థాయ్‌లాండ్‌లో వింత.. గేదె ఆకారం.. మొసలి శరీరంతో లేగదూడ... ఏమిటీవింత?
థాయ్‌లాండ్ దేశంలోని ఓ గ్రామంలో ఓ గేదెకు ఓ వింత ఆకారం పుట్టింది. ఇది చూసేందుకు గేదె ఆకారాన్ని పోలివున్నప్పటికీ.. శరీరం మాత్రం మొసలి శరీరంలా ఉంది. దీంతో దీన్ని చూసేందుకు స్థానికులు బారులుతీరారు. నిజానికి మనుషులకు వింతవింత ఆకారాల్లో పిల్లలు పుట్టడాన్ని సాధారణంగా చూస్తుంటాం. కానీ, గేదెకు మాత్రం ఈ తరహా ఆకారం పుట్టడం చాలా అరుదని స్థానికులు చెపుతున్నా.. ఇది చూసేందుకు భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటం గమనార్హం
గేదెకు పుట్టిన లేగదూడ చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్లు మాత్రం గేదెను తలపిస్తూ... శరీరం మాత్రం పొలుసుదేరి మొసలి ఆకారాన్ని తలిపించి వింతగా ఉంది. దీంతో ఈ ఆకారాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. కొంత మంది మాత్రం ఇది సంకర జాతికి చెంది ఉండవచ్చును అని అంటున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం ఈ వింత ఆకారపు జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. అయితే పుట్టిన కొద్ది సేపటికే ఈ వింత ఆకారం మరణించింది.
No comments:
Post a Comment