Monday, 5 October 2015

దినఫలం

దినఫలం
 

 మేషం
రాజకీయాలలోని వారికి మెళకు అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల తొందపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వాక్‌చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది.

 వృషభం
స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వృత్తి, ఉద్యోగస్తులకు కలిసిరాగలదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు.
 మిథునం
ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు ఆర్థికంగా బాగుంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 కర్కాటకం
రాజకీయాల్లో వారికి విరోధులు వేసే ఎత్తులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 సింహం
ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటుకు బదిలీ వంటి శుభపరిణామాలు ఉంటాయి. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. మీడియా రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు.
 కన్య
ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విజ్ఞతతో వ్యవహరించి రుణ దాతలను సమాధానపరుస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ చాలా అవసరం.
 తుల
టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. విదేశాల్లోని అయిన వారి క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆపరేషన్లు చేయునపుడు వైద్యుల ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 వృశ్చికం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలన మార్పిడికే చేయుయత్నంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పదు.
 ధనస్సు
ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విందులలో పరిమితి పాటించడం చాలా అవసరం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 మకరం
స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. బంగారు, వెండి, లోహ రంగాల్లో వారికి మందకొడిగా ఉండగలదు.
 కుంభం
మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 మీనం
స్త్రీలు, షాపింగ్‌ల కోసం ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. రాజకీయ నేతలతో సంభాషించేటపుడు ఓర్పు, సంయమనం పాటించండి. విద్యార్థుల ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు.

No comments:

Post a Comment