Thursday, 10 January 2019

RBI JE Notification: ఆర్‌బీఐలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.450 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు. ఫీజు చెల్లించడానికి జనవరి 27 చివరితేదీగా నిర్ణయించారు. 

పోస్టుల వివరాలు.. 

✪ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 23 పోస్టులు 

అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) లేదా 55 శాతం మార్కులతో డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్).

అనుభవం: సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి రెండేళ్లు, డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏడాది అనుభవం ఉండాలి. 

వయసు: 01.01.2019 నాటికి 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1989 - 01.01.1999 జన్మించి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ద్వారా. 

పే స్కేలు: ఎంపికైన అభ్యర్థులకు ఆరంభంలో రూ.21,400 బేసిక్ పే ఇస్తారు. ఇతర భత్యాలు అన్నీ కలుపుకుని నెలకు రూ.49,026 వరకు అందుతాయి. 

పరీక్ష స్వరూపం..
✦ ఆన్‌లైన్ పరీక్ష: 
 మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఇంజినీరింగ్ డిసిప్లిన్ (పేపర్-1) 40 ప్రశ్నలు - 100 మార్కులు, ఇంజినీరింగ్ డిసిప్లిన్ (పేపర్-2) 40 ప్రశ్నలు - 100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. 
 పరీక్ష సమయం 150 నిమిషాలు. 
 ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. 
 అభ్యర్థులు ఒక్కో సెక్షన్‌లో అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

 లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ):
 ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఎల్‌పీటీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అధికార/ స్థానిక భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. సరైన భాషా ప్రావీణ్యం లేనివారిని అనర్హులుగా పరిగణిస్తారు. 

ముఖ్యమైన తేదీలు.. 
✷ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2019. 
✷ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2019. 
✷ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2019. 
✷ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 15.02.2019. 
✷ పరీక్ష తేది: ఫిబ్రవరిలో. 

Notification 

Online Application 

RBI Website 

No comments:

Post a Comment