిర్‌ ప్రముఖ స్థానంలో నిలిచింది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు, ఉగాది, ఏకాదశి వంటి పండుగలు, సెలవు దినాల్లో రోజుకు 50వేల నుంచి లక్షమంది వరకు బిర్లామందిర్‌కు వస్తుంటారు. నగరం నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ ఆలయం గర్భగుడి నుంచి మెట్ల వరకు పూర్తిగా పాలరాతితో నిర్మించడంతో విద్యుత్‌ దీపాల వెలుగుల మధ్య సందర్శకుల మనసు దోచుకుంటోంది.
బిర్లామందిర్‌ నిర్వహణ బాధ్యతలు హిందూస్థాన్‌ ఛారిటీ ట్రస్టు నిర్వహిస్తుండడం విశేషం. ఇక్కడ ఆలయ ప్రవేశం మోదలుకొని, పూజలు, అర్చనల వరకు అన్నీ ఉచితంగానే జరుపుతారు. బిర్లామందిర్‌ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతాన్ని నీలాద్రీహిల్స్‌గా పిలిచేవారు. అప్పుడు ఇక్కడ ఓ చిన్న ఆంజనేయస్వామి గుడి ఉండేది. అనంతర కాలంలో బిర్లామందిర్‌ ప్రాంగణంలో మరో ఆంజనేయస్వామి ఆలయం, దుర్గామాత, వినాయకుడు, శిరిడీ సాయిబాబా, శివాలయంతో పాటు యజ్ఞశాలనూ నిర్మించారు. ప్రధాన ఆలయంలో వేంకటేశ్వస్వామి, పద్మావతి, ఆండాళమ్మ, గరుత్మంతుడి విగ్రహాలున్నాయి.దేశంలో జైపూర్‌, భోపాల్‌, కోల్‌కత్తా, దిల్లీలో కూడా బిర్లామందిర్‌దేవాలయాలను బిర్లా గ్రూప్‌ నిర్మించింది. వాటన్నింట్లోనూ హైదరాబాద్‌ మందిరం ప్రత్యేక స్థానం సంపాదించడం చెప్పుకోదగ్గ విశేషం. అద్భుత చిత్రాలు, శిల్పకళా సౌందర్యంతో పాటు ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా నిర్వహించే నిత్యాగ్నిహోమం అలాగే సాయంత్రం వేళ ఆళ్వార్‌ దివ్యప్రబంధం ఈ ఆలయానికి ఆధ్యాత్మిక శోభను సంతరించి పెడుతున్నాయి.

చిన్నారులు, టీనేజర్లు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తెగ వాడేస్తున్నారా?

చిన్నారులు, టీనేజర్లు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తెగ వాడేస్తున్నారా?

చిన్నారులు సెల్‌ఫోన్లు వాడుతున్నారా? అయితే వెన్నెముక సమస్యలు తప్పవని తాజా అధ్యయనంలో తేలింది. సెల్ ఫోన్లను గంటల తరబడి వాడే చిన్నారులు, టీనేజర్లలో వెన్నెముక సమస్యలు ఏర్పడుతున్నాయని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తెలిపింది.

ఈ ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 79 శాతం మంది సెల్ ఫోన్ల వాడకంలో అత్యధిక సమయం గడుపుతువన్నారని తేలింది. ఇంకా చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని గంటల తరబడి వంగి ఉండటంతో ఎముకల్లో సమస్యలు ఏర్పడుతున్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు జీవితకాలం వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. 
 
ఇంకా ఈ సర్వేలో తేలిందేమిటంటే.. సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్లపై గడుపుతున్న వారిలో మెడ, భుజాల నొప్పి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీన్ని నివారించాలంటే.. చాలామటుకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని లీలావతి ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు.
 
అలాగే సెల్ ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారిలోనూ ఇలాంటి సమస్యలు తప్పట్లేదని వైద్యులు చెప్పారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు ఇతరత్రా కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం వెచ్చించే వారికి కూడా వెన్నుపూసలో సమస్యలు, మెడనొప్పి, వెన్నునొప్పి, భుజాల్లో నొప్పులు, కీళ్ళనొప్పులు ఏర్పడుతున్నాయని సర్జన్ ఎస్ వెంగ్‌సర్కార్ వెల్లడించారు.

Friday, 19 February 2016

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ:

మాఘ శుద్ధ పౌర్ణమి రోజు జరుగు గంగాపూర్ జాతర శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న భక్తులకు కోర్కేకలు తీర్చే కొంగు బంగారం . ప్రతి సంవత్సరాము 3 రోజులు జాతర వైభవంగా జరుగుతుంది . 
రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామపంచాయితి లో ని గంగాపూర్ గ్రామా శివారులోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో నేటి నుంచి జాతర ప్రారంభంకానుంది. పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య జరిగే జాతరకు ఆదిలాబాద్ జిల్లా ల నుంచే కాకుండా వేర్వేరు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.

బాలజీ ఆలయ క్షేత్రం చరిత్ర :


రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రమపోలిమేరలో ఉన్న గుట్టపై శ్రిబలజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వందల్ ఏళ్ల క్రితం 16వ శబ్ధతానికి ముందు గంగాపూర్ కు చెందిన విస్వబ్రహ్మణ కులానికి చెందిన పొతజీ నిర్మిచినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది పొతజీ చిన్నతనం నుంచి స్రిబాలజీ వెంకటేశ్వరస్వామి భక్తితో కొలుస్తూ ప్రతి ఏట మాఘశుద్ధ పొర్ణమి రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి మొక్కులు స్మర్పిస్తుమ్దేవాడు ఆ తర్వాత వయోభారంతో అతని ఆరోగ్యం క్షినిచడం ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తిరుపతికి వెళ్ళలేక తీవ్ర మ్న్వేదనకు గురయ్వోవాడు, ఓ రాత్రి వెంకటేశ్వర స్వామి పొతాజీ కలలో కనిపించి నీలాంటి భక్తుల కోసం గంగాపూర్ పోలిమేర లోని గుట్టబాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ద పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పాడు. గంగాపూర్ ను ఆను కొని ఊన్న గాగు సమీపమ్లొ గుట్టాను లోలువగా శ్రిబాలజి వెంకటేశ్వర స్వామి వారి పంచనామాలు ఆయనకు దర్శనమిచ్చాయి దీనీతో ఆయన అక్కడ ఆలయానీ నిర్మించాడు మొదటి గుహలో గోవింద రాజు విగ్రహం స్వామి వేడమ వైపూనా శివాలయం దాని పక్కన శ్రీ హనుమాన్ విగ్రహం గరుడ విగ్రహాలు న్నాయి పోతాజి సమాది ఆలయ ముందు భాగంలో ఉంది పోతాజి మరణానంతరం గ్రామస్తులే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జాతరలో భాగంగా కల్యాణోత్సవం. 22 వ రధోత్సవం కన్నుల పండవగా జరిపేందుకు ఆలయ కమిటి ఏర్పాటు పూర్తీ చేసింది 23వ ప్రత్యక పూజలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు భక్తుల కోసం అన్ని యుర్పాట్లు పూర్తీ చేసినట్లు ఆలాయ ఆధికారులు తెలిపరు.

Thursday, 18 February 2016

TTD

**తిరుమల గురించి 11 నిజాలు**

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

 At the entrance of the main door, to the right side, a stick which was used by Ananthaalvar to hit Venkateshwara Swamy is present. When this stick was used to hit the ‘small boy’ Venkateshwara, his chin bled was wounded. Since then, the practice and tradition of applying Sandalwood paste on Swamy’s chin began. 

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
There is real hair on the main idol of Venkateshwara Swamy. They say that this hair never tangles and is silky smooth always.

3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

There is a village, approximately 23 Kms from the temple in Tirumala. The entry to this village is only for the villagers. The people are said to be living with strict practices and tradition.. The women don’t even wear blouses. It is from this village, that all the flowers, milk, ghee, butter are sourced for the God.. 

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
Venkateshwara Swamy appears to be standing in the middle of the garba gudi. Actually, Swamy stands at the right side corner of the garba gudi. This can be noticed from standing outside. 

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
Every day, the dhoti (bottom) and saree (top) are used to decorate Swamy. Couples who buy a ticket of a Special Seva costing approximately Rs.50,000 (for couples) are given the dhoti and saree. These tickets are sold in very very less numbers. 

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
All the flowers used in the garba gudi are in no condition brought out. There is a waterfall behind Swamy’s behind. All flowers are thrown in this water fall.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
No matter how many times, the back of Swamy is dried, it remains wet always. If you carefully keep your ear and listen against Swamy’s back, sound of an ocean is heard
. 8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
Lakshmi Devi is on the heart of Swamy. On Thursdays, during Nija Roopa Darshanam, Swamy is decorated with white v wood paste. When this decoration is taken out, the imprint on Lakshmi Devi remains. This imprint is sold by the temple authorities. 

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
When some one dies, how one does not see behind and lights the fire, similarly, the flowers removed from Swamy are thrown at the back of Swamy. It is said that the pujaris do not look at the back of the Swamy that entire day. All these flowers can be seen coming out at a place called Verpedu, 20 kms from Tirupati (on way to Kalahasti). 

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సం
వత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
The lights (deepa) lighted in front of the Swamy is said to be lit since thousands of years. And no one exactly knows since when these lights are lit. 
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.
Vimana-Venkateswara-Swami

Tuesday, 9 February 2016

సీఆర్‌పీఎఫ్-కానిస్టేబుల్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సదరన్ సెక్టార్ ‘కానిస్టేబుల్ (టెక్నికల్/ ట్రేడ్‌మెన్)’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం ఖాళీలు: 89విభాగాలు: పురుషులకు.. డ్రైవర్, ఫిట్టర్, బగ్లర్, టైలర్, కాబ్లర్, గార్డెనర్, బ్రాస్ బ్యాండ్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, సఫాయి కర్మచారి, బార్బర్.
మహిళలకు.. గార్డెనర్, వాషర్ ఉమెన్, సఫాయి కర్మచారి.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నైపుణ్యం, అనుభవం ఉండాలి.
వయసు: డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర ఉద్యోగాలకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:మార్చి 10
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

వెబ్‌సైట్: crpfindia.com

టీఎస్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

టీఎస్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ విభాగాల్లో 510 ‘ఎస్సై’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsఅర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 10-మార్చి 3
ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ తేది: ఏప్రిల్ 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

వెబ్‌సైట్:  www.tslprb.in

టీఎస్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

టీఎస్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

**HAPPY CHOCOLATE DAY**

The third day of Valentine week is here – Chocolate Day. On this day majority of people exchange chocolates as this is one such sweet addiction which leaves an individual with indelible and long lasting sweet memory. Chocolates are considered for each and every occasion, whether you are happy, sad, angry or frustrated, chocolates will always help to lighten your mood. Someone rightly said that chocolates are girl’s best friend and there is nothing like it. Chocolates will quickly make you fall in love easily and also enhance charm.
There’s nothing like chocolate as it stimulates all your senses and will surely convey your inner feelings in front of your soulmate. Chocolates symbolizes never ending love, affection and sweetest bond which last forever. Here we have shared Chocolate messages which you can send across to your partner and don’t worry let chocolates create magical atmosphere on your love.
Welcome To The Fascinating World Of Chocolate. The Perfect Bar Of Dark Chocolate Turns The Simple Act Of Eating It Into A Form Of Art. When It Comes To Temptation, Nothing Packs A Punch Like Chocolate. For Centuries, Chocolate Has Been Loved By The People Of The World. Happy Chocolate Day
According to the valentine week myth, February 9 is called the Chocolate Day. If you believe in the week-long Valentine’s celebration, Feb 9 is the day to gift a box full of chocolates to your sweetheart
Today is chocolate day
 Dairymilk 4 love
Kitkat 4 special
Bounty 4 cool
Mars 4 best friend
Sonat 4 cute
Galaxy 4 stylish
What will you give me?
If u r a chocolate u r the sweetest, if u r a Teddy Bear u r the most hug gable, If u are a Star u r the Brightest, and since u r my FRIEND u r the BEST!!!!!!!!!’
If you believe in valentine day, You must believe in valentine week, If you believe in life, You must believe in heart beats, If you believe in love, You must believe in you and me. Happy chocolate day…….
Our friendship is like a chocolate box, Which never makes us sweet less, It always gives us flavor of sweetness, It is so crunchy, so nutty and delicious, We are so lucky in this world, Got blessed with a box of chocolate (true friendship). Happy chocolate day………

Gifting a box of chocolates to friends is best way to say everything without saying anything orally, Just like a true love, it speaks everything without conversation. Happy chocolate day…….
I am wishing you a very happy chocolate day my sweet heart, as chocolates are necessary for healthy body, And true and devoted love is necessary of happy life…….