Thursday, 8 October 2015

పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం


పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం


పుకార్లు పోస్టు చేస్తే తలలు నరికేస్తాం..ఏందీ నమ్మలేకున్నారా..ఇది నిజం.. ఇక ఫేస్‌బుక్ లో కాని ట్విట్టర్ లో కాని ఏవైనా వదంతులు పుకార్లు లాంటివి పోస్ట్ చేస్తే తలలు నరికేస్తారట..లేకుంటే ఏకంగా ఉరిశిక్షనే విధిస్తారట..అయితే ఇది మన ఇండియాలో కాదు..చట్టాలను కఠినంగా అమలుచేస్తున్న ఎడారి దేశం సౌదీ అరేబియాలో..ఈ మధ్యనే అక్కడి యువరాజు ఈ ప్రకటన చేశారు.

ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో.. ఇటీవల హాజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యి మంది వరకు చనిపోవడం దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందనే సర్వత్రా విమర్శలు 
వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష మొదటిసారి ఇప్పటి వరకు చిన్నపాటి తప్పులు చేసిన వారికి ఖైదు,ప్రయాణ నిషేధం,గృహ నిర్భంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయవాది అంటున్నారు.



No comments:

Post a Comment