Monday, 28 January 2019

దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్‌లో 264 పోస్టులు (చివ‌రితేది: 01.03.19)

దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు.. జీఎన్‌సీటీ ఆఫ్ దిల్లీ, గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ దిల్లీలో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 264* పోస్టు-డిపార్ట్‌మెంట్1) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్)-ఎంసీడీ: 072) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-ఎంసీడీ: 133) జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్)-ఎంసీడీ: 1034) జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్)-ఎంసీడీ: 205) జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్)-ఎన్‌డీఎంసీ: 336) జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్)-డీయూఎస్ఐబీ: 617) జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్)-డీయూఎస్ఐబీ: 27అర్హ‌త‌: స‌ంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.ఎంపిక‌: ఎగ్జామినేష‌న్ (ఒన్ టైర్, టూ టైర్), స్కిల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ.100.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 30.01.2019.చివ‌రితేది: 01.03.2019.
 

Saturday, 26 January 2019

School Annual Exams 2019: తెలంగాణ వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల

telangana schools annual examination schedule 2019 released

తెలంగాణలోని పాఠశాలల వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూలు ప్రకారం వివిధ 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షికల పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నట్లు ఎన్‌సీఈఆర్టీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్షల సమయం పైమరీ, హై స్కూల్ విద్యార్ధులకు వేర్వేరుగా ఉన్నాయని ఎన్‌సీఈఆర్టీ తెలిపింది. 
పరీక్షల షెడ్యూల్ ఇలా.. 

తరగతిపరీక్ష తేదీసమయం
1 - 5వమార్చి 30 - ఏప్రిల్ 8ఉ.9.30 - మ. 12.00 గం.
6 , 7వమార్చి 30 - ఏప్రిల్ 8ఉ.10.00 గం - మ. 12.45 గం.
8, 9వమార్చి 30 - ఏప్రిల్ 8మ. 2.00 - సా.4.45 గం.
పదోతరగతి (ప్రీఫైనల్‌)ఫిబ్రవరి 15 నుంచి 27

TS CETs: తెలంగాణ 'సెట్స్‌' షెడ్యూల్‌లో మార్పులు

  • లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ తేదీల్లో మార్పు
  • కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
  • సెట్స్‌ వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టుల లింకులు

తెలంగాణలో వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్‌ కన్వీనర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మే నెలలో నిర్వహించే నాలుగు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల ఐదో తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే జేఈఈ మెయిన్ వంటి జాతీయ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు. లాసెట్ మే 26కు జరగాల్సి ఉండగా.. మే 20న జరుగుతుంది. మే 20 నుంచి ప్రారంభం కావాల్సిన పీఈసెట్, పీఈటీ పరీక్షలను మే 15నుంచి నిర్వహిస్తారు. మే 27 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు.. 28 నుంచి 31 వరకు జరుగుతాయి. ఎడ్‌సెట్ మే 30,31న జరగాల్సి ఉండగా.. మే 31కి మాత్రమే కుదించారు. 

సెట్పాత షెడ్యూల్సవరించిన షెడ్యూల్
లాసెట్, పీజీ లాసెట్‌మే 26మే 20
పీఈసెట్‌మే 20మే 15
పీజీఈసెట్‌మే 27, 28, 29మే 28, 29, 30, 31
ఎడ్‌సెట్‌మే 30, 31మే 31

అలాగే ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు కాబట్టి.. పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా టెక్నీషియన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా సెట్స్‌ వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టుల లింకులను అందుబాటులో ఉంచబోతున్నారు.

Friday, 25 January 2019

ఇండియ‌న్ ఆర్మీలో 191 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు (చివ‌రితేది: 21.02.19)

ఇండియ‌న్ ఆర్మీ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహితులైన పురుష, మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) టెక్నిక‌ల్మొత్తం పోస్టుల సంఖ్య‌: 191* ఎస్ఎస్‌సీ (టెక్‌): 189. ఇందులో పురుషుల‌కు 175, మ‌హిళ‌ల‌కు 14 ఉన్నాయి.విభాగాలు: సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఏరోనాటిక‌ల్/ బాలిస్టిక్స్/ ఏవియానిక్స్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూట‌ర్ టెక్నాల‌జీ/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఎంఎస్సీ కంప్యూట‌ర్ సైన్స్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలికామ్‌/ టెలీక‌మ్యూనికేష‌న్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్/ శాటిలైట్ క‌మ్యూనికేష‌న్, ఎల‌క్ట్రానిక్స్/ ఆప్టో ఎల‌క్ట్రానిక్స్/ ఫైబ‌ర్ ఆప్టిక్స్/ మైక్రో ఎల‌క్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చ‌ర్/ బిల్డింగ్ క‌న‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ. అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. చివ‌రి ఏడాది చ‌దువుతున్న‌వారూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. నిర్దేశిత‌ శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.వ‌యఃప‌రిమితి: 01.10.2019 నాటికి 20-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.* విడోస్ ఆఫ్ డిఫెన్స్ అభ్య‌ర్థులకు మాత్ర‌మే1) ఎస్ఎస్‌సీ (ఉమెన్) (నాన్‌టెక్) (నాన్ యూపీఎస్సీ): 01అర్హ‌త‌: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.2) ఎస్ఎస్‌సీ (ఉమెన్) టెక్: 01అర్హ‌త‌: ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. వ‌యఃప‌రిమితి: 07.10.2019 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా. దీనిలో స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఉంటాయి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 21.02.2019.
 

Thursday, 17 January 2019

సీఐఎస్ఎఫ్‌లో 429 హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రి తేది: 20.02.19)

భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌తాత్కాలిక ప్రాతిప‌దిక‌న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోందిపురుషుల‌తోపాటు మ‌హిళ‌లూ వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.వివ‌రాలు....హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియ‌ల్‌)ఖాళీలు429. వీటిలో సీఐఎస్ఎఫ్ డిపార్ట్‌మెంట‌ల్ అభ్య‌ర్థుల‌కు 64 పోస్టులు కేటాయించారు.అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 20.02.2019 నాటికి 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: హైట్ బార్ టెస్ట్‌ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌రాత‌ప‌రీక్ష‌స్కిల్ టెస్ట్‌మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం21.01.0219ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.02.2019
 

Sunday, 13 January 2019

యూపీఎస్సీ-కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో 358 పోస్టులు (చివ‌రితేది: 31.01.19)

దేశంలోని వివిధ కేంద్ర ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 3581) అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 16విభాగాలు: అన‌స్థీషియా, కార్డియాల‌జీ, సీటీవీఎస్‌, గ్యాస్ట్రో మెడిసిన్, గ్యాస్ట్రో స‌ర్జ‌రీ, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, సైకియాట్రి, ప‌ల్మ‌న‌రీ మెడిసిన్, స‌ర్జిక‌ల్ అంకాల‌జీ, రేడియోల‌జీ, యూరాల‌జీ.2) ఇంజినీర్ అండ్ షిప్ స‌ర్వేయ‌ర్-క‌మ్‌-డిప్యూటీ జ‌న‌ర‌ల్ (టెక్నిక‌ల్): 013) సైంటిస్ట్‌-బి (జూనియ‌ర్ జియోఫిజిసిస్ట్): 034) మెడిక‌ల్ ఆఫీస‌ర్ (జీడీఎంవో): 3275) సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్: 11విభాగాలు: అన‌స్థీషియాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ట్యుబ‌రిక్యులోసిస్ అండ్ రెస్పిరేట‌రీ డిసీజెస్, పాథాల‌జీ, రేడియో డ‌యాగ్న‌సిస్.అర్హ‌త‌: పోస్టుల‌ను బ‌ట్టి ఎంబీబీఎస్, స‌ంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌, పీహెచ్‌డీ/ డీఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 31.01.2019.
 

Friday, 11 January 2019

న‌వోద‌య విద్యాల‌య స‌మితిలో 251 పోస్టులు (చివ‌రి తేది: 14.02.19)

న‌వోద‌య విద్యాల‌య స‌మితి దేశ‌వ్యాప్తంగా వివిధ రీజియ‌న్ ఆఫీసులుజ‌వ‌హ‌ర్ న‌వోద‌యవిద్యాల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....టీచింగ్‌నాన్ టీచింగ్ పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య‌: 2511) ప్రిన్సిప‌ల్ (గ్రూప్ ): 25అర్హ‌త‌ఆమాస్ట‌ర్స్ డిగ్రీబీఈడీ ఉత్తీర్ణ‌త‌తోపాటు వివిధ హోదాల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 50 ఏళ్లు మించకూడ‌దు.2) అసిస్టెంట్ క‌మిష‌నర్ (అడ్మినిస్ట్రేష‌న్‌) (గ్రూప్ ): 03అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు రెగ్యుల‌ర్ స‌ర్వీసులో ప‌నిచేస్తూ ఉండాలి.వ‌య‌సు: 45 ఏళ్లు మించకూడ‌దు.3) అసిస్టెంట్ (గ్రూప్ సి): 02అర్హ‌త‌డిగ్రీకంప్యూట‌ర్ ఆప‌రేష‌న్స్ ప‌రిజ్ఞానంఅనుభ‌వం.వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.4) కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ (గ్రూప్ సి): 03అర్హ‌త‌: డిగ్రీఏడాది కంప్యూట‌ర్ డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలివ‌య‌సు18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.5) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) (గ్రూప్ బి): 218అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలివ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌రాత‌ప‌రీక్ష‌ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజుప్రిన్సిప‌ల్అసిస్టెంట్ క‌మిస‌నర్ పోస్టుల‌కు రూ.1500; పీజీటీకి రూ.1000; మిగిలిన‌వాటికి రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలిఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుఫీజు చెల్లింపు ప్రారంభం: 15.01.2019ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.02.2019ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 15.02.2019
 
 
 

Thursday, 10 January 2019

RBI JE Notification: ఆర్‌బీఐలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.450 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు. ఫీజు చెల్లించడానికి జనవరి 27 చివరితేదీగా నిర్ణయించారు. 

పోస్టుల వివరాలు.. 

✪ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 23 పోస్టులు 

అర్హత: 65 శాతం మార్కులతో డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) లేదా 55 శాతం మార్కులతో డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్).

అనుభవం: సంబంధిత విభాగాల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి రెండేళ్లు, డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏడాది అనుభవం ఉండాలి. 

వయసు: 01.01.2019 నాటికి 20 -30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1989 - 01.01.1999 జన్మించి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ద్వారా. 

పే స్కేలు: ఎంపికైన అభ్యర్థులకు ఆరంభంలో రూ.21,400 బేసిక్ పే ఇస్తారు. ఇతర భత్యాలు అన్నీ కలుపుకుని నెలకు రూ.49,026 వరకు అందుతాయి. 

పరీక్ష స్వరూపం..
✦ ఆన్‌లైన్ పరీక్ష: 
 మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు - 50 మార్కులు, ఇంజినీరింగ్ డిసిప్లిన్ (పేపర్-1) 40 ప్రశ్నలు - 100 మార్కులు, ఇంజినీరింగ్ డిసిప్లిన్ (పేపర్-2) 40 ప్రశ్నలు - 100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. 
 పరీక్ష సమయం 150 నిమిషాలు. 
 ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. 
 అభ్యర్థులు ఒక్కో సెక్షన్‌లో అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

 లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ):
 ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఎల్‌పీటీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అధికార/ స్థానిక భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. సరైన భాషా ప్రావీణ్యం లేనివారిని అనర్హులుగా పరిగణిస్తారు. 

ముఖ్యమైన తేదీలు.. 
✷ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2019. 
✷ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2019. 
✷ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2019. 
✷ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 15.02.2019. 
✷ పరీక్ష తేది: ఫిబ్రవరిలో. 

Notification 

Online Application 

RBI Website 

TSLPRB Police Recruitment: పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు కొత్త మెరిట్‌లిస్ట్!

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో పూర్తియ్యేలా కనిపించడంలేదు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు వెల్లడించి మూడు నెలలు గడుస్తున్నా.. ఫిజికల్ ఈవెంట్స్‌ (దేహదారుఢ్య పరీక్షలు) నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ప్రిలిమినరీ పరీక్షలో కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆరు ప్రశ్నలపై స్పష్టత లేదని, వాటిని తొలగించి కొత్తగా మరో మెరిట్‌ జాబితా తయారు చేయాలని ఆదేశించింది. 
హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రకటించిన మెరిట్‌ జాబితాలో సవరణలు చేసి కొత్త జాబితా రూపొందించాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక కొత్త జాబితా తయారీకి కనీసం 20 రోజులైనా పడుతుంది. ఆ తర్వాతే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం తీర్పు ప్రకారం కొత్త మెరిట్‌ జాబితా ప్రకటించినా.. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. ఫిబ్రవరి చివరి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల తరుణంలో ఇంతమంది సిబ్బందిని ఫిజికల్ ఈవెంట్ల కోసం కేటాయించడం సాధ్యంకాదు. దీంతో ఎన్నికలు ముగిసేవరకు తదుపరి ప్రక్రియ పూర్తిచేయడం అసాధ్యంగా మారింది.

రాష్ట్రంలో 16,925 కానిస్టేబుల్, 1217 ఎస్సై పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి నియామక మండలి గతేడాది మే 31న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాతపరీక్షలు నిర్వహించి.. ఫలితాలను కూడా వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 17నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూలు కూడా సిద్ధం చేశారు. అయితే ప్రాథమిక పరీక్షలో కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు కొత్త మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాతే ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించాలని తీర్పు చెప్పింది. దీంతో పోలీసు నియామకాల్లో మరింత జాప్యం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 

Tuesday, 8 January 2019

RRB Group D Exam'కీ', ఫలితాలు ఎప్పుడంటే?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన గ్రూప్-డి పరీక్షల ప్రాథమిక 'కీ' జనవరి 11న విడుదల చేయనున్నారు. ఒకవేళ ప్రాథమిక 'కీ'పై ఏమైనా సందేహాలుంటే జనవరి 17 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం.. ఫైనల్ 'కీ' విడుదల చేసి.. ఫిబ్రవరిలో ఫలితాలను వెలువరించనున్నారు. అయితే ఆన్సర్ కీ, ఫలితాల విడుదలకు సంబంధంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలోని మొత్తం 62,907 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబరు 17 వరకు మొదటి దశ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించారు. 50 రోజులపాటు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఇందులో మ్యాథ్స్-25 ప్రశ్నలు, సైన్స్-25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు మార్కు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33) చొప్పున మార్కులు కోత విధిస్తారు.

గ్రూప్-డి పరీక్షలకు సంబంధించిన 'కీ'ని ఆయా రైల్వేజోన్ల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పుట్టిన తేది ఆధారంగా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. పరీక్ష జరిగిన తేది, షిఫ్ట్‌ల వారీగా 'కీ' అందుబాటులో ఉండనుంది. ఇంగ్లిష్‌లో మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. తమకు సందేహం ఉన్న ఎన్ని అభ్యంతరాలనైనా అభ్యర్థులు తెలిపే వీలుంది. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీజు వసూలు చేయరు.

అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం పరీక్షలకు సంబంధించి తుది 'కీ' (ఫైనల్ కీ) విడుదల చేయనున్నారు. దీని ప్రకారం గ్రూప్-డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)కు అర్హత సాధిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులందరూ పీఈటీ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

Monday, 7 January 2019

గ్రామా పంచాయితీ వోటర్ లిస్టు || Gp Wise Voterlist 2018-19

5TH ORDINARY ELECTIONS TO GRAM PANCHAYAT, 
2018 VIEW GP WARD WISE ELECTORAL ROLLS

మీ గ్రామపంచాయతీలో ఓటర్ల లిస్టు వార్డుల వారీగా ఎలా చూడాలి... అలాగే మీ వార్డులో ఎంతమంది కొత్త ఓటర్లను నమోదు చేశారు.. ఎంతమంది పాత ఓటర్లను లిస్ట్ నుండి తొలగించారు అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు...దీనికి మీరు క్రింది లింకులను ఓపెన్ చేయడం ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు....

⇩గ్రామా పంచాయితీ వోటర్ లిస్టు⇩


⇩ Download Here ⇩


Sunday, 6 January 2019

RPF SI Admit Card: రైల్వే పోలీస్ ఎస్సై హాల్‌టికెట్లు విడుదల

ఇండియ‌న్ రైల్వేస్‌కు సంబంధించిన గ్రూప్-ఎ, గ్రూప్-బి పరిధిలోని ఎస్సై రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డులు) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్‌) సోమవారం (డిసెంబరు 31) విడుదల చేసింది. రాతపరీక్షలకు సంబంధించి ఫేజ్-2, ఫేజ్-3 పరీక్షలకు హాజరయ్యేవారు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేజ్-2 పరీక్షలను జనవరి 5, 6 తేదీల్లో; ఫేజ్-3 పరీక్షలను జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. డిసెంబరు 19న ఫేజ్-1 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 



దేశవ్యాప్తంగా మొత్తం 1,120 ఎస్సై పోస్టల భర్తీకి మే నెలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్టేజ్-1 పరీక్షలు పూర్తికాగా.. జనవరిలో స్టేజ్-2, స్టేజ్-3 ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. 
వెబ్‌సైట్ 

టీఎస్ సెట్స్-2019 షెడ్యుల్ విడుద‌ల‌

Education Newsప్రవేశ పరీక్షలన్ని మే నెలలోనే నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు. మే 3,4,6 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌, మే 8,9 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఎంట్ర‌న్స్ టెస్టును నిర్వహించనున్నారు. అలాగే మే 11న టీఎస్ ఈసెట్, 20న టీఎస్ పీఈసెట్, 23,24వ తేదీల్లో టీఎస్ ఐసెట్, 26న టీఎస్ లాసెట్, పీజీ లాసెట్, 27 నుంచి 29 వరకు టీఎస్ పీజీ ఈసెట్, మే 30, 31 తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్‌, ఈసెట్ ప‌రీక్షల‌ను జేన్‌టీయూహెచ్ నిర్వహించ‌నున్నది. అలాగే ఐసెట్ నిర్వహ‌నను కాక‌తీయ యూనివ‌ర్సిటీకి అప్పగించారు.వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల చేస్తామ‌ని తెలంగాణ ఉన్నత విద్యామండ‌లి తెలిపింది.

కాక‌తీయ వ‌ర్సిటీలో దూర‌విద్య‌ బీఏ/ బీకాం ప్రోగ్రాములు (చివ‌రితేది: 02.02.19)

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం దూర విద్య విధానంలో బీఏ/ బీకాం ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌త్యేక ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.వివ‌రాలు..దూర విద్య బీఏబీకాం (జ‌న‌ర‌ల్ అండ్ కంప్యూట‌ర్స్‌) 2018-19అర్హ‌త‌ఏ విద్యార్హ‌తలు లేకుండా 30.01.2019 నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండి ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు ప్ర‌వేశాల‌కు అర్హులు. 2015 నుంచి 2018 వ‌ర‌కు గ‌తంలో నిర్వ‌హించిన అర్హ‌త ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులైన‌వారు (లేదా) ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన కోర్సు పాసైన అభ్య‌ర్థులు ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష రాయ‌కుండా నేరుగా ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. ప్ర‌త్యేక ప్ర‌వేశార్హ‌త ప‌రీక్ష తేది06.02.2019.ద‌ర‌ఖాస్తు విధానంద‌ర‌ఖాస్తుల‌ను నేరుగా అధ్య‌య‌న కేంద్రాల నుంచి పొంద‌వ‌చ్చు (లేదా) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుకు ఫీజు డీడీ, ఇత‌ర ధ్రువ‌ప‌త్రాల న‌క‌ళ్ల‌ను జ‌త చేసి ఏ అధ్య‌య‌న కేంద్రంలో పరీక్ష రాయాల‌నుకుంటున్నారో ఆ కేంద్రంలో స్వ‌యంగా అందించి ప్ర‌వేశ ప‌త్రాలు పొంద‌వ‌చ్చు. కేంద్ర కార్యాల‌యానికీ ద‌ర‌ఖాస్తులు అందించ‌వచ్చు.ఫీజురూ.200.ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రితేది: 02.02.2019.
 

ఎన్‌పీసీఐఎల్‌లో 162 స్టైపెండ‌రీ టైనీలు (చివ‌రితేది: 31.01.19)

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) కాక్ర‌పార గుజ‌రాత్ సైట్‌లో స్టైపెండ‌రీ ట్రైనీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...మొత్తం ఖాళీల సంఖ్య‌: 1621) స్టైపెండ‌రీ ట్రైనీసైంటిఫిక్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్ డిప్లొమా అభ్య‌ర్థులు): 51విభాగాలు-ఖాళీలు: మెకానికల్-26, ఎల‌క్ట్రిక‌ల్-17, ఎల‌క్ట్రానిక్స్-5, కెమిక‌ల్-3.2) స్టైపెండ‌రీ ట్రైనీసైంటిఫిక్ అసిస్టెంట్ (సైన్స్ గ్రాడ్యుయేట్లు): 06విభాగంకెమిస్ట్రీ-06. 3) సైంటిఫిక్ అసిస్టెంట్బి (సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్య‌ర్థులు): 074) స్టైపెండ‌రీ ట్రైనీటెక్నీషియ‌న్-ప్లాంట్ ఆప‌రేట‌ర్: 51 5) స్టైపెండ‌రీ ట్రైనీటెక్నీషియ‌న్-మెయింటెయిన‌ర్: 47విభాగాలు-ఖాళీలు: ఫిట్ట‌ర్-17, ఎల‌క్ట్రీషియ‌న్-06, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్-10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-7, వెల్డ‌ర్-3, మెషినిస్ట్-3, డీజిల్ మెకానిక్-1.అర్హ‌త‌సైన్స్ స‌బ్జెక్టుల‌తో ప‌దో త‌ర‌గ‌తి, 10+2/ ఐఎస్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌, ప‌ని అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ప్రిలిమ‌న‌రీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు తేదీలు07.01.2019 నుంచి 31.01.2019 వ‌ర‌కు.
 

Thursday, 3 January 2019

మిష‌న్ భ‌గీర‌ధ‌లో క‌న్స‌ల్టెంట్ (చివ‌రితేది: 17.01.19)

తెలంగాణ ప్ర‌భుత్వ మిష‌న్ భ‌గీర‌ధ‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ క‌న్స‌ల్టెంట్ పోస్టు భ‌ర్తీకి ప్రాజెక్ట్కార్యాల‌యం 
ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...ఐఈసీ అండ్ హెచ్ఆర్‌డీ క‌న్స‌ల్టెంట్: 01 పోస్టుఅర్హ‌త‌సోష‌ల్ వ‌ర్క్సోష‌ల్ సైన్స్ఎక్స్‌టెన్ష‌న్ స‌ర్వీస్‌క‌మ్యూనికేష‌న్స్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్‌లోపీజీ,
సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వంగ్రామీణ నీటి స‌రఫ‌రాపారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలుపీఆర్ఐ సిస్ట‌మ్
ఎన్‌జీవో నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన ప‌రిజ్ఞానం ఉండాలి
రూర‌ల్ అండ్క‌మ్యూనిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌కు సంబంధించిన శిక్ష‌ణ‌
మాన‌వ వ‌న‌ర‌లు అభివృద్ధి కార్య‌క‌లాపాలునిర్వ‌హించే సామ‌ర్ధ్యం ఉన్న‌వారికి ప్రాధాన్యం.ద‌ర‌ఖాస్తు విధానంఈమెయిల్ ద్వారా.చివ‌రితేది: 17.01.2019. swsm.telangana@gmail.com
ce-swsm-rwss@telangana.gov.in