Tuesday, 6 October 2015

రాత్రిపూట భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మెరిసిపోతాయట! ఇదిగోండి ఫోటో!

రాత్రిపూట భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మెరిసిపోతాయట! ఇదిగోండి ఫోటో!

రాత్రిపూట భారత్-పాకిస్థాన్ సరిహద్దులు మెరిసిపోతాయా? ఇదేంటని అనుకుంటున్నారు కదూ..? నిజమేనండి. చీకటి పడిన తర్వాత దేశాల సరిహద్దులు అంతరిక్షం నుంచి కనిపిస్తాయా అనే సందేహం కలగవచ్చు. మిగతా దేశాల సంగతేంటోగానీ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం రాత్రిపూట విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నానా తెలిపింది. 
 
నిత్యమూ చొరబాట్లు, కాల్పుల మోతలతో వినబడే ఈ ప్రాంతంలో రెండు దేశాలూ భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకోవడంతో, అంతరిక్షం నుంచి చూసినా సరే సరిహద్దులు మెరుస్తూ కనిపిస్తాయని నాసా వెల్లడించింది. తాజాగా నాసా, భారత్, పాక్ సరిహద్దులతో పాటు కరాచీ, ఇండస్ నదీ ప్రాంతం, హిమాలయాలను చూపుతూ తీసిన ఓ చిత్రాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచింది. ఈ ఫోటోకు లైక్స్ వెల్లువల్లా వస్తున్నాయి

No comments:

Post a Comment