ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) టెక్నికల్మొత్తం పోస్టుల సంఖ్య: 191* ఎస్ఎస్‌సీ (టెక్): 189. ఇందులో పురుషులకు 175, మహిళలకు 14 ఉన్నాయి.విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఏరోనాటికల్/ బాలిస్టిక్స్/ ఏవియానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్/ టెలీకమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ శాటిలైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్/ ఆప్టో ఎలక్ట్రానిక్స్/ ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్ కనస్ట్రక్షన్ టెక్నాలజీ. అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.వయఃపరిమితి: 01.10.2019 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.* విడోస్ ఆఫ్ డిఫెన్స్ అభ్యర్థులకు మాత్రమే1) ఎస్ఎస్‌సీ (ఉమెన్) (నాన్‌టెక్) (నాన్ యూపీఎస్సీ): 01అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.2) ఎస్ఎస్‌సీ (ఉమెన్) టెక్: 01అర్హత: ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. వయఃపరిమితి: 07.10.2019 నాటికి 35 ఏళ్లు మించకూడదు.ఎంపిక: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దీనిలో స్టేజ్-1, స్టేజ్-2 ఉంటాయి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 21.02.2019.
|
No comments:
Post a Comment