దోమలను తరిమికొట్టే ‘స్మార్ట్‌ఫోన్’ సాఫ్ట్‌వేర్
దోమల బెడత యావత్ దేశాన్నే వణికిస్తోంది. ప్రమాదకర దోమ కాట్ల బారిన పడి ఒక్కోసారి ప్రాణాలనే కోల్పొవల్సి వస్తోంది. సాధారణ జ్వరం నుంచి చంపేసే తీవ్రతతో కూడిన వైరల్ జ్వరాలను సృష్టిస్తోన్న దోమలను ప్రమాదకక జీవులుగా గుర్తించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతలో తలెత్తుతున్న జాప్యం కారణంగా చికాకు పుట్టించే వాతవరణం నుంచి పుట్టుకొస్తున్న రకరకాల విషపూరిత దోమలు మన ఇళ్లను చుట్టుముడుతున్నాయి.
అప్లికేషన్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ సాఫ్ట్ వేర్ పేరు ‘Anti Mosquito Sonic Repeller'. వివిధ ఫ్రీక్వెన్సీలలో ఈ యాప్ విడుదల చేసే ఆడ దోమ శబ్థాలు మగ దోమలను తరమి తరమి కొడతాయి. ప్రపంచవ్యాప్తంగా 3,500 పైగా దోమ జాతులు ఉన్న నేపథ్యంలో ఈ యాప్ నూటికి నూరు శాతం ఫలితాలను ఇవ్వటం కష్టమేనంటున్నారు డెవలపర్లు. ఈ యాప్ విడుదల చేసే శబ్థాలను మనుషులు ఏ మాత్రం గ్రహించలేరట.
No comments:
Post a Comment