పోటీ అంశాలు..
జిల్లాలోని కళాకారులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఓడస్సి, మణిపురి, ఫోక్‌సాంగ్(గ్రూప్), ఫోక్‌డ్యాన్స్(గ్రూప్), కర్ణాటక హూకల్, హిందుస్థానీ హూకల్, ప్లూట్, మృదంగం, వీణా, సితార్, తబల, గిఠార్, హర్మోనియగం, వన్‌యాక్ట్‌ప్లే(గ్రూప్)హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఎలుక్యుషన్ (వ్యక్తిత్త)పోటీలు (హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
జిల్లాస్థాయిలో పాల్గొనే మండలాలు...
ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, బేల, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్, మావల, ఇచ్చోడ, సిరికొండ, జైనథ్, బజార్‌హత్నూర్, నేరడిగోండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాధిగూడ, 18 మండలాల కళాకారులు, విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
కళాకారులకు కాస్ట్యూమ్స్, రవాణా ఖర్చులు...
పోటీల్లో పాల్గొనే వారికి రావాణా, కాస్టూమ్ ఖర్చులు యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించబడుతుంది. ఫోక్‌డ్యాన్స్ గ్రూప్ 20 మంది గ్రూప్‌కు రూ. 1000 చోప్పున, వన్‌యాక్ట్ ప్లే సభ్యులకు రూ. 600 చోప్పున, ఫోక్ గ్రూప్ సాంగ్ 10 మందికి రూ. 500 చోప్పున, వ్యక్తిత్వ, ఇతరాత్ర ప్రదర్శనలో పాల్గొనే వారికి రూ. 50 చోప్పున అందించనున్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9849913061, 9440843848, 9515460477 లకుసంప్రదించాలని కోరారు.
పాటించాల్సిన సూచనలు
పోటీల్లో పాల్గొనే కళాకారులు వారి ప్రదర్శన సామాగ్రిని వెంటతెచ్చుకోవాలి.
ఫోక్ డ్యాన్స్ గ్రూప్‌లో 20 మంది, ఫోక్ సాంగ్‌లో 10 మంది కంటె ఎక్కువ ఉండరాదు.
ఫోక్‌డ్యాన్స్‌లో రికార్డు చేసిన క్యాసెట్‌లు, పెన్‌డ్రైవ్‌లు అనుమతించబడవు
లైవ్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఫోక్‌డ్యాన్స్ గ్రూప్‌కు 15 నిమిషాలు, ఫోక్‌సాంగ్‌కు 7 నిమిషాల సమయం ఉంటుంది
వన్‌యాక్ట్‌ప్లేకు గరిష్టముగా 12మందిని 45 నిమషాల వరకు అనుమనిస్తారు.
వన్‌యాక్ట్‌ప్లే హిందీ లేదా ఇంగ్లీష్ బాషలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతరాత్ర ప్రదర్శనలకు సైతం సమయం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తారు
తమ ఎంట్రిలను బయోడేటాను పూర్తి చేసి ఇవ్వాలి
న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తుది నిర్ణయం.
No comments:
Post a Comment