వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానంలో బీఏ/ బీకాం ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశార్హత పరీక్ష ప్రకటన విడుదల చేసింది.వివరాలు..* దూర విద్య బీఏ/ బీకాం (జనరల్ అండ్ కంప్యూటర్స్) 2018-19అర్హత: ఏ విద్యార్హతలు లేకుండా 30.01.2019 నాటికి 18 సంవత్సరాలు నిండి ప్రవేశార్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ప్రవేశాలకు అర్హులు. 2015 నుంచి 2018 వరకు గతంలో నిర్వహించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు (లేదా) ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పాసైన అభ్యర్థులు ప్రవేశార్హత పరీక్ష రాయకుండా నేరుగా ప్రవేశం పొందవచ్చు. ప్రత్యేక ప్రవేశార్హత పరీక్ష తేది: 06.02.2019.దరఖాస్తు విధానం: దరఖాస్తులను నేరుగా అధ్యయన కేంద్రాల నుంచి పొందవచ్చు (లేదా) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుకు ఫీజు డీడీ, ఇతర ధ్రువపత్రాల నకళ్లను జత చేసి ఏ అధ్యయన కేంద్రంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ఆ కేంద్రంలో స్వయంగా అందించి ప్రవేశ పత్రాలు పొందవచ్చు. కేంద్ర కార్యాలయానికీ దరఖాస్తులు అందించవచ్చు.ఫీజు: రూ.200.దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 02.02.2019.
|
No comments:
Post a Comment