Thursday 1 October 2015

**గాంధీ జయంతి**

అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)
15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.[1]


వేడుకలు
భారత దేశంలో నాయకులు, విద్యార్ధులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త ఢిల్లీ)లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.[2] గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన రఘుపతి రాఘవ రాజారామ్ గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మాంసాహారం ముట్టుకోరు.





jai bolo mahathama gandhi ji**

No comments:

Post a Comment