Monday, 5 October 2015

తల్లిదండ్రులను కాల్చిచంపి శవాలను ముక్కముక్కలుగా కోసి కుక్కలకు వేశారు.. ఎక్కడ?

తల్లిదండ్రులను కాల్చిచంపి శవాలను ముక్కముక్కలుగా కోసి కుక్కలకు వేశారు.. ఎక్కడ?


argentine
వారిద్దరు పెంపుడు అన్నాచెల్లెళ్లు. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా పెరుగుతూ వచ్చారు. కాలక్రమంలో వారి మధ్య సోదర భావం పోయి.. ప్రేమభావం వెల్లివిరిసింది. ఫలితంగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. దండించారు కూడా. దీంతో తల్లిదండ్రులపై పగ పెంచుకున్నారా ప్రేమజంట. ఇంకేముందు.. తల్లిదండ్రులు అని కూడా చూడకుందా కాల్చి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాలను ముక్కముక్కలుగా చేసి వీధిలో కుక్కలకు పారేశారు. అత్యంత పాశవికమైన ఈ సంఘటన అర్జెంటీనాలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే అర్జెంటీనా, బ్యూనోస్‌ఏర్స్‌ ప్రాంతంలో అకోస్టా, క్లెన్ అనే దంపతులకు తొలుత పిల్లలు లేక పోవడంతో కరెన్‌ క్లెన్‌, లియాండ్రో అకోస్టా అనే కుమారుడు, కుమార్తె ఉంది. వీరిద్దరు పెంపుడు పిల్లలు. అయితే, వీరిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. అదేసమయంలో ఈ దంపతులకు ఆలస్యంగా ఇద్దరు పిల్లలు కవలల రూపంలో జన్మించారు. అయితే, ఈ ఇద్దరు కవల పిల్లలను తల్లిదండ్రులు సరిగా చూడటం లేదనే భావన లియాండ్రో, అకోస్టాల్లో ఏర్పడింది. పైగా తమ ప్రేమను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఈ కోపంతో తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో వారిని కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ముక్కలుగా కోసి, కుక్కలకు ఆహారంగా వేశారు. మిగిలిన శరీరావయవాలను కాల్చేశారు. తాము చేసిన పనికి ఏ మాత్రం బాధపడటంలేదని, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామని చెబుతున్నాడు అకోస్టా.

No comments:

Post a Comment