పుట్టగొడుగుల నుంచి స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు రానున్నాయా?
స్మార్ట్ ఫోన్ బ్యాటరీలను పుట్టగొడుగుల నుంచి తయారు చేయనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్సెస్‌లను బోధించే ప్రొఫెసర్ సెంగిజ్ ఓజ్కాన్ అంటున్నారు. ఈయన నేతృత్వంలో ఓ పరిశోధకుల బృందం ఇదే అంశంపై పరిశోధనలు జరిపి సత్పలితాన్ని సాధించింది.
పోర్టబెల్లా జాతికి చెందిన పుట్టగొడుగుల్ని ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో లిథియం - అయాన్ బ్యాటరీని తయారు చేసింది. ఇది పర్యావరణ హితమైనదని, తక్కువ ధరకే తయారవుతుందని చెపుతున్నారు. ప్రస్తుతం మనకు మార్కెట్లో లభించే లిథియం-అయాన్ బ్యాటరీల్లో గ్రాఫైట్ యానోడ్‌లు ఉంటాయి. ప్రస్తుతం మనం వాడే ఈ రీచార్జబుల్ బ్యాటరీలు ఖరీదైనవే కాకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయి.
ఈ గ్రాఫైట్ యానోడ్‌ల స్థానంలో పుట్టగొడుగుల నుంచి వచ్చే బయో మాస్‌ని ఉపయోగించడం ద్వారా ఈ పరిశోధకుల బృందం చవకగా బ్యాటరీల్ని తయారుచేసింది. ఆ పుట్టగొడుగుల బయోమాస్‌లో కార్బన్ శాతం అధికంగా ఉండటం వల్ల అవి బ్యాటరీల్లో యానోడ్‌లుగా పనిచేస్తాయని తెలిపింది. ఈ పరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది.
No comments:
Post a Comment