రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన గ్రూప్-డి పరీక్షల ప్రాథమిక 'కీ'
జనవరి 11న విడుదల చేయనున్నారు. ఒకవేళ ప్రాథమిక 'కీ'పై ఏమైనా సందేహాలుంటే
జనవరి 17 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు రైల్వేశాఖ
అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ అభ్యంతరాలను తెలపాల్సి
ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం.. ఫైనల్ 'కీ' విడుదల చేసి.. ఫిబ్రవరిలో
ఫలితాలను వెలువరించనున్నారు. అయితే ఆన్సర్ కీ, ఫలితాల విడుదలకు సంబంధంచి
ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలోని మొత్తం 62,907 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబరు 17 వరకు మొదటి దశ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించారు. 50 రోజులపాటు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఇందులో మ్యాథ్స్-25 ప్రశ్నలు, సైన్స్-25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు మార్కు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33) చొప్పున మార్కులు కోత విధిస్తారు.
గ్రూప్-డి పరీక్షలకు సంబంధించిన 'కీ'ని ఆయా రైల్వేజోన్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పుట్టిన తేది ఆధారంగా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. పరీక్ష జరిగిన తేది, షిఫ్ట్‌ల వారీగా 'కీ' అందుబాటులో ఉండనుంది. ఇంగ్లిష్‌లో మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. తమకు సందేహం ఉన్న ఎన్ని అభ్యంతరాలనైనా అభ్యర్థులు తెలిపే వీలుంది. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీజు వసూలు చేయరు.
అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం పరీక్షలకు సంబంధించి తుది 'కీ' (ఫైనల్ కీ) విడుదల చేయనున్నారు. దీని ప్రకారం గ్రూప్-డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు అర్హత సాధిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులందరూ పీఈటీ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment